పారిస్: కీలకదశలో ఒత్తిడికిలోనైన భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి ప్రపంచ కప్ ఫైనల్స్‌లో మూడోసారీ రజతంతో సంతృప్తి పడింది. 2010, 2011లలో రన్నరప్‌గా నిలిచిన ఈ జార్ఖండ్ అమ్మాయి ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో దీపిక 4-6 సెట్ పాయింట్లతో (30-27, 28-28, 19-29, 27-28, 29-29) యున్ ఓక్ హీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 7-1తో ఐదా రొమాన్ (మెక్సికో)పై గెలుపొందగా... ‘షూట్‌అవుట్’ ద్వారా తేలిన సెమీఫైనల్లో దీపిక 6-5తో లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత అలెజాంద్రా వాలెన్సియా (మెక్సికో)ను ఓడించింది.
మళ్లీ రజతమే
Published Mon, Sep 23 2013 1:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement