Archery World Cup Finals 2023: Vennam Jyothi Surekha Eligible For World Cup Finals - Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ ఫైనల్స్‌ టోర్నీకి ఆంధ్రప్రదేశ్‌ ఆణిముత్యం అర్హత

Published Thu, Apr 27 2023 10:30 AM | Last Updated on Thu, Apr 27 2023 11:49 AM

Vennam Jyothi Surekha Eligible For World Cup Finals - Sakshi

ఆర్చరీ సీజన్‌ ముగింపు టోర్నీ ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెక్సికోలో జరుగుతుంది.

తుర్కియేలో గతవారం జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది.

ఈ ప్రదర్శనతో సురేఖకు మరో మూడు ప్రపంచకప్‌లు మిగిలి ఉండగానే ఫైనల్స్‌కు బెర్త్‌ దక్కింది. ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీ కొలంబియాలో జూన్‌ 13 నుంచి 18 వరకు జరుగుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement