Times Higher Education rankings
-
వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో.. భారత్‌వే 91!
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ సెప్టెంబర్ 27న ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024లో రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లలో అత్యంత ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, 2017 తర్వాత తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 2024 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఇప్పుడు నాల్గవ ఉత్తమ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా ఎదిగింది. గతేడాది భారత్ నుంచి కేవలం 75 ఇన్స్టిట్యూట్లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోగా.. ఇండియా ఆరో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత, అన్నా యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, శూలినీ యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్‌లు భారతదేశం నుండి తదుపరి ఉత్తమ సంస్థలు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 బ్యాండ్‌లో ఉన్నాయి. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800కి పెరిగింది. కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800 బ్యాండ్‌కి మారింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి (IIT గౌహతి) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్ ప్రపంచంలోని టాప్ 800 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి. ఈ ఇన్స్టిట్యూట్ తమ ర్యాంకింగ్‌లను 1001-1200 బ్యాండ్ నుండి 601-800కి మెరుగుపరుచుకుంది. జాబితాలో మొదటిసారిగా ప్రవేశించడం ద్వారా, మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్ 601-800 బ్యాండ్‌లోకి ర్యాంక్ చేయబడింది. అయితే అనేక అగ్రశ్రేణి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు).. వరుసగా నాల్గవ సంవత్సరం ర్యాంకింగ్‌లను బహిష్కరించి ర్యాంకింగ్‌ల పారదర్శకత, ప్రమాణాలపై సందేహాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఇన్స్టిట్యూట్లలో బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీకి చెందిన ఏడు IITలు ఉన్నాయి. ఐఐటీ గౌహతి గతేడాది ర్యాంకింగ్స్‌లో చేరడం గమనార్హం. -
దేశంలోనే బెంగళూరు ఐఐఎస్సీ టాప్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)ను దేశంలో ఉత్తమ విద్యా సంస్థగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఆ సంస్థ 2019 సంవత్సరానికి గానూ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లను ప్రకటించింది. అందులో ఐఐఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఇండోర్ ఐఐటీ నిలిచింది. బోధన, ప్రమాణాలు, పరిశోధన, అంతర్జాతీయ స్థాయి తదితర 8 అంశాల్లో సర్వే చేసి ఆ సంస్థ ర్యాంకులను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,258 సంస్థలకు ర్యాంకులను కేటాయించింది. అందులో మొదటి ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు లభించగా, రెండో ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి లభించింది. అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరు ఐఐఎస్సీకి 251–300 ర్యాంకు లభించింది. 351–400 ర్యాంకు ఇండోర్ ఐఐటీకి లభించగా, 401–500 ర్యాంకు బాంబే, రూర్కీ ఐఐటీలకు లభించాయి. రాష్ట్రంలోని ఐఐటీ హైదరాబాద్‌కు 601–800 ర్యాంకు లభించింది. ఉస్మానియా యూనివర్సిటీకి 801–1000 ర్యాంకు లభించింది. వీటితోపాటు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ర్యాంకులు లభించాయి. దేశవ్యాప్తంగా 49 విద్యా సంస్థలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకులను ప్రకటించింది. వరల్డ్ ర్యాంకులు ఇవీ.. - 251–300 ర్యాంకులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - 351–400 ర్యాంకులో ఇండోర్ ఐఐటీ - 401–500 ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ - 501–600 ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, సావిత్రిబాయి పూలే పూణె యూనివర్సిటీ - 601–800 ఐఐటీ హైదరాబాద్, అమృత విశ్వ విద్యా పీఠం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఐఐఎస్సీ పూణె, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ గౌహతి, ఐఐటీ మద్రాసు, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ఎన్ఐటీ రూర్కెలా, పంజాబ్ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ - 801–1000 ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, ఐఐటీ ధన్‌బాద్, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా, ఎన్ఐటీ తిరుచురాపల్లి, పాండిచ్చేరి యూనివర్సిటీ. -
టాప్ 200లో 49 భారతీయ వర్సిటీలు
లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) 2019 సంవత్సరానికి విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించగా భారత్‌కు చెందిన 49 వర్సిటీలు టాప్ 200లో స్థానం సంపాదించాయి. ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం, ఐఐటీ (ఇండోర్) 61వ స్థానం, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 64వ స్థానంలో నిలిచాయి. సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అమృతా యూనివర్సిటీ ఈసారి టాప్ 150లో స్థానం సంపాదించాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, ఐఐటీ(హైదరాబాద్) తొలిసారిగా ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి. 2018లో భారత్ నుంచి 42 వర్సిటీలు స్థానం సంపాదించగా ఈసారి అది 49కి పెరిగింది. టాప్‌లో చైనా వర్సిటీలు చైనాకు చెందిన నాలుగు వర్సిటీలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత వర్సిటీల్లో విద్యాబోధన మెరుగుపడినా ప్రమాణాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయని టీహెచ్ఈ ఎడిటర్ ఎల్లీ బోత్వెల్ తెలిపారు. -
టైమ్స్ హయ్యర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో కేఐఐటీ
కోల్‌కతా: టైమ్స్ హయ్యర్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్–2019లో కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ)కి తొలిసారి చోటుదక్కింది. ప్రపంచంలోని 1001 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో ఈ నెల 26న విడుదల అయిన జాబితాలో తూర్పు భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సెల్ఫ్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీ కేఐఐటీనే కావడం విశేషం. వర్సిటీ వ్యవస్థాపకురాలు ప్రొ. అచ్యుతా సమంత తమకు దక్కిన ర్యాంక్‌పై హర్షం వ్యక్తం చేస్తూ..దేవుడి ఆశీస్సులు, సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. 1997లో ఓ అద్దె భవనంలో కళాశాలగా ప్రారంభమైన కేఐఐటీ 2004లో డీమ్డ్ యూనవర్సిటీ హోదా దక్కించుకుంది. -
ఆంధ్ర యూనివర్శిటీకి అరుదైన ఘనత
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో 11 వ ర్యాంకు విజయవాడ : ఆంధ్ర విశ్వవిద్యాలయం అరుదైన ఘనత సాధించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో దేశంలో 11 వ ర్యాంకు సాధించింది. మనదేశంలోని 19 ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యాసంస్థలలో ఆంధ్ర యూనివర్శిటీ 11వ స్థానం దక్కించుకుంది. ర్యాంకింగ్ లో మిగిలిన 10 అత్యుత్తమ విద్య సంస్థలలో ఐఐఎస్, ఐఐటీలు వున్నాయి. కాగా.. ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సహకారంతో వచ్చే ఐదేళ్లలో ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచంలోనే 50 అత్యున్నత విద్యాసంస్ధల సరసన నిలబెట్టాలన్నది ఈ మిషన్ ధ్యేయమని అధికారులు తెలిపారు. టైమ్స్ ర్యాంకు సాధించిన ఏయూ.. అంతకు ముందు బోధన, అంతర్జాతీయ దృక్పథం, పారిశ్రామిక ఆదాయ విభాగాల్లో తమ అర్హతలను, గణాంకాలను సమర్పించింది. అతి తక్కువ సమయంలో యూనివర్సిటీ పరిశోధనా, సిద్ధాంత గ్రంధాలను అంతర్జాలంలో చూసేందుకు వీలుకల్పించింది. గతంలో క్యుఎస్ బ్రిక్స్ రేటింగ్స్ లో స్థానం సంపాదించిన ఏయూ, ఇండియాటుడే-నీల్సన్ సర్వేలో భారతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో 8వ ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకింగ్ లో మిగిలిన టాప్ టెన్ వర్సిటీలు అన్నీ సెంట్రల్ యూనివర్సిటీలే కావడం గమనార్హం.