world rankings
-
చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళా స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో మనిక 24వ ర్యాంక్‌లో నిలిచింది. గతవారం సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన మనిక ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్ నుంచి 24వ ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–25లో నిలిచిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. మిగతా క్రీడాకారుల ర్యాంకులు ఇలాగతవారం 38వ ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు పడిపోయి 41వ ర్యాంక్‌కు చేరుకోగా... యశస్విని రెండు స్థానాలు పడిపోయి 99వ ర్యాంక్‌లో నిలిచింది.పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ఆచంట శరత్ కమల్ 40వ ర్యాంక్‌లో, మానవ్ ఠక్కర్ 62వ ర్యాంక్‌లో, హర్మీత్ దేశాయ్ 63వ ర్యాంక్‌లో, సత్యన్ 68వ ర్యాంక్‌లో ఉన్నారు -
వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో వెనుక పడిన భారత్.. రీజన్ ఇదే!
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (IMD) విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ ఇంతకు ముందుకంటే కూడా నాలుగు స్థానాలు దిగజారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోని 64 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 56 స్థానం పొందింది. 2022లో ఇండియా ర్యాంక్ 52 కావడం గమనార్హం. ఈ లెక్కన గతం కంటే ఇండియా నాలుగు స్థానాలు కిందికి వెళ్ళింది. భారతదేశ మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పటికీ, ప్రతిభ పోటీతత్వాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇది మెరుగుపడితే ఇండియా మరింత ముందుకు వెళుతుందని అభిప్రాయపడుతున్నారు. 2023 ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, లక్సెంబర్గ్ రెండవ స్థానంలో ఉంది, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా 15వ స్థానంలో, యూకే 35, చైనా 41 ఉన్నాయి. చివరి రెండు స్థానాల్లో బ్రెజిల్ 63, మంగోలియా 64 చేరాయి. ఇదీ చదవండి: భారత్‌లో ధాన్యం ధరలు పెరిగే అవకాశం! కారణం ఇదే.. ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ అనేది క్వాలిటీ లైఫ్, చట్టబద్ధమైన కనీస వేతనం, ప్రాథమిక & మాధ్యమిక విద్యతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించడం జరుగుతుంది. దీని ప్రకారం భవిష్యత్ సంసిద్ధతలో భారతదేశం 29వ స్థానంలో ఉన్నట్లు తెలిసింది. -
డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!
సాక్షి,ముంబై:డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా టాప్‌లో నిలిచింది. రికార్డు కలెక్షన్స్‌తో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2022 సంవత్సరంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో భారత దేశం ఐదు దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు మొత్తం నాలుగు దేశాల లావాదేవీలను కలిపిన దానికంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ వివరాలు మైగోవ్ఇండియా ట్విటర్లో షేర్ చేసింది. ఈ డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో భారతదేశం గ్లోబల్ రియల్ టైమ్ చెల్లింపులలో 46 శాతం వాటాను సొంతం చేసుకుంది. భారతదేశంలో డిజిటల్ చెల్లింపు లావాదేవీలు ఇతర నాలుగు ప్రముఖ దేశాలతో కలిపిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డిజిటల్ చెల్లింపు ల్యాండ్‌స్కేప్‌లో భారతదేశం ఆధిపత్యం కొనసాగిస్తోందని ట్వీట్ చేసింది. (రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!) ఈ జాబితాలో 29.2 మిలియన్లతో బ్రెజిల్ రెండో స్థానంలో, చైనా 17.6 మిలియన్ల లావాదేవీలతో మూడో స్థానంలోనూ నిలిచాయి. ఇక 16.5 మిలియన్లతో 4వ స్థానంలో థాయిలాండ్ ఉండగా, దక్షిణ కొరియా 8 మిలియన్ల లావాదేవీలతో అయిదో స్థానంలో ఉందని MyGovIndia డేటా పేర్కొంది. ఇదీ చదవండి: తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు! 📈 India keeps dominating the digital payment landscape! 💸🇮🇳 With innovative solutions and widespread adoption, we're leading the way towards a cashless economy. 💻#9YearsOfTechForGrowth #9YearsOfSeva@GoI_MeitY @AshwiniVaishnaw @Rajeev_GoI@alkesh12sharma @_DigitalIndia pic.twitter.com/cSfsFsq0mW — MyGovIndia (@mygovindia) June 9, 2023 -
స్మార్ట్‌వాచ్ విభాగంలో ఫైర్-బోల్ట్ హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ వేరబుల్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ కొత్త రికార్డు సృష్టించింది. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం స్మార్ట్‌వాచ్ విభాగంలో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచినట్టు కంపెనీ వెల్లడించింది. మూడేళ్లలోనే 9 శాతం వాటాతో ఈ ఘనత సాధించినట్టు వివరించింది. మార్చి త్రైమాసికంలో 57 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపింది. -
నీరజ్... నంబర్‌వన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెటిక్స్ ముఖచిత్రంగా మారిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కెరీర్లో మరో గొప్ప ఘనతను సాధించాడు. సోమవారం విడుదల చేసిన వరల్డ్ అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నీరజ్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం నీరజ్ 1455 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 1433 పాయింట్లు) రెండో స్థానంలో, జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 1416 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా నీరజ్ అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం... 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం... 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం... 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణం... ఇలా నీరజ్ అంతర్జాతీయ వేదికలపై పతకాల పంట పండిస్తున్నాడు. తాజా సీజన్లో భాగంగా ఈనెలలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్ తొలి సిరీస్‌లో నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. తదుపరి వచ్చే నెలలో ఫిన్లాండ్లో జరిగే పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. -
Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత బ్యాడ్మింటన్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ప్రకటించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–20లో ఉన్న వారిని నేరుగా ఎంపిక చేయగా... మిగతా బెర్త్‌లను ఆదివారం ముగిసిన సెలెక్షన్ ట్రయల్స్ టోర్నీ ద్వారా ఖరారు చేశారు. భారత పురుషుల జట్టు: ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్, మిథున్ మంజునాథ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల–ఎంఆర్ అర్జున్, రోహన్ కపూర్, సాయిప్రతీక్. మహిళల జట్టు: పీవీ సింధు, అష్మిత, అనుపమ, మాళవిక, గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, సిక్కి రెడ్డి. -
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి.. ఏకంగా 7 స్థానాలు ఎగబాకి..!
ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు సాధించి సత్తాచాటిన ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సురేఖ 4వ స్థానానికి (కాంపౌండ్) చేరుకుంది. ఇప్పటి వరకు 11వ ర్యాంక్‌లో ఉన్న ఆమె తాజా ప్రదర్శనతో ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకటం విశేషం. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక.. పడిపోయిన ఆకుల శ్రీజ ర్యాంకు
International Table Tennis Federation (ITTF) world rankings- న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌లో నిలిచింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మనిక గత నవంబర్‌లో ఆసియా కప్‌లో కాంస్యం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతవారం దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో కాంస్యం గెలిచి 140 ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించింది. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ ఆరు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్ 41వ ర్యాంక్‌లో, ఆచంట శరత్ కమల్ 46వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణకు చెందిన సూరావజ్జుల స్నేహిత్ మూడు స్థానాలు పడిపోయి 125వ ర్యాంక్‌లో నిలిచాడు. చదవండి: Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
Delhi: దేశ రాజధానికి మరో అప్రతిష్ట..
న్యూఢిల్లీ: కాలుష్యకాసారంగా మారిన ఢిల్లీ పరువు మరోసారి పోయింది. గతంలోనూ కాలుష్యమయ నగరంగా పేరుమాసిన ఢిల్లీ తాజాగా 2022 ఏడాదికి దేశంలోనే అత్యంత కాలుష్యమయ నగరంగా రికార్డులకెక్కింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ గణాంకాలతో ఒక నివేదిక విడుదలచేసింది. దీని ప్రకారం ఢిల్లీలో 2.5 స్థాయి(పీఎం) సూక్ష్మ ధూళి కణాలు నాణ్యత పరిమితికి మించి రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. 10 గాఢత విభాగంలో దేశంలో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచిందని గణాంకాలు వెల్లడించాయి. అయితే, నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే కాలుష్యం 7 శాతంపైగా తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం అని ఈ గణాంకాలను ఎన్సీఏపీ ట్రాకర్ విశ్లేషించింది. 2.5 స్థాయి సూక్ష్మధూళి కణాల విభాగంలో ఢిల్లీ తొలి స్థానంలో నిలవగా, హరియాణాలోని ఫరీదాబాద్ రెండో ర్యాంక్‌లో, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ మూడో ర్యాంక్‌లో నిలిచిందని గణాంకాలు పేర్కొన్నాయి. 10 పీఎం విభాగంలో దేశంలో ఘజియాబాద్ తొలిస్థానంలో నిలిచింది. తర్వాత ఫరీదాబాద్, ఢిల్లీ ఉన్నాయి. కనీసం 20–30 శాతం కాలుష్యం తగ్గాలన్న జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్సీఏపీ) లక్ష్యాలకు ఈ గణాంకాలు సుదూరంగా ఉండటం విషాదకరం. ఈ పథకం లక్ష్యాలను సాధించడంలో దేశ పురోగతిని గణిస్తూ ‘ఎన్సీఏపీ ట్రాకర్’ ఈ లెక్కలను విడుదలచేసింది. 131 నగరాల్లో కాలుష్యాన్ని 30 శాతం మేర తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్దేశించుకుంది. అయితే 2026కల్లా కాలుష్యం 40 శాతం తగ్గించుకోవాలని 2022 సెప్టెంబర్‌లో కొత్తగా లక్షించింది. 2.5 స్థాయి కణాలు అత్యంత సూక్ష్మంగా ఉండి నేరుగా ఊపిరితిత్తుల్లో అక్కడి నుంచి రక్తంలో కలిసిపోగలవు. ‘నగరాల్లో కఠిన నిబంధనలను ఖచ్చితంగా అమలుచేయలేకపోతే లక్ష్యాలను సాధించడం చాలా కష్టం’ అని క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ డైరెక్టర్ ఆర్తీ ఖోస్లా విచారం వ్యక్తంచేశారు. -
ఐదో ర్యాంక్‌కు సింధు
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరో సారి టాప్–5లోకి అడుగు పెట్టింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు ఐదో స్థానంలో నిలిచింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె టాప్–5లోకి వెళ్లడం విశేషం. కామన్వెల్త్ క్రీడల తర్వాత గాయం కారణంగా సింధు ఆటకు దూరమైంది. అయితే గాయంనుంచి కోలుకున్న ఆమె సోమవారమే హైదరాబాద్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. సైనా నెహ్వాల్ ఒక స్థానం దిగజారి 33వ ర్యాంక్‌కు పడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ వరుసగా 8, 11వ స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ కూడా తమ 8వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
అమెరికా గోల్ఫ్‌లో తెలుగు కెరటం
నపా (అమెరికా): అమెరికాకు చెందిన తెలుగు గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఫార్టీనెట్ వరల్డ్ ర్యాంకింగ్ గోల్ఫ్ టోర్నమెంట్లో మెరిశాడు. 73 మంది పాల్గొన్న ఈ టోర్నీలో అతను 11 పాయింట్ల స్కోరుతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. టాప్–10లో నిలిచిన సాహిత్‌కు 2 లక్షల 70 వేల డాలర్లు (రూ.2 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రికీ ఫాలెర్, నిక్ టేలర్లు కూడా 11 స్కోరు చేయడంతో ముగ్గురు ఆరో స్థానాన్ని పంచుకున్నారు. 24 ఏళ్ల ఈ తెలుగు గోల్ఫర్ తాజా ప్రదర్శనతో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకున్నాడు. ఎవరీ తీగల సాహిత్? సాహిత్ రెడ్డి జన్మతః అమెరికన్ అయినప్పటికీ భారతీయుడు. హైదరాబాద్‌కు చెందిన తీగల మురళీధర్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం 1987లో అమెరికాకు వెళ్లారు. ఉన్నత విద్య పూర్తయ్యాక తెలుగమ్మాయి కరుణను వివాహమాడి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. వీరికి సాహిత్‌తో పాటు మరో కుమారుడు సహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికీ అతని కుటుంబం ప్రతీ రెండేళ్లకోసారి హైదరాబాద్‌కు వచ్చి వెళుతుంది. 2001లో సాహిత్ తల్లి థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడటంతో ఇద్దరి పిల్లల బాగోగులు అమ్మమ్మ విజయలక్ష్మి చూసుకునేది. చిన్నప్పటి నుంచి సాహిత్‌కు గోల్ఫ్ అంటే సరదా. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆటను ఆపలేదు. దీని ఫలితం ఇప్పుడు ప్రొఫెషనల్ అయ్యేందుకు దోహదపడింది. 2020లో ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన సాహిత్ ఈ రెండున్నరేళ్లతోనే సంచలన ప్రదర్శనతో అది కూడా అసాధారణ పోటీ ఉండే అమెరికాలో ఈ స్థాయికి దూసుకురావడం గొప్ప ఘనత. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న సాహిత్ 2021–22 సీజన్లో జోరు పెంచాడు. మొత్తం నాలుగు టోర్నీల్లో టాప్–10లో నిలిచాడు. దీంతో ఈ సీజన్లోనే సాహిత్ 17 లక్షల డాలర్లు (రూ.13 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీ రూపేణా సంపాదించడం గమనార్హం. ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ టోర్నీల్లో భారత ఆటగాళ్లు చాలా మందే ఆడుతున్నారు కానీ ఓ హైదరాబాదీ ఈ స్థాయిలో రాణిస్తుండటం విశేషం. -
ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన తెలుగమ్మాయి
ఆంధ్రప్రదేశ్ మహిళా స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నిలిచింది. సోమవారం విడుదల చేసిన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌ను అందుకుంది. కాంపౌండ్ విభాగంలో ఓ భారత ఆర్చర్ మూడో ర్యాంక్‌లో నిలువడం ఇదే ప్రథమం. సురేఖ ఖాతాలో ప్రస్తుతం 188.45 పాయింట్లు ఉన్నాయి. -
అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్న భారత హాకీ జట్టు
లుసానే: ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ర్యాంకింగ్స్‌లో భారత్ అత్యుత్తమంగా మూడో ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించనుంది. గురువారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 2,296.038 పాయింట్లతో భారత్ మూడో ర్యాంక్‌ను కాపాడుకుంది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత పురుషుల జట్టు ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాక భారత్ మూడో ర్యాంక్‌తో ఏడాదిని ముగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మహిళల ర్యాంకింగ్స్‌లో భారత హాకీ జట్టు తొమ్మిదో ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. -
చరిత్ర సృష్టించే అవకాశం
టోక్యో ఒలింపిక్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఆటగాళ్లంతా ఉద్వేగానికి గురవడం అన్నింటా కనిపిస్తోంది. భారత జట్టు కోణంలో చూస్తే ప్రతీ రోజు తమ ఆటను మెరుగుపర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన పర్యవేక్షణ కారణంగా కొన్నాళ్లుగా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఇంత మంది ఆటగాళ్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం గతంలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి వారిపై అంచనాలు కూడా పెరిగాయి. సన్నాహాలు కూడా బాగున్నాయి కాబట్టి చరిత్ర సృష్టించే అవకాశం భారత్‌కు ఉంది. 15–20 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే మనం ఈ రోజు స్పందించినంత చురుగ్గా అప్పుడు చేయలేకపోయేవాళ్లమేమో! ముఖ్యంగా కొన్ని క్రీడాంశాలకు కేటాయించిన వనరులు చూస్తే మన జట్ల సన్నద్ధత చాలా బాగుంది. షూటింగ్ విషయానికొస్తే... నాకు తెలిసి షూటింగ్ జట్టుకు లభించినంత ఆర్థికపరమైన సహకారం, మరే ఇతర క్రీడా జట్లకు దక్కలేదు. గతంలోనే చెప్పినట్లు ఒలింపిక్స్ అంటే క్రీడా పోటీలు మాత్రమే కాదు. అత్యున్నత విలువలు, స్నేహం, ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం అని మరచిపోవద్దు. ఒక పతకం కోసం పోటీ పడుతున్నామంటే అది మన కోసం కాదు మొత్తం దేశానికి, ఒలింపిక్ స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని భావించాలి. క్రీడలకు ఉన్న గొప్పతనం అది. ఆటల్లో ఎలా గెలవాలనే కాదు, ఓటమిని ఎలా ఎదుర్కోవాలనేది కూడా నేర్చుకుంటాం. భారత జట్టు విషయానికి వస్తే 2016 రియో ఒలిం పిక్స్‌లో వైఫల్యం తర్వాత ఏర్పాటు చేసిన ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ కారణంగా మన బృందం ఈసారి బాగా సిద్ధమైందని తెలిసింది. అయితే నా దృష్టిలో ఆటగాళ్లదే ఈ ఘనత. అనేక దిద్దుబాట్ల తర్వాత మన వ్యవస్థ ఎంతో మెరుగైందనేది వాస్తవం. క్రీడల్లో నిన్నటికంటే నేడు ఇంకా ఆట బాగుండేందుకు శ్రమించడం సహజం. గత కొన్నేళ్లలో ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు మున్ముందు మరిన్ని మంచి ఫలితాలు అందిస్తాయి. -
దీపిక... వరల్డ్ నంబర్‌వన్
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించినందుకు భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారికి తగిన ప్రతిఫలం లభించింది. సోమవారం విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27 ఏళ్ల దీపిక రికర్వ్ వ్యక్తిగత విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించింది. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంక్‌లో ఉన్న దీపిక తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు పురోగతి సాధించి 263.7 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌ను అందుకుంది. లీసా బార్బెలిన్ (ఫ్రాన్స్–225.5 పాయింట్లు) తొలి ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోగా... కాంగ్ చె యంగ్ (దక్షిణ కొరియా–208 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి 2012లో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన దీపిక ఆ తర్వాత నిలకడగా టాప్–10లో కొనసాగింది. పారిస్‌లో ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో దీపిక రికర్వ్ టీమ్ విభాగంలో, మిక్స్డ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు నెగ్గి ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు గెలిచిన తొలి భారతీయ ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో దీపిక అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలలో పతకాలు సాధించింది. కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే ఆమెను ఊరిస్తోంది. ప్రపంచకప్ టోర్నీలలో 35 పతకాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు... కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో ఒక పతకం... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు ఆమె సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో తొలి రౌండ్లో... వ్యక్తిగత విభాగంలో తొలి రౌండ్లో వెనుదిరిగిన దీపిక 2016 రియో ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో... వ్యక్తిగత విభాగంలో మూడో రౌండ్లో ఓడిపోయింది. వచ్చే నెలలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో దీపిక కేవలం వ్యక్తిగత విభాగంలో పోటీపడనుంది. -
అమిత్ నంబర్‌వన్
న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో రజత పతకం నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌గా గుర్తింపు పొందిన అమిత్ పంఘాల్ మరో ఘనత సాధించాడు. సోమవారం విడుదల చేసిన అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ–ఐబా) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అమిత్ పురుషుల 52 కేజీల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. జకార్తా–2018 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా బాక్సర్ ఖాతాలో 1300 పాయింట్లు ఉన్నాయి. అమిత్ చిరకాల ప్రత్యర్థి ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ జైరోవ్ షకోబిదిన్ (ఉజ్బెకిస్తాన్) 1200 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోగా... అసెనోవ్ పనేవ్ (బల్గేరియా) 1000 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. రోహతక్‌కు చెందిన 24 ఏళ్ల అమిత్ రెండేళ్లుగా భారత స్టార్ బాక్సర్‌గా రూపాంతరం చెందాడు. అతను 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు. ఆర్థిక అవకతవకల కారణంగా గతేడాది ‘ఐబా’పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సస్పెన్షన్ విధించింది. అనంతరం ఐఓసీ ప్రపంచ బాక్సింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బాక్సింగ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. బాక్సింగ్ టాస్క్‌ఫోర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ అమిత్ నంబర్‌వన్‌గా నిలిచాడు. తాజాగా ‘ఐబా’ ప్రకటించిన అధికారిక ర్యాంకింగ్స్‌లోనూ అమిత్ ‘టాప్’లో నిలువడం విశేషం. మొత్తం తొమ్మిది వెయిట్ కేటగిరీలకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు టాప్–10లో ఉన్నారు. దీపక్ (49 కేజీలు) ఆరో ర్యాంక్‌లో, కవీందర్ బిష్త్ (56 కేజీలు) నాలుగో ర్యాంక్‌లో, మనీశ్ కౌశిక్ (64 కేజీలు) ఆరో ర్యాంక్‌లో నిలిచారు. గత ఏడాది జనవరిలో ‘ఐబా’ ప్రకటించిన ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు) తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. ఇదే విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 21వ ర్యాంక్‌లో నిలిచింది. -
ప్రపంచ రెండో ర్యాంకర్‌గా కోనేరు హంపి
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పురోగతి సాధించింది. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హంపి 2586 ఎలో రేటింగ్ పాయింట్లతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. 2658 ఎలో రేటింగ్ పాయింట్లతో హూ ఇఫాన్ (చైనా) టాప్ ర్యాంక్‌లో ఉంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ రెండో ర్యాంక్ నుంచి (చైనా–2583 పాయింట్లు) మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 2517 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉంది. -
టైగర్ వుడ్స్ రికార్డు విజయం
ఇన్జాయ్ (జపాన్): గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అద్భుత కెరీర్లో మరో కొత్త ఘనత చేరింది. తాజాగా జోజో చాంపియన్‌షిప్‌లో అతను విజేతగా నిలిచాడు. ఈ గెలుపుతో టైగర్ వుడ్స్ యూఎస్ పీజీఏ టూర్ టైటిల్స్ సంఖ్య 82కు చేరింది. దీంతో స్యామ్ స్నీడ్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును వుడ్స్ సమం చేశాడు. కెరీర్లో 15 ‘మేజర్’ టైటిల్స్ సాధించిన ఈ స్టార్ తన తొలి టూర్ టైటిల్‌ను 20 ఏళ్ల క్రితం గెలవడం విశేషం. తాజా విజయంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా టైగర్ వుడ్స్ పది నుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు. -
సత్యన్... కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో టాప్–25లో చోటు సంపాదించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా జ్ఞానశేఖరన్ సత్యన్ గుర్తింపు పొందాడు. సోమవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో చెన్నైకు చెందిన సత్యన్ నాలుగు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. హంగేరిలో గత వారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్యన్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ‘నా ప్రదర్శనతో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఈ ఏడాది చివరికల్లా టాప్–15లోకి చేరడమే నా లక్ష్యం’ అని సత్యన్ అన్నాడు. -
టైమ్స్ హయ్యర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో కేఐఐటీ
కోల్‌కతా: టైమ్స్ హయ్యర్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్–2019లో కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ)కి తొలిసారి చోటుదక్కింది. ప్రపంచంలోని 1001 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో ఈ నెల 26న విడుదల అయిన జాబితాలో తూర్పు భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సెల్ఫ్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీ కేఐఐటీనే కావడం విశేషం. వర్సిటీ వ్యవస్థాపకురాలు ప్రొ. అచ్యుతా సమంత తమకు దక్కిన ర్యాంక్‌పై హర్షం వ్యక్తం చేస్తూ..దేవుడి ఆశీస్సులు, సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. 1997లో ఓ అద్దె భవనంలో కళాశాలగా ప్రారంభమైన కేఐఐటీ 2004లో డీమ్డ్ యూనవర్సిటీ హోదా దక్కించుకుంది. -
ఇండియా@ సెంచరీ క్లబ్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం చేయడానికి అనువైన పరిస్థితులు (వ్యాపార సానుకూలతలు) వేగంగా మెరుగుపడుతున్నాయి. గత ఏడాది ఇందుకు సంబంధించి 130గా ఉన్న భారతదేశ ర్యాంక్ ఈ ఏడాది ఒక్కసారిగా 100కు ఎగసింది. ఇది పెద్ద విజయమే. ప్రపంచబ్యాంక్ ఈ మేరకు తాజా నివేదిక విడుదల చేసింది. పన్నులు, లైసెన్సింగ్ వ్యవస్థలో సంస్కరణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, దివాలా సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాల్లో భారత్ వేగంగా పురోగమించడం ఈ ర్యాంక్ మెరుగుదలకు దోహదపడింది. డీమోనిటైజేషన్, అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు విషయంలో అస్పష్టత, లొసుగులకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో వెలువడిన ఈ ప్రపంచ బ్యాంక్ నివేదిక... కేంద్ర ప్రభుత్వానికి నైతిక బలాన్ని అందించినట్లయింది. ‘డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణలు’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేసింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ 2003 నుంచి భారత్ దాదాపు 37 సంస్కరణాత్మక చర్యలను తీసుకువచ్చింది. అందులో సగానికి సగం సంస్కరణలు మంచి ఫలితాలను అందించాయి. ప్రత్యేకించి గడచిన నాలుగేళ్లలో ఈ సంస్కరణల అమలు తీరు బాగుంది. ర్యాంకింగ్ మెరుగుదలలో ఇది ఎంతగానో దోహదపడింది. ♦ అయితే దేశంలోని ప్రజలందరినీ ఒకే పన్ను వ్యవస్థ కిందకు తీసుకువచ్చి, అంతర్రాష్ట్ర వాణిజ్య అడ్డంకులను తొలగిస్తున్నట్లు పేర్కొంటున్న జీఎస్టీ అమలు తదుపరి వ్యాపార పరిస్థితులను మాత్రం ర్యాంకింగ్ పరిగణనలోకి తీసుకోలేదు. ♦ ఈ ఏడాది తమ ర్యాంకులను భారీగా పెంచుకున్న 10 దేశాల్లో భారత్ ఒకటి. ♦ భారత్ 100 ర్యాంక్ క్లబ్‌లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇలాంటి భారీ రికార్డు నమోదుచేసిన అతిపెద్ద దేశం భారత్ కావడమూ మరో విశేషం. భారత్ తన స్కోర్‌ను 4.71 పాయింట్ల మేర పెంచుకుని 60.76 పాయింట్లకు చేరింది. ♦ గత రెండేళ్లుగా భారత్ ర్యాంక్ 130గా ఉంది. 2014లో దేశం ర్యాంక్ 142. ♦ ఇబ్బందులులేని వ్యాపార సానుకూల దేశాల నిర్ణయానికి 10 సూచీలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. వీటిలో 8 సూచీలకు సంబంధించి భారత్ తగిన సంస్కరణలను అమలు పరిచింది. ♦ 2016–17లో భారత్‌లో మెరుగుపడిన ఎనిమిది వ్యాపార ప్రమాణాలను పరిశీలిస్తే– ఒక వ్యాపారం సత్వరం ప్రారంభానికి పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇందుకు సంబంధించి సుదీర్ఘ ప్రొసీజరల్ ప్రక్రియ కొంత తగ్గింది. బిల్డింగ్ పర్మిట్ పొందడం సులభతరమైంది. రుణ లభ్యత సరళతరం అయ్యింది. మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు పెద్ద పీట వేయడం జరుగుతోంది. పన్ను చెల్లింపులు తేలికవుతున్నాయి. అంతరాష్ట్ర వాణిజ్యం, కాంట్రాక్టుల నిర్వహణ, దివాలా వంటి అంశాల విషయంలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, లావాదేవీల అంశాల్లో ఇంకా భారీ మెరుగుదల రావాల్సి ఉంది. ♦ కొత్త బిజినెస్ రిజిస్ట్రేషన్‌కు 15 ఏళ్ల క్రితం 127 రోజులు పట్టేది. ఇప్పుడు ఈ సమయం 30 రోజులకు తగ్గింది. ♦ ఒక వ్యాపారం ప్రారంభించడానికి సంబంధించిన ప్రక్రియ స్థానిక పెట్టుబడిదారులకు ఇంకా క్లిష్టంగానే ఉంది. క్షిష్టమైన 12 ప్రొసీజర్ల ద్వారా వారు తమ లక్ష్యాలను చేరుకోవాల్సి వస్తోంది. న్యూజిలాండ్ టాప్... సులువైన వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. తరువాతి నాలుగు స్థానాల్లో సింగపూర్ (2), డెన్మార్క్ (3), దక్షిణ కొరియా (4), హాంకాంగ్ (5) నిలిచాయి. అమెరికాది ఈ విషయంలో 6వ స్థానం కాగా, బ్రిటన్ 7వ స్థానంలో నిలిచింది. ఇక బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో రష్యా అగ్ర స్థానంలో 35వ ర్యాంక్ పొందింది. 78వ స్థానంతో... బ్రిక్స్ దేశాల్లో చైనా రెండవ స్థానంలో నిలిచింది. 2016లోనూ చైనాది ఇదే ర్యాంక్. టాప్ 5కి చేరడమే లక్ష్యం.. గడచిన కొన్నాళ్లుగా 130–140 స్థానాల్లో కొనసాగిన భారత్.. ప్రస్తుతం ఏకంగా 30 స్థానాలు ఎగబాకిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఏ దేశం కూడా ఈ స్థాయిలో మెరుగుపడలేదని ఆయన వివరించారు. ర్యాంకింగ్‌ను మరింతగా మెరుగుపర్చుకునే సత్తా భారత్‌కి ఉందని.. టాప్ 5లోకి చేరడమే లక్ష్యం కావాలని జైట్లీ విలేకరుల సమావేశంలో వివరించారు. వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించే దిశగా ప్రతీ అంశాన్నీ మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోందని జైట్లీ చెప్పారు. ముఖ్యంగా ట్యాక్సేషన్ విధానంలో చెప్పుకోతగిన పురోగతి సాధించినట్లు ఆయన తెలిపారు. గతేడాది మొత్తం 189 దేశాల జాబితాలో 172వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 53 స్థానాలు పైకి ఎగబాకిందని జైట్లీ చెప్పారు. ఆర్బిట్రేషన్ చట్టం తదితర సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయన్నారు. ఇక ఇన్సాల్వెన్సీ పరిష్కారంలో 136వ స్థానంలో ఉండగా.. 33 స్థానాలు మెరుగుపడి 103వ ర్యాంకుకు చేరినట్లు ఆయన తెలిపారు. భారీ జంప్ ఇది... ఇది భారీ జంప్. జూలై 1 నుంచీ అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణను ఈ ఏడాది పరిగణనలోకి తీసుకోలేదు. వచ్చే ఏడాది నివేదికలో ఇది కీలకమవుతుంది. ఇక డీమోనిటైజేషన్నూ పరిగణనలోకి తీసుకోలేదు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావం ర్యాంకు భారీ పెరుగుదలకు కారణం. ఈ ఏడాది దేశం తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకున్నా, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. అందువల్ల ఇప్పుడే భారత్‌ను వ్యాపారానికి అత్యంత సానుకూల ప్రాంతంగా చెప్పలేను. అయితే ఆ హోదాను పొందడానికి తగిన దిశలో పయనిస్తోందని మాత్రం చెప్పగలను. సులభతర వ్యాపార పరిస్థితుల విషయంలో గత రెండేళ్లతో పోల్చితే దేశం ఇప్పుడు ఎంతో మెరుగుపడింది. – రీటా రమాల్హో, వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఇండికేటర్స్ గ్రూప్ తాత్కాలిక డైరెక్టర్ చక్కటి పురోగతి... గడచిన 15 సంవత్సరాల నుంచీ ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఒక్క ఏడాదిలో భారీగా తమ ర్యాంకును మెరుగుపరచుకున్న దేశాల్లో ఇంతక్రితం జార్జియా, రువాండా వంటి కేవలం ఐదు దేశాలే ఉన్నాయి. భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ ర్యాంక్ ఏదీ ఒక్క ఏడాదిలో ఇంతగా మెరుగుపడలేదు. అయితే వ్యాపార అవకాశాల మెరుగుదలలో భారత్ పయనించాల్సిన బాట ఇంకా ఎంతో ఉంది. – శాంటియాగో క్రౌసీ డౌన్స్, ప్రపంచబ్యాంక్ డూయింగ్ బిజినెస్ యూనిట్ యాక్టింగ్ మేనేజర్ -
భారత్ ర్యాంక్ 163
న్యూఢిల్లీ: గత వారం దక్షిణాసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్ సాధించిన భారత జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలను మెరుగు పర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 166వ స్థానం నుంచి 163వ స్థానానికి చేరుకుంది. ఆసియా ర్యాంకింగ్స్‌లో భారత్ 31వ స్థానంలో ఉంది. బెల్జియం నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... అర్జెంటీనా రెండో స్థానం లో, స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి. -
టాప్ ర్యాంక్‌లోనే ఉండేందుకు ప్రణాళికలు
సైనా నెహ్వాల్ వ్యాఖ్య బెంగళూరు: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదని... అయితే పక్కా ప్రణాళికతో తీవ్ర సాధన చేస్తే సుదీర్ఘ కాలంపాటు తాను టాప్ ర్యాంక్‌లో ఉండే అవకాశం ఉందని భారత బ్యాడ్మిం టన్ స్టార్ సైనా నెహ్వాల్ తెలిపింది. గురువారం రెండోసారి నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన నేపథ్యంలో పలు అంశాలపై సైనా వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... కష్టపడితే కష్టమేమీ కాదు: అన్నీ అనుకున్నట్లు జరిగితే... సుదీర్ఘ కాలంపాటు నేను నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతాననే విశ్వాసం ఉంది. అయితే ఇది నిజం కావాలంటే నేను తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. భారత్ తరఫున సాధ్యమైనన్ని ఎక్కువ టైటిల్స్ నెగ్గేందుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. టాప్ ర్యాంక్ విషయంలో చైనా ప్లేయర్ లీ జురుయ్ నుంచే నాకు ఎక్కువ పోటీ ఉంది. అంతా బాగుంది: టోర్నమెంట్ల సమయంలో తప్పించి మాజీ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో ప్రత్యేకంగా మాట్లాడేందుకు వీలుకాదు. చాలా ఏళ్లపాటు నాకు కోచ్‌గా ఉన్న గోపీచంద్ నాకు ఎన్నో మంచి విషయాలు నేర్పించారు. అయితే శిక్షణకోసం వేరే చోటికి వెళితే పరిస్థితుల్లోనూ తేడా వస్తుంది. ప్రస్తుతం ఆయన తన పని చేసుకుంటున్నారు. నేను నా పని చేసుకుంటున్నాను. అంతా మంచే జరుగుతోందనేది ఇక్కడ కీలకం. కోచ్ విమల్ కుమార్ పుణ్యమే: ప్రతి కోచ్ పరిపూర్ణుడు కాదు. ఒక దశ నుంచి మరో దశకు చేరుకోవాలంటే ఏం చేయాలో కోచ్‌లందరికీ తెలిసే అవకాశాలు తక్కువ. ఒక దశ చేరుకున్నాక నా ఆటతీరులో పురోగతి కనిపించలేదు. ఈ దశలో కోచ్ విమల్ కుమార్ నా ఆటతీరును మెరుగుపరిచారు. ఆయనతో కలిసి సాధన చేశాక వచ్చిన ఫలితాలు మీరే చూశారు. నాలో నంబర్‌వన్ కాదగ్గ ప్రతిభ ఉందని ఆయన గుర్తించి, దానిని నిజం చేసి చూపించారు. అవార్డులపై ప్రభుత్వమే నిర్ణయించాలి: భవిష్యత్‌లో నాకు ‘పద్మ’ పురస్కారం ఇవ్వాలా వద్దా అనే విషయం ప్రభుత్వానికే వదిలేస్తున్నాను. ఒకసారి ఈ అంశంపై నా అభిప్రాయం చెప్పాను. దీనిపై వందసార్లు మాట్లాడాల్సిన అవసరంలేదు. అదంతా గతం. -
డ్యుయెల్ డిగ్రీ చేయొచ్చు
మై క్యాంపస్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- కాన్పూర్.. ఇంజనీరింగ్ కోర్సుల్లో అత్యుత్తమ బోధన, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇటీవల క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ జాబితాలో ప్రపంచంలోనే 300వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న రాయభారం అర్చిత్ తన క్యాంపస్ లైఫ్ విశేషాలను, ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా.. మాది హైదరాబాద్. మొదటి నుంచీ నాకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌పై ఆసక్తి ఉంది. నాలుగు ఐఐటీలు (బాంబే, ఖరగ్‌పూర్, కాన్పూర్, మద్రాస్) మాత్రమే ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ను అందించడంలో ఐఐటీ-కాన్పూర్‌కు మంచి పేరుంది. దీంతో ఇక్కడ చేరాను. విద్యార్థులు ఎంతో ఫ్రెండ్లీ ప్రవేశం లభించిన వారందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఒక్కో రూమ్‌కు ఇద్దరు చొప్పున ఉండొచ్చు. హాస్టల్ వార్డెన్‌గా ప్రొఫెసర్ విధులు నిర్వర్తిస్తారు. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. విద్యార్థులంతా స్నేహంగా ఉంటారు. క్యాంటీన్లో ఆహారం బాగుంటుంది. ఇన్స్టిట్యూట్ ఉత్తర భారతదేశంలో ఉన్నా దక్షిణాది వంటకాలన్నీ క్యాంటీన్లో లభిస్తాయి. నిపుణులైన ఫ్యాకల్టీ సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు/ప్రాక్టికల్స్/ల్యాబ్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు.. సబ్జెక్టులకనుగుణంగా షెడ్యూల్‌ను బట్టి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులు ఉంటాయి. ఒక్కో క్లాసు వ్యవధి 60 నిమిషాలు. తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు ప్రాక్టికల్స్/ల్యాబ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ బోధిస్తున్న ఫ్యాకల్టీ అంతా ఎంతో నిష్ణాతులు. బోధనలో అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్ వాడతారు. సబ్జెక్టు సందేహాలను వెంటనే నివృత్తి చేస్తారు. ఫోన్/ఈ-మెయిల్ ద్వారా కూడా ఫ్యాకల్టీని సంప్రదించే వీలుంది. అదేవిధంగా ప్రతి సబ్జెక్టుకు కనీసం ఇద్దరు చొప్పున ట్యూటర్లు కూడా ఉంటారు. ఎక్కువ సిలబస్ ఉన్న సబ్జెక్టులకు ఒక్కోదానికి 12 మంది ట్యూటర్లు ఉంటారు. వీరు కూడా అకడమిక్‌పరంగా విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తారు. డ్యుయెల్ డిగ్రీని ఎంచుకునే అవకాశం నాలుగేళ్ల బీటెక్ కోర్సు.. సెమిస్టర్ విధానంలో ఉంటుంది. ప్రతి ఏడాదిలో రెండు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి ఏడాది అందరికీ కామన్‌గా ఉంటుంది. మూడో ఏడాదిలో ఎక్కువగా ప్రాక్టికల్ వర్క్/ల్యాబ్ వర్క్ చేయాలి. మూడో ఏడాది చివరలో డ్యుయెల్ డిగ్రీని ఎంచుకునే అవకాశం ఉంది. ఇష్టమున్న స్పెషలైజేషన్‌ను ఎంచుకుని మరో ఏడాది అదనంగా చదివి డ్యుయెల్ డిగ్రీ (ఐదేళ్లు) పొందొచ్చు. అయితే డ్యుయెల్ డిగ్రీని విద్యార్థులు ఆసక్తి ఉంటే ఎంచుకోవచ్చు.. లేదంటే లేదు. ఇంజనీరింగ్ సబ్జెక్టులతోపాటు హ్యుమానిటీస్ కోర్సులను కూడా చదవాల్సి ఉంటుంది. నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేలోపు నాలుగు లేదా ఐదు హ్యుమానిటీస్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. నేను ఫస్టియర్‌లో సైకాలజీ, సెకండియర్‌లో ఫిలాసఫీలను ఎంచుకున్నాను. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సాధారణంగా ఐదు లేదా ఆరు కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తారు. నేను ఇప్పటివరకు 10కి 8.2 సీజీపీఏ సాధించాను. ఇక సెమిస్టర్‌కు అన్ని ఫీజులు కలుపుకుని రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు అవుతాయి. క్యాంపస్.. కలర్‌ఫుల్ క్యాంపస్‌లో ప్రతి ఏటా వివిధ ఫెస్ట్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా నాలుగు రోజులపాటు టెక్నాలజీ సంబంధిత అంశాలపై పోటీలు, గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. దేశవిదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఈ ఫెస్ట్‌కు హాజరవుతారు. ఏటా కల్చరల్ ఫెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సినీ రంగానికి చెందినవాళ్లు క్యాంపస్‌కు విచ్చేసి ఉత్సాహపరుస్తుంటారు. క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులమంతా కలిసి తెలుగు సమితిని ఏర్పాటు చేశాం. ఉగాది, వినాయక చవితి, దీపావళి, హోళి వంటి పండుగలను బాగా చేస్తాం. శని, ఆదివారాలు క్లాసులుండవు. సాయంత్రం తరగతులు ముగిశాక స్క్వాష్, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు ఆడతాం. స్టార్టప్స్‌కు ప్రోత్సాహం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ కూడా ఉంది. కొత్త స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి వివిధ కంపెనీలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే కంపెనీలు ఫండింగ్ సదుపాయం కల్పిస్తాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అయితే డ్యుయెల్ డిగ్రీ చేసినవాళ్లు చక్కటి అవకాశాలను ఒడిసిపడుతున్నారు. సగటున ఏడాదికి రూ. ఆరు నుంచి రూ. ఏడు లక్షలు, గరిష్టంగా రూ.16 లక్షల వేతనాలు అందుతున్నాయి. బీటెక్ పూర్తయ్యాక ఎంఎస్ చేయాలనుకుంటున్నా. -
కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి
మై క్యాంపస్ లైఫ్- ఐఐటీ - ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటి. ఇంజనీరింగ్ కోర్సుల్లో అత్యుత్తమ బోధన, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇటీవల క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ జాబితాలో ప్రపంచంలోనే 235వ స్థానంలో నిలిచింది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న చలమలశెట్టి యువ నాగ సాయి అవినాశ్ కార్తీక్ తన క్యాంపస్ లైఫ్ విశేషాలను, ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా.. మాది హైదరాబాద్. విద్యానగర్‌లో ఉంటాం. నాన్న నాగోల్‌లో టీవీఎస్ షోరూమ్‌ను నిర్వహిస్తున్నారు. అమ్మ గృహిణి. అక్క యూఎస్‌లోని రైట్ స్టేట్ యూనివర్సిటీ - ఒహియోలో ఎంఎస్ చేస్తోంది. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 557 మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 979 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయిలో 389, అడ్వాన్స్‌డ్‌లో 69, బీఆర్క్‌లో 14వ ర్యాంకులు వచ్చాయి. కమిటీ పరిశీలిస్తుంటుంది ప్రవేశం లభించిన వారందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఒక్కో రూమ్‌కు ముగ్గురు చొప్పున ఉంటారు. రూమ్‌లో స్టడీ టేబుల్, బెడ్, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి హాస్టల్‌కు కామన్రూమ్లో భాగంగా పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఉంటాయి. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. ఒక కమిటీ క్యాంపస్ అంతా తిరుగుతూ పరిశీలిస్తుంటుంది. ర్యాగింగ్ జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. క్యాంపస్‌లో 250 మంది తెలుగు విద్యార్థులే క్యాంపస్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆ యా బ్రాంచ్‌లు.. సబ్జెక్టులకనుగుణంగా షెడ్యూల్ ను బట్టి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంట ల నుంచి 2 గంటల వరకు లంచ్ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 వరకు డిన్నర్. భోజనంలో రెండు కూరలు, రైస్, చపాతీ వడ్డిస్తారు. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు అల్పాహారం ఇస్తారు. వారంలో రెండు రోజులు సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉంటాయి.హాస్టల్‌కు వార్డెన్‌గా ప్రొఫెసర్ ఉంటారు. అప్పుడప్పుడు హాస్టల్, క్యాంటీన్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకుంటారు. ఫుడ్ నాణ్యతను పరిశీలిస్తారు. వార్డెన్‌ను అడిగి సబ్జెక్టు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వార్డెన్ కాకుండా ఒక కేర్‌టేకర్ కూడా ఉంటారు. సీనియర్ల సహకారం ఎంతో తరగతిలో బోధన బాగుంటుంది. ఫ్యాకల్టీ బాగా చెబుతారు. స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతారు. ఇతర విద్యా సంస్థల ప్రొఫెసర్లు కూడా వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటారు. ఎంత గ్రేడింగ్ ఇవ్వాలి? ఎన్ని మార్కులు కేటాయించాలి? ఎలా బోధించాలి? వంటి అంశాలన్నీ ప్రొఫెసర్ల చేతిలోనే ఉంటాయి. బోధనలో భాగంగా అవసరమైతే ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ), పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, వీడియో వంటివాటిని కూడా ప్రొఫెసర్లు వినియోగిస్తారు. ఫ్యాకల్టీపైన, చదివే కోర్సుపైన విద్యార్థులు ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. యూజర్ ఐడీతో వెబ్సైట్లో లాగినై కోర్సు ఎలా ఉంది? ప్రొఫెసర్లు పాఠాలు ఎలా బోధిస్తున్నారు వంటి అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలియజేయొచ్చు. సీనియర్ స్టూడెంట్స్ అకడమిక్‌గా ఎదురయ్యే సందేహాలు, ఫ్యూచర్ కెరీర్ ప్లాన్స్, జాబ్ ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం వంటి వాటిపై సహాయసహకారాలు అందిస్తారు. ప్రతి సెమిస్టర్లో 7 కంటే ఎక్కువ సీజీపీఏ రావాలి నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌కు అన్నీ కలుపుకుని దాదాపు రూ.75,000 వరకు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4.5 లక్షలు లోపు ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తారు. ఇందులో భాగంగా ట్యూషన్ ఫీజులో ఎక్కువ భాగం మినహాయింపు ఉంటుంది. స్కాలర్షిప్ పొందాలంటే ప్రతి సెమిస్టర్లో 7 కంటే ఎక్కువ సీజీపీఏ పొందాల్సి ఉంటుంది. 7 కంటే తక్కువ సీజీపీఏ ఉంటే స్కాలర్షిప్ అందించరు. ఎయిమ్స్‌లో ఉచిత వైద్యం క్యాంపస్‌లో ఆడుకోవడానికి క్రీడా మైదానాలెన్నో ఉన్నాయి. ఇంకా అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆడిటోరియం, లైబ్రరీ, ల్యాబ్‌లు; బ్యాంకు లు, ఏటీఎంలు కొలువుదీరాయి. విద్యార్థులు అస్వస్థతకు గురైతే 24 గంటలు సేవలందించే ఆస్పత్రి క్యాంపస్‌లో ఉంది. చిన్నపాటి వ్యాధులకు ఢిల్లీలోని ప్రఖ్యాత వైద్య సంస్థ ఎయిమ్స్‌లో ఉచిత వైద్యం అందిస్తారు. క్యాంపస్.. కలర్‌ఫుల్ క్యాంపస్‌లో ప్రతి ఏటా వివిధ ఫెస్ట్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది మార్చిలో టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా నాలుగు రోజులపాటు టెక్నాలజీ సంబంధిత అంశాలపై పోటీలు, గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. దేశవిదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఈ ఫెస్ట్‌కు హాజరవుతారు. ఏటా అక్టోబర్‌లో కల్చరల్ ఫెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇవేకాకుండా ఐఐటీల వరకు ప్రత్యేకంగా ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. క్యాంపస్‌లో దీపావళి, హోళి వంటి పండుగలను బాగా చేస్తాం. శని, ఆదివారాలు క్లాసులుండవు. అప్పుడప్పుడు ఢిల్లీ, ఆగ్రా పరిసర ప్రాంతాలను సందర్శించి మానసిక ఉల్లాసం పొందుతాం. కంపెనీలు ఫండింగ్ చేస్తాయి క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ కూడా ఉంది. కొత్త స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి వివిధ కంపెనీలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా వివిధ కంపెనీల హెడ్లు క్యాంపస్‌కు వస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే కంపెనీలు ఫండింగ్ సదుపాయం కల్పిస్తాయి. సెల్ ఆధ్వర్యంలో గెడైన్స్, ఇతర సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫేస్బుక్ వంటి కంపెనీలు ప్రతిభా వంతులకు ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి. సివిల్స్ రాస్తా బీటెక్ పూర్తయ్యాక ఒకటి లేదా రెండేళ్లు ఉద్యోగం చేస్తాను. ఆ తర్వాత సివిల్స్ రాయాలనుకుంటున్నా.