ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (IMD) విడుదల చేసిన డేటా ప్రకారం, 2023 వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ ఇంతకు ముందుకంటే కూడా నాలుగు స్థానాలు దిగజారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. ప్రపంచంలోని 64 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 56 స్థానం పొందింది. 2022లో ఇండియా ర్యాంక్ 52 కావడం గమనార్హం. ఈ లెక్కన గతం కంటే ఇండియా నాలుగు స్థానాలు కిందికి వెళ్ళింది. భారతదేశ మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పటికీ, ప్రతిభ పోటీతత్వాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇది మెరుగుపడితే ఇండియా మరింత ముందుకు వెళుతుందని అభిప్రాయపడుతున్నారు.
2023 ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, లక్సెంబర్గ్ రెండవ స్థానంలో ఉంది, ఐస్‌లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా 15వ స్థానంలో, యూకే 35, చైనా 41 ఉన్నాయి. చివరి రెండు స్థానాల్లో బ్రెజిల్ 63, మంగోలియా 64 చేరాయి.
ఇదీ చదవండి: భారత్‌లో ధాన్యం ధరలు పెరిగే అవకాశం! కారణం ఇదే..
ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ అనేది క్వాలిటీ లైఫ్, చట్టబద్ధమైన కనీస వేతనం, ప్రాథమిక & మాధ్యమిక విద్యతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించడం జరుగుతుంది. దీని ప్రకారం భవిష్యత్ సంసిద్ధతలో భారతదేశం 29వ స్థానంలో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment