టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ సెప్టెంబర్ 27న ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024లో రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లలో అత్యంత ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, 2017 తర్వాత తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
2024 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఇప్పుడు నాల్గవ ఉత్తమ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా ఎదిగింది. గతేడాది భారత్ నుంచి కేవలం 75 ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోగా.. ఇండియా ఆరో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత, అన్నా యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, శూలినీ యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లు భారతదేశం నుండి తదుపరి ఉత్తమ సంస్థలు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 బ్యాండ్‌లో ఉన్నాయి.
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800కి పెరిగింది. కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800 బ్యాండ్‌కి మారింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి (IIT గౌహతి) మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్ ప్రపంచంలోని టాప్ 800 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి. ఈ ఇన్‌స్టిట్యూట్ తమ ర్యాంకింగ్‌లను 1001-1200 బ్యాండ్ నుండి 601-800కి మెరుగుపరుచుకుంది.
జాబితాలో మొదటిసారిగా ప్రవేశించడం ద్వారా, మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్ 601-800 బ్యాండ్‌లోకి ర్యాంక్ చేయబడింది.
అయితే అనేక అగ్రశ్రేణి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు).. వరుసగా నాల్గవ సంవత్సరం ర్యాంకింగ్‌లను బహిష్కరించి ర్యాంకింగ్‌ల పారదర్శకత, ప్రమాణాలపై సందేహాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీకి చెందిన ఏడు IITలు ఉన్నాయి. ఐఐటీ గౌహతి గతేడాది ర్యాంకింగ్స్‌లో చేరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment