Mega event
-
అదృష్టం కలిసొస్తేనే...
ముంబై: మెగా ఈవెంట్లలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు కొన్నిసార్లు ప్రదర్శనతో పాటు కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలని భారత మాజీ కెపె్టన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ‘సియెట్’ సంస్థ అందించే వార్షిక క్రికెట్ అవార్డుల్లో ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ పురస్కారం లభించింది. ఈ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్ తన అనుభవాలను వివరించాడు. ద్రవిడ్ ఏమన్నాడంటే‘గతేడాది భారత్ వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియాకు అనూహ్యంగా టైటిల్ పోరులో ఆ్రస్టేలియా చేతిలో పరాజయం ఎదురైంది. ఓ ఆరు నెలల తిరిగేసరికి... ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ డెత్ ఓవర్లలో కనబరిచిన అద్భుత పోరాటంతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి టి20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు సందర్బాల్లోనూ కెపె్టన్‌గా రోహిత్, కోచ్‌గా నేను ఉన్నాను. మాకు టి20 ప్రపంచకప్ టైటిల్‌కు మధ్య దక్షిణాఫ్రికా అడ్డుగా ఉంది. అయితే ఆటతోపాటు కొంచెం అదృష్టం కలసిరావడంతో కప్‌తో ఆనందం మా వశమైంది. ఎంత చేసినా ఆ రోజు మనది కావాలంటే రవ్వంత అదృష్టం కూడా మనతో ఉండాలి.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 30 బంతుల్లో 30 పరుగుల సమీకరణం ప్రత్యరి్థకే అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత చిత్తంతో అనుకున్న ప్రణాళికను కెపె్టన్ రోహిత్ అమలు చేయాలి. ఎవరో ఒకరు మా ప్రయత్నాలకు కలిసి రావాలి. చివరకు సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ రూపంలో అదృష్టం మా పక్షాన నిలిచింది. ఈ క్యాచ్ తుది ఫలితాన్ని మావైపునకు తిప్పింది. కానీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగిన నవంబర్ 19న మాత్రం ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ శతకం శతకోటికిపైగా భారతీయుల కలల్ని కల్లలు చేసింది.టి20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ఇచి్చనప్పటికీ యువ బ్యాటర్లు వారి స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకముందు కూడా భారత క్రికెట్ వెలిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన అకాడమీలు, మెరుగైన మౌలిక వసతులు, లీగ్‌లతో అపార అవకాశాలు యువ క్రికెటర్ల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నాయి’ అని ద్రవిడ్ వివరించారు. -
యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్‌తో సెల్ఫీ పిక్స్ వైరల్
Apple Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మెగా ఈవెంట్‌కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోస్ట్ ఎవైటెడ్ iPhone 15 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు ఇన్‌స్టాలో షేర్ చేసిన సింధు Apple CEO టిమ్ కుక్‌తో సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. (గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) ‘‘Apple Cupertinoలో సీఈవో టిమ్ కుక్‌ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్‌ని , , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్‌లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, Apple Cupertinoలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్‌కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
తొలిసారి మేడిన్ ఇండియా ఐఫోన్..నో వెయిటింగ్! ఇక ఐఫోన్ లవర్స్‌కు పండగే!
Apple iPhone 15: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులంతా యాపిల్ ఐఫోన్ 15 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఇండియాలోని ఐఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఐఫోన్ 15 లాంచింగ్ తరువాత ఎలాంటి వెయిటింగ్ లేకుండానే, గ్లోబల్ సేల్స్ అరంగేట్రం రోజునే ఇండియా మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోందట. అదీ మేడిన్ ఇండియా కొత్త ఐఫోన్ మోడల్స్ రాబోతున్నాయి. అదే నిజమైతే ఐఫోన్ లవర్స్‌కు నిజంగా పండగే. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం లాంచ్ రోజున భారతదేశంలో అసెంబుల్ చేసిన యాపిల్ ఐఫోన్లను విక్రయించనుంది. ఐఫోన్ 15ని దక్షిణాసియాతో పాటు మరికొన్ని ఇతర గ్లోబల్ ప్రాంతాల్లో తొలిరోజే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. భారత్‌లొ సరికొత్త ఐఫోన్లకు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. మేడ్-ఇన్-ఇండియా పథకానికి ఇదొక కీలకమైన మైలురాయి కానుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. (ఐఐటీ కాదని నటిగా..చివరికి బి-టౌన్‌ని కూడా వదిలేసి..ఇన్ని ట్విస్ట్‌లా!) ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో ఇటీవల ఆంక్షలు, యాపిల్‌కు తర్వాతి చైనాగా భారత్ నిలుస్తుందన్న అంచనాల మధ్య ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు ఈ సంవత్సరం ప్రారంభంలో, యాపిల్ తొలి అధికారిక రిటైల్ స్టోర్లను దేశంలో ప్రారంభించింది. కాగా గత నెలలో దక్షిణ తమిళనాడులోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. (రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు) అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా వండర్ లస్ట్ పేరుతో నిర్వహించనున్న మెగా ఈవెంట్లో ఐఫోన్ 15సిరీస్‌ను ప్రకటించనుంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో పాటు, యాపిల్‌వాచ్ సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 9 యాపిల్ వాచ్ అల్ట్రా (2వ తరం) ఐపాడ్స్ లాంచింగ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900గాను, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900 వరకు ఉంటుందని అంచనా -
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: అదిరిపోయే సరికొత్త ఫీచర్లు
Apple Wonderlust Event iOS 17 టెక్ దిగ్గజం ‘వండర్ లస్ట్’ పేరుతో యాపిల్ నిర్వహించనున్న మెగా ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. యాపిల్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో సెప్టెంబర్ 12న జరగనున్న 'వండర్లస్ట్' ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు(సెప్టెంబరు 12, మంగళవారం) 15 సిరీస్‌తోపాటు, ఐప్యాడ్లు, కొత్త వాచ్ సిరీస్‌ను అభిమానుల కోసం లాంచ్ చేయనుంది. దీంతోపాటు ఈ ఈవెంట్లో కార్యక్రమంలో ఐవోఎస్ 17ను యాపిల్ ఆవిష్కరించనుంది. ముఖ్యంగా భారత యూజర్ల కోసం ఐవోఎస్ (ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్) 17లో ప్రత్యేక ఫీచర్లను, watchOS 10 లాంచింగ్ తేదీలను అందించనుందని తెలుస్తోంది. దీంతోపాటు యాపిల్ ఐఫోన్ 15 లైనప్‌ను USB-C పోర్ట్‌లతో అందించనుండటం మరో విశేషం కానుంది. ఐవోఎస్17లో ఇండియన్ ఫీచర్లు ఐఫోన్లలో ప్రధానంగా మూడు కొత్త ఫీచర్లను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. స్మార్ట్ఫోన్లలో డ్యూయల్ సిమ్ కార్డ్‌లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో డబుల్ సిమ్.ఐవోఎస్ 17 ప్రైమరీ, సెకండరీ సిమ్ ప్రతీ సిమ్ కు మెస్సేజ్ కు సంబంధించి వేర్వేరు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు.మిస్డ్ కాల్ కనిపిస్తే , ఆ నంబర్ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేయకపోయినా నేరుగా కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. బైలింగ్విల్ సిరి అసిస్టెంట్ ద్వారా ఒకటికి మించిన భాషలను టింగ్లీష్, హింగ్లీషు లాగా.. ఇంగ్లిష్, హిందీ కలిపి.. లేదంటే ఆంగ్లంతో తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠి భాషలను కలిపి మాట్లాడొచ్చు. అలాగే కీబోర్డ్‌లోనే బిల్టిన్ ట్రాన్సలేషన్ సపోర్టుతో తమిళం, తెలుగు, కన్నడ మలయాళంతో సహా 10 భారతీయ భాషల్లోకి అనువాదానికి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, పంజాబీ డిక్షనరీకి iOS 17 బీటా సపోర్ట్ ఉంటుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. సిరీ ప్లీజ్ సెట్ అలారమ్ మ్యూజిక్ ప్లే లాంటి ఆదేశాలను తెలుగులోనే ఇవ్వొచ్చు. IOS 17 ఎప్పుడు విడుదలవుతుంది? గత సంవత్సరం, Apple iPhone 14 ఈవెంట్ తర్వాత ఐదు రోజుల తర్వాత iOS 16 ను విడుదల చేసింది. ఈ సంవత్సరం, iOS 17 బీటా 8 , పబ్లిక్ బీటా 6 ఇప్పటికే ముగిసింది, కాబట్టి Apple అదే షెడ్యూల్‌ను అనుసరించవచ్చు. iOS 17ని ముందుగానే ప్రయత్నించాలనుకుంటే, బీటాలను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ పబ్లిక్ రిలీజ్ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. -
ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది?
న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 సిరీస్‌ను టెక్ దిగ్గజం ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా లాంచ్ చేసింది. అయితే లేటెస్ట్ ఐఫోన్ 14 ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్‌కు నచ్చినట్టు లేదు. అందుకే సెటైర్ వేయడం ఇంటర్నెట్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఊహించని విధంగా మీమ్‌ను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్ జరుగుతోంది. స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆపిల్ ఐఫోన్, 13, 14ని పోలుస్తూ ఒక స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. ఆపిల్ ప్రకటన తరువాత ఐఫోన్14ను అప్డేట్ చేసుకుంటున్నా అని క్యాప్షన్‌తో ఒక పోస్ట్ పెట్టారు. ఐఫోన్ 13తోపోలిస్తే. కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఐఫోన్ లవర్స్ పెదవి విరుస్తున్న సందర్భంలో ఈవ్ పోస్ట్ చర్చకు దారి తీసింది. మరోవైపు యుఎస్‌లోని ఐఫోన్ మోడల్స్‌లో ఇ-సిమ్ యాక్టివేషన్‌పై కూడా యూజర్లు అంసతృప్తిగా ఉన్నారు. తాజా అప్డేట్స్పై సోషల్ మీడియా మీమ్స్ ఒక రేంజ్లో పేలుతున్నాయి. "తదుపరి ఐఫోన్లో మైక్రోఫోన్ ఉండదు. ఇక మీరు నేరుగా మీరు మాట్లాడాలను కుంటున్న వారి దగ్గరకు వెళ్లాలి." అని ఒక యూజర్ కమెంట్ చేయగా, "త్వరలో ఇది ఐఫోన్‌కు బదులుగా ఇ-ఫోన్ అవుతుందని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఈ సిమ్స్ ఇండియాకు రాకపోవడం మంచిదైంది. ఐఫోన్ 14 సిరీస్ సిమ్ ట్రేతో ఉండడం గొప్ప విషయం. లేదంటే ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితి ఉండేది. తాము ఇంకా ఇ-సిమ్‌లకు సిద్ధంగా లేం అంటూ ఇండియన్ యూజర్ ఒకరు రాశారు. కాగా బుధవారం రాత్రి నిర్వహించిన "ఫార్ అవుట్" మెగా ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14, ఎయిర్‌పాడ్స్ ప్రో, ఆపిల్ వాచ్ అల్ట్రాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 మాక్స్‌ను ఆవిష్కరించింది. ఐఫోన్ 14 ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుండి , ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా ఉంటుంది. Eve Jobs, the daughter of Steve Jobs and Laurene Powell Jobs, reacts to today’s iPhone announcement on her Instagram. pic.twitter.com/bfn2VtbpsA — Yashar Ali 🐘 (@yashar) September 7, 2022 -
ఆపిల్ ఐపోన్14: ధరలు,స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ లీక్స్
న్యూఢిల్లీ:ఆపిల్ అతిపెద్ద వార్షిక ఫార్ అవుట్ ఈవెంట్లో నాలుగు కొత్త ఐఫోన్లను-ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్లస్ మోడలల్స్గా లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. అయితే ఈ ఫోన్లకు సంబంధించి ధరలు,స్పెసికేషన్స్పై చైనీస్ సోషల్ వెబ్సైట్లో తాజా లీక్స్ ఆసక్తికరంగా మారాయి. ఐఫోన్ 14 ప్రొ మాక్స్ : 458ppi పిక్సెల్ డెన్సిటీ 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 2778×1244 రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్ప్లేను లాంచ్ కానుంది. 48ఎంపీ 8కే కెమెరా, 4323 mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ధరలు అంచనాలు: 256 జీబీ మోడల్ రూ. 1,25,525, 512 జీబీ వేరియంట్ రూ. 1,42,801 , 1 టీబీ మోడల్ రూ. 1,60,005గా ఉంటుందని అంచనా. ఐఫోన్ 14 ప్రొ: 6.1-అంగుళాలు డిస్ప్లే , 2532×1170 రిజల్యూషన్ 3200mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. ధరలు అంచనాలు: 256జీబీ మోడల్ ధర రూ. 1,14,011, 512 జీబీ ధర రూ. 1,31,284 . 1టీబీ వేరియంట్ ధర రూ. 1,49,711 ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 14 ప్లస్: 1000నిట్స్ బ్రైట్‌నెస్‌తో ట్రూ టోన్ P3 డిస్ప్లేతో వస్తోందట. 12ఎంపీ 4కే కెమెరా 4325mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ధరలు అంచనాలు: 128జీబీ ధర రూ. 85,219, 256జీబీ రూ. 93,297 , 512 జీబీ ధర రూ. 1,04, 817గా ఉండనుంది. ఐఫోన్ 14: 6.1 అంగుళాల డిస్ప్లేతో రావచ్చనిఅంచనా. అలాగే 173గ్రా బరువుతో 3279mAh బ్యాటరీతో వస్తోందట. ధరలు అంచనాలు బేస్ మోడల్ధర దాదాపు రూ. 77,112గా ఉండనుంది. 256జీబీ మోడల్ ధర రూ. 85,169, 512 జీబీ వేరియంట్‌కు రూ. 1,04,817గా ఆపిల్ నిర్ణయించిదట. అయితే అధికారిక లాంచింగ్ వరకు ఐఫోన్ మోడల్స్, ఫీచర్లు ధరలపై సస్పెన్స్ తప్పదు. ఇది చదవండి: iPhone 14: మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా? -
మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా?
న్యూఢిల్లీ: టెక్దిగ్గజం ఆపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్ 14, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఇంకా ఎయిర్ పాడ్స్ ప్రొ-2, ఆపిల్ వాచ్ ఎస్ఈ-2 లాంటి కీలక ఉత్పత్తుల లాంచింగ్ అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేదికపై ఎలాంటి విప్లవాత్మక ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆపిల్ ఐఫోన్ 14: కోవిడ్ సంక్షోభం తరువాత నిర్వహిస్తున్న ఆపిల్ అతిపెద్ద ఈవెంట్ కావడంతో మరింత జోష్ నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన పుకార్లు , లీక్‌ల ప్రకారం భారీ అప్డేట్స్ తో ఐఫోన్ -14 సిరీస్‌ను తీసుకొస్తోంది. 6.7 అంగుళాల భారీ డిస్ప్లే, 48ఎంపీ బిగ్ కెమెరా, ఆన్‌లోనే ఉండే డిస్ప్లే లాంటివి ఇందులో ఉన్నాయి. ఆపిల్ స్మార్ట్‌వాచ్ 8: ఆపిల్ 7 వాచ్ డిజైన్‌కు దగ్గరానేఈ కొత్త సిరీస్ ఉన్నప్పటికీ మరిన్ని విప్లవాత్మక మార్పులతో కొత్త వాచెస్ సీరిస్‌ను తీసుకొస్తోంది. ఆపిల్ స్మార్ట్‌వాచ్ వాచ్ 8 ప్రో: అతిపెద్ద డిస్ప్లే, టైటానియం సూపర్ డిజైన్, అదనపు బటన్‌తో ఈ స్మార్ట్‌వాచ్‌ను తీసుకు రానుందని సమాచారం. ఎయిర్‌పాడ్స్ ప్రో 2: తదుపరి జనరేషన్గా వస్తున్న వీటిల్లో ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సామర్థ్యాలను పెంచడంతో పాటు కొత్త డిజైన్‌తో లాంచ్ చేయనుంది. అలాగే కొత్త ఛార్జింగ్ కేస్ అంతర్నిర్మిత స్పీకర్‌తో ఫైండ్ మై ఫంక్షనాలిటీ ఫీచర్‌ను కూడా జోడించిందిట. ఈ ఆపిల్ మెగా ఈవెంట్ ఆపిల్ డాట్‌కామ్,యూ ట్యూబ్‌లో లైవ్ ఉంటుంది. -
కొత్త సిరీస్ లాంచ్ తరువాత పాత సిరీస్‌కు ఆపిల్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందిట. సెప్టెంబరు 7న నిర్వహించనున్న గ్లోబల్ ఈవెంట్ ఆపిల్ కొత్త మోడల్ సిరీస్ వాచెస్ లాంచ్ కాగానే పాత సిరీస్‌ను నిలిపివేయనుందని తెలుస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్‌లు త్వరలో నిలిపియనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా మార్కెట్లో వీటి విక్రయాలను నిలిపివేయనుందట.రాబోయే watchOS 9 Apple Watch Series 3కి సపోర్ట్ చేయని కారణంగా ఆన్లైన్ స్టోర్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతున్న ఆపిల్ వాచ్ సిరీస్ 3 మోడల్స్‌ను త్వరలో ఆపివేస్తుందని తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే అమెరికా,వాచ్ సిరీస్ 3 కాన్ఫిగరేషన్లలో మూడు ప్రస్తుతం యూకే ఆస్ట్రేలియాలో స్టాక్‌లో లేవనీ, అమెరికా స్టోర్‌లో సిరీస్ 3 మోడల్ అందుబాటులో లేవని MacRumors రిపోర్ట్ చేసింది. 2017లో ఆపిల్ వాచ్ సిరీస్ 3ను లాంచ్ చేసింది. కాగా కరోనా మహమ్మారి రెండేళ్ల తరువాత యుఎస్‌లోని ఆపిల్ కుపెర్టినో క్యాంపస్‌లో మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో నాలుగు ఐఫోన్ 14 మోడల్స్‌తోపాటు, వాచెస్, ఇతర ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తోందని అంచనా. ముఖ్యంగా వాచెస్ సిరీస్ 8, వాచ్ ప్రో, హై-ఎండ్ సిరీస్ 8 మోడల్, సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ ఎస్ఈని లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. -
APPLE: యాపిల్ మెగా ఈవెంట్.. 13 సిరీస్‌పై ఉత్కంఠ
iPhone 13 Launch Event: ప్రతీ ఏడాదిలాగే ఈ సెప్టెంబర్‌లోనూ మెగా ఈవెంట్‌కు యాపిల్ సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి(సెప్టెంబర్ 14) 10గం.30 ని. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ఈవెంట్ ద్వారా యాపిల్ కొత్త ప్రొడక్టులను లాంఛ్ చేయనుంది. కరోనా వల్ల వర్చువల్‌గా ఈవెంట్ నిర్వహిస్తుండడం యాపిల్‌కు ఇది రెండోసారి. ఇక వారం నుంచి ఈ మెగా ఈవెంట్ కోసం ఐఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీల పేరిట పలు ఫీచర్లు తెరపైకి వస్తున్నాయి. ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ మొత్తం నాలుగు మోడల్స్ ఒకేసారి రిలీజ్ చేయడం ద్వారా సంచలనానికి యాపిల్ తెర తీయబోతోందనే ప్రచారం నడుస్తోంది. ఐఫోన్ 13, మినీ మోడల్స్‌లో లార్జ్ కెమెరా సెన్సార్లు ఉండొచ్చని, ప్రొ-ప్రొమ్యాక్స్లో అల్ట్రా వైడర్ కెమెరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో యాపిల్ స్మార్ట్‌వాచ్ 7 సిరీస్, థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్(Airpods 3) కూడా రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలోని క్యూపర్టినో యాపిల్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఈ ఈవెంట్ టెలికాస్ట్ కానుంది. యాపిల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా లైవ్ వీక్షించొచ్చు. ఇక యాపిల్ టీవీ యూజర్స్.. యాప్ ద్వారా కీనోట్‌ను చూడొచ్చు. సిమ్ లేకుండానే.. ఐఫోన్ 13కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సిమ్ కార్డ్ అవసరం లేకుండా లియో టెక్నాలజీ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుందని, ఎమర్జెన్సీ మెసేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే ఫోన్ వెయిట్, మందం కిందటి ఏడాది మోడల్స్ కంటే ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం టూమచ్ ప్రచారం.. అయితే 13 అనేది ఫారిన్ దేశాల్లో అచ్చీరాని నెంబర్. ఈ మూఢనమ్మకంతో 13 సిరీస్‌ను తప్పించి.. 14 సిరీస్‌ను యాపిల్ రిలీజ్ చేస్తుందేమో అనే ఊహాగానాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. అందుకే సెప్టెంబర్ 13వ తేదీన కాకుండా.. 14వ తేదీన లాంఛ్‌కు ముహూర్తం పెట్టిందనే టాక్ కూడా సోషల్ మీడియాలో నడిచింది. కానీ, ఇలాంటి నమ్మకాల్ని పట్టించుకోకుండా యాపిల్ 13 సిరీస్ ద్వారానే రాబోతోందని తెలుస్తోంది. క్లిక్ చేయండి: ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు! ధర అటుఇటుగా.. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం అమెరికాలో ఐఫోన్ 13 సిరీస్ కనిష్ట ధర 799 డాలర్లుగా ఉంది. అయితే భారత మార్కెట్‌కి వచ్చే సరికి స్థానిక ట్యాక్సుల ఆధారంగా ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెర్షన్ అమెరికా (భారత్) ఐఫోన్ 13 799 డాలర్లు (రూ. 58,600) ఐఫోన్ 13 మినీ 699 డాలర్లు (రూ. 51,314) పై రెండు 64జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో రావొచ్చు!. బ్లాక్, బ్లూ, పింక్, పర్పుల్, రెడ్, వైట్ కలర్స్‌లో ఫోన్లు రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. ప్రతీకాత్మక చిత్రం ఐఫోన్ 13 ప్రో 999 డాలర్లు (రూ.73,300) ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ 1,099 డాలర్లు (రూ 80,679) 128జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టెరేజ్ వెర్షన్లలో రిలీజ్ కావొచ్చు. అయితే ఈ రెండు వెర్షన్లలో 1టీబీ స్టోరేజ్ మోడల్ అంటూ ఒక పుకారు సైతం చక్కర్లు కొడుతోంది. బ్లాక్, బ్రౌన్, గోల్డ్, సిల్వర్ కలర్స్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే పైన చెప్పుకున్న ఫీచర్లు, ధరలన్నీ అంచనాలు, ఊహాగానాలు మాత్రమే. యాపిల్ సంస్థ పైవాటిలో ఏ ఒక్కదానిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కేవలం ఎక్స్పర్ట్స్, టెక్ వెబ్సైట్ల అంచనాలను బట్టే ఇస్తున్నాం. చదవండి: యాపిల్ మార్కెట్ ఢమాల్! భారమంతా ఐఫోన్ 13 పైనే? -
అదిరే ‘షో’కుల్
-
ఐఫోన్ 7 లాంచింగ్‌కు ఆహ్వానాలు వచ్చేశాయ్
శాన్ఫ్రాన్సిస్కో : యాపిల్ ఐఫోన్ 7 కోసం వేచిచూస్తున్న వినియోగదారులకు వచ్చే వారంలో శుభవార్త అందనుందట. శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియంలో యాపిల్ ఓ మెగా ఈవెంట్ నిర్వహించబోతుందట. ఈ మెగాఈవెంట్లో ఐఫోన్ 7 ను వినియోగదారుల మందుకు తీసుకురానున్నట్టు ఫోర్బ్స్ నివేదిక వెల్లడిచింది. ఈ ప్రత్యేక ఈవెంట్‌కు టెక్ దిగ్గజం యాపిల్, మీడియాకు ఆహ్వానాలు పంపుతుందట. అయితే ఈ ఈవెంట్ దేనికి సంబంధించో తెలుపకుండా యాపిల్ ఆహ్వానం పలుకతుండటంతో, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, తన తర్వాతి తరం యాపిల్ వాచ్‌లను ఈ ఈవెంట్లోనే ఆవిష్కరించబోతుందని సమాచారం. సెప్టెంబర్ 9 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లను యాపిల్ చేపట్టి, సెప్టెంబర్ 16నుంచి విక్రయాలు చేపట్టనున్నట్టు ఫోర్బ్స్ రిపోర్టు తెలిపింది. ఐఫోన్7 గా వినియోగదారుల ముందుకు రాబోతున్న ఈ ఫోన్, డ్యుయల్ కెమెరా, ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్‌లు ప్రత్యేక ఫీచర్లుగా అలరించబోతున్నాయట. స్క్రీన్కు కింద ఉన్న ఫిజికల్ టచ్ ఐడీ బటన్‌ను తొలగించి, నేరుగా బయోమేట్రిక్ కార్యాచరణతో ఇంటిగ్రేట్ చేయాలని యాపిల్ ప్లాన్ చేస్తోందట.. శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ నోట్7కు పోటీగా యాపిల్ తన ఐఫోన్‌ను విడుదల చేయనున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఫోన్ లాంచింగ్‌పై అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టబోయే ఫోన్ ఐఫోన్ 6ఎస్ఈ అని, పూర్తి రీడిజైన్డ్ ప్రొడక్ట్‌ను 2017లో యాపిల్ పదేళ్ల వార్షిక సందర్భంగా ఆవిష్కరిస్తుందని టెక్ విశ్లేషకులు అంచనావేశారు. ఈ రూమర్లన్నింటికీ సెప్టెంబర్‌లో నిర్వహించబోయే ఈ మెగా ఈవెంట్ చెక్ పెట్టనుంది. -
ప్రపంచకప్ ప్రచారకర్తగా...
⇒ వరుసగా రెండోసారి ‘మాస్టర్’ ఎంపిక ⇒ ఐసీసీ ప్రకటన దుబాయ్: వరుసగా రెండోసారి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్... వన్డే ప్రపంచకప్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు (2,278) సాధించిన ఆటగాడిగా సచిన్‌కు పేరుంది. 2003 టోర్నీలో 673 పరుగులతో అతను ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ‘ఐసీసీ ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాలను ప్రచారకర్త హోదాలో సచిన్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు జరిగే ఈ టోర్నీ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఈవెంట్’ అని ఐసీసీ తెలిపింది. మరోవైపు ఈ హోదాపై సచిన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘వరుసగా రెండోసారి ప్రపంచకప్ అంబాసిడర్‌గా నియమించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఓ ఆటగాడిగా ఆరు టోర్నీలు ఆడిన అనంతరం ఈసారి జరిగే ఈవెంట్ నాకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. 1987 ప్రపంచకప్‌లో ‘బాల్ బాయ్’గా బయటి నుంచి చూసినట్టే ఈసారి కూడా అలాగే చూడాలి. ఏ జట్టైనా ప్రపంచకప్ గెలుచుకుంటే అది చాలా మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా ఉంటుంది. కప్ సాధించాలనే కలను నేను 22 ఏళ్ల నిరీక్షణ తర్వాత తీర్చుకున్నాను’ అని 41 ఏళ్ల సచిన్ అన్నాడు. -
కరోలినా కొత్త చరిత్ర
- స్పెయిన్ నుంచి తొలి విశ్వవిజేత - ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కోపెన్‌హాగెన్: చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది. తద్వారా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. సెమీస్‌లో ఓడిన భారత యువ సంచలనం పి.వి.సింధు, మినత్సు మితాని (జపాన్)లకు కాంస్య పతకాలు లభించాయి. గతేడాది ఫైనల్లో ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి జురుయ్ లీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 37 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో యూరోప్ క్రీడాకారిణికి టైటిల్ లభించడం ఇది మూడోసారి మాత్రమే కావడం విశేషం. గతంలో లెన్ కోపెన్ (1977లో), కామిల్లా మార్టిన్ (1999లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)కి మూడోసారీ నిరాశే ఎదురైంది. ఫైనల్లో రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా) 21-19, 21-19తో లీ చోంగ్ వీపై గెలిచి తొలిసారి ప్రపంచ టైటిల్‌ను దక్కించుకున్నాడు. -
భారత్‌లో అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఫుట్‌బాల్‌కు సంబంధించి ఓ మెగా ఈవెంట్ భారత్‌లో జరగనుంది. 2017లో జరిగే అండర్-17 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) సాకర్ టోర్నమెంట్‌ను నిర్వహించే భాగ్యం పొందడం భారత్‌కు ఇదే తొలిసారి. బ్రెజిల్లో గురువారం జరిగిన ‘ఫిఫా’ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 24 దేశాలు పాల్గొనే ఈ టోర్నీ మ్యాచ్‌లను న్యూఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబై, చెన్నై, గువాహటి, మార్గోవా, కొచ్చి, బెంగళూరు నగరాల్లో నిర్వహిస్తారు. బిడ్డింగ్‌లో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉజ్బెకిస్థాన్‌లు పోటీపడగా భారత్ ఈ మూడు దేశాల్ని అధిగమించి ఆతిథ్య అవకాశాన్ని పొందింది. గతంలో భారత్ ఆసియా అండర్-20 ఫెడరేషన్ కప్ (2006), ఏఎఫ్సీ చాలెంజ్ కప్ (2008)లను నిర్వహించినప్పటికీ ఫిఫా కప్‌కు మాత్రం ఎప్పుడూ ఆతిథ్యమివ్వలేదు. తొలుత ప్రభుత్వ గ్యారంటీ, పన్ను మినహాయింపుల నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో జనవరిలో దాఖలు చేసిన ప్రాథమిక బిడ్ తిరస్కరణకు గురైంది. తదనంతరం భారత ప్రభుత్వం నుంచి కూడా మద్దతు లభించడంతో గత నవంబర్‌లో బిడ్ దాఖలు చేశారు. దీంతో పాటు ‘ఫిఫా’ అండదండలు లభించడంతో బిడ్డింగ్‌లో భారత్ నెగ్గగలిగింది. ఈ టోర్నీతో భారత్‌లోనూ ఫుట్‌బాల్ క్రీడకు ప్రాచుర్యం పెరుగుతుందని ‘ఫిఫా’ అధ్యక్షుడు బ్లాటర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
మళ్లీ రజతమే
పారిస్: కీలకదశలో ఒత్తిడికిలోనైన భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి ప్రపంచ కప్ ఫైనల్స్‌లో మూడోసారీ రజతంతో సంతృప్తి పడింది. 2010, 2011లలో రన్నరప్‌గా నిలిచిన ఈ జార్ఖండ్ అమ్మాయి ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో దీపిక 4-6 సెట్ పాయింట్లతో (30-27, 28-28, 19-29, 27-28, 29-29) యున్ ఓక్ హీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 7-1తో ఐదా రొమాన్ (మెక్సికో)పై గెలుపొందగా... ‘షూట్అవుట్’ ద్వారా తేలిన సెమీఫైనల్లో దీపిక 6-5తో లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత అలెజాంద్రా వాలెన్సియా (మెక్సికో)ను ఓడించింది. -
చరిత్ర సృష్టించిన సందీప్
బుడాపెస్ట్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకంతో మొదలుపెట్టిన భారత్ పతకంతోనే ముగించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరిరోజు భారత్‌కు కాంస్య పతకం లభించింది. పురుషుల గ్రీకో రోమన్ 66 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సందీప్ తులసీ యాదవ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో గ్రీకో రోమన్ స్టయిల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా సందీప్ చరిత్ర సృష్టించాడు. ‘రెప్‌చేజ్’ కాంస్య పతక పోరులో సందీప్ 4-0తో అలెగ్జాండర్ మక్సిమోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. అంతకుముందు ‘రెప్‌చేజ్’ రెండో రౌండ్లో సందీప్ 6-4తో షారూర్ వర్దాన్‌యాన్ (స్వీడన్)పై నెగ్గి కాంస్య పతక బౌట్‌కు అర్హత పొందాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సందీప్ రెండో రౌండ్లో 5-0తో శాంచెజ్ (స్పెయిన్)పై, రెండో రౌండ్లో 6-2తో మిహైల్ కాస్నిక్‌యెను (మాల్దొవా)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో సందీప్ 0-10తో హాన్ సు రియు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయా డు. హాన్ సు రియు ఫైనల్‌కు చేరడంతో సందీప్‌కు ‘రెప్‌చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది. -
ప్రపంచ జూనియర్ బాక్సింగ్: క్వార్టర్స్‌లో ఆదిత్య, ఆశిష్
న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత యువ బాక్సర్లు ఆదిత్య మాన్ (66 కేజీలు), ఆశిష్ (63 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లోని పురుషుల ప్రిక్వార్టర్స్ బౌట్లో లాస్జోల్ కొజక్ (హంగేరి)పై ఆదిత్య గెలిచాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్లో భారత బాక్సర్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్‌లు కురిపించాడు. అంతకుముందు జరిగిన తొలి బౌట్లో ఆదిత్య.... ఎస్ట్రాడా (అమెరికా)పై నెగ్గాడు. 63 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో జెగ్రోస్ అర్టిజోమూవ్స్ (లాత్వియా)పై ఆశిష్ నెగ్గాడు. కెరీర్లో తొలి అంతర్జాతీయ టోర్నీ ఆడుతోన్న ఈ చండీగఢ్ బాక్సర్ రెండో రౌండ్లో మార్సెల్ రుంప్లర్ (ఆస్ట్రియా)ను బెంబేలెత్తాడు. దీంతో రిఫరీ ఆర్ఎస్సీఓసీ (రిఫరీ స్టాప్డ్ కంటెస్ట్ అవుట్ క్లాస్డ్) ద్వారా భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. క్వార్టర్స్‌లో కాసియో ఒలివర్ సాంటోస్ (బ్రెజిల్)తో ఆదిత్య; షబోస్ నెగ్మాతుల్లెవ్ (తజకిస్థాన్)తో ఆశిష్ తలపడతారు. ఫెదర్ వెయిట్ (57 కేజీ) విభాగం ప్రిక్వార్టర్స్‌లో విష్ణు దయానంద్... డెల్టన్ స్మిత్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు. తొలి రౌండ్లో ఆసియా లైట్ వెయిట్ చాంపియన్ ప్రయాగ్ చౌహాన్ (60 కేజీ)... ముజఫర్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో; ఫ్లయ్ వెయిట్ డివిజన్లో గౌరవ్... యుంగ్హన్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశారు.