
ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు సాధించి సత్తాచాటిన ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సురేఖ 4వ స్థానానికి (కాంపౌండ్) చేరుకుంది.
ఇప్పటి వరకు 11వ ర్యాంక్‌లో ఉన్న ఆమె తాజా ప్రదర్శనతో ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకటం విశేషం.