కరోలినా కొత్త చరిత్ర | Spain's Carolina Marin wins World Badminton Championships | Sakshi
Sakshi News home page

కరోలినా కొత్త చరిత్ర

Published Mon, Sep 1 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

కరోలినా కొత్త చరిత్ర

కరోలినా కొత్త చరిత్ర

- స్పెయిన్ నుంచి తొలి విశ్వవిజేత
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
కోపెన్‌హాగెన్: చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది. తద్వారా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

సెమీస్‌లో ఓడిన భారత యువ సంచలనం పి.వి.సింధు, మినత్సు మితాని (జపాన్)లకు కాంస్య పతకాలు లభించాయి. గతేడాది ఫైనల్లో ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి జురుయ్ లీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 37 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో యూరోప్ క్రీడాకారిణికి టైటిల్ లభించడం ఇది మూడోసారి మాత్రమే కావడం విశేషం. గతంలో లెన్ కోపెన్ (1977లో), కామిల్లా మార్టిన్ (1999లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)కి మూడోసారీ నిరాశే ఎదురైంది. ఫైనల్లో రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా) 21-19, 21-19తో లీ చోంగ్ వీపై గెలిచి తొలిసారి ప్రపంచ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement