టైమ్స్‌ హయ్యర్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో కేఐఐటీ | KIIT in Times Higher Edu World Varsity Rankings | Sakshi
Sakshi News home page

టైమ్స్‌ హయ్యర్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో కేఐఐటీ

Published Sat, Sep 29 2018 6:26 AM | Last Updated on Sat, Sep 29 2018 6:26 AM

KIIT in Times Higher Edu World Varsity Rankings - Sakshi

కోల్‌కతా: టైమ్స్‌ హయ్యర్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ ర్యాకింగ్స్‌–2019లో కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ(కేఐఐటీ)కి తొలిసారి చోటుదక్కింది. ప్రపంచంలోని 1001 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో ఈ నెల 26న విడుదల అయిన జాబితాలో తూర్పు భారత్‌ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ యూనివర్సిటీ కేఐఐటీనే కావడం విశేషం. వర్సిటీ వ్యవస్థాపకురాలు ప్రొ. అచ్యుతా సమంత తమకు దక్కిన ర్యాంక్‌పై హర్షం వ్యక్తం చేస్తూ..దేవుడి ఆశీస్సులు, సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. 1997లో ఓ అద్దె భవనంలో కళాశాలగా ప్రారంభమైన కేఐఐటీ 2004లో డీమ్డ్‌ యూనవర్సిటీ హోదా దక్కించుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement