
ట్లాక్స్‌కాలా (మెక్సికో): భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ వరల్డ్‌కప్ ఫైనల్లో రజత పతకాన్ని (మహిళల రికర్వ్ ఈవెంట్) కైవసం చేసుకుంది. ఫైనల్లో దీపికా.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన అర్చర్ లి జియామన్ చేతిలో 0-6 తేడాతో ఓటమిపాలైంది.
మూడేళ్ల విరామం తర్వాత వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరిన దీపికా అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో దీపికా తడబాటుకు లోనైంది. ఆర్చరీ వరల్డ్‌కప్ టోర్నీలో దీపికాకు ఇది ఆరో పతకం. 2011, 2012, 2013, 2015, 2024 ఎడిషన్లలో దీపికా రజత పతకాలు సాధించింది. 2018 ఎడిషన్‌లో కాంస్యం సొంతం చేసుకుంది.
చదవండి: ధీరజ్, సురేఖలకు నిరాశ
Comments
Please login to add a commentAdd a comment