న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత యువ బాక్సర్లు ఆదిత్య మాన్ (66 కేజీలు), ఆశిష్ (63 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లోని పురుషుల ప్రిక్వార్టర్స్ బౌట్‌లో లాస్‌జోల్ కొజక్ (హంగేరి)పై ఆదిత్య గెలిచాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌లో భారత బాక్సర్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్‌లు కురిపించాడు. అంతకుముందు జరిగిన తొలి బౌట్‌లో ఆదిత్య.... ఎస్ట్రాడా (అమెరికా)పై నెగ్గాడు. 63 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో జెగ్‌రోస్ అర్టిజోమూవ్స్ (లాత్వియా)పై ఆశిష్ నెగ్గాడు. కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టోర్నీ ఆడుతోన్న ఈ చండీగఢ్ బాక్సర్ రెండో రౌండ్‌లో మార్సెల్ రుంప్లర్ (ఆస్ట్రియా)ను బెంబేలెత్తాడు.
దీంతో రిఫరీ ఆర్‌ఎస్‌సీఓసీ (రిఫరీ స్టాప్డ్ కంటెస్ట్ అవుట్ క్లాస్‌డ్) ద్వారా భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. క్వార్టర్స్‌లో కాసియో ఒలివర్ సాంటోస్ (బ్రెజిల్)తో ఆదిత్య; షబోస్ నెగ్మాతుల్లెవ్ (తజకిస్థాన్)తో ఆశిష్ తలపడతారు. ఫెదర్ వెయిట్ (57 కేజీ) విభాగం ప్రిక్వార్టర్స్‌లో విష్ణు దయానంద్... డెల్టన్ స్మిత్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు. తొలి రౌండ్‌లో ఆసియా లైట్ వెయిట్ చాంపియన్ ప్రయాగ్ చౌహాన్ (60 కేజీ)... ముజఫర్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో; ఫ్లయ్ వెయిట్ డివిజన్‌లో గౌరవ్... యుంగ్‌హన్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశారు.
ప్రపంచ జూనియర్ బాక్సింగ్: క్వార్టర్స్‌లో ఆదిత్య, ఆశిష్
Published Fri, Sep 13 2013 1:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement