University of Oxford
-
వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో.. భారత్‌వే 91!
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ సెప్టెంబర్ 27న ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024లో రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లలో అత్యంత ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, 2017 తర్వాత తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 2024 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఇప్పుడు నాల్గవ ఉత్తమ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా ఎదిగింది. గతేడాది భారత్ నుంచి కేవలం 75 ఇన్స్టిట్యూట్లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోగా.. ఇండియా ఆరో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత, అన్నా యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, శూలినీ యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్‌లు భారతదేశం నుండి తదుపరి ఉత్తమ సంస్థలు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 బ్యాండ్‌లో ఉన్నాయి. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800కి పెరిగింది. కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800 బ్యాండ్‌కి మారింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి (IIT గౌహతి) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్ ప్రపంచంలోని టాప్ 800 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి. ఈ ఇన్స్టిట్యూట్ తమ ర్యాంకింగ్‌లను 1001-1200 బ్యాండ్ నుండి 601-800కి మెరుగుపరుచుకుంది. జాబితాలో మొదటిసారిగా ప్రవేశించడం ద్వారా, మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్ 601-800 బ్యాండ్‌లోకి ర్యాంక్ చేయబడింది. అయితే అనేక అగ్రశ్రేణి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు).. వరుసగా నాల్గవ సంవత్సరం ర్యాంకింగ్‌లను బహిష్కరించి ర్యాంకింగ్‌ల పారదర్శకత, ప్రమాణాలపై సందేహాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఇన్స్టిట్యూట్లలో బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీకి చెందిన ఏడు IITలు ఉన్నాయి. ఐఐటీ గౌహతి గతేడాది ర్యాంకింగ్స్‌లో చేరడం గమనార్హం. -
Anvee Bhutani: ఆక్స్ఫర్డ్ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా అన్వీ భూటానీ
లండన్: యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటానీ ఎన్నికయ్యారు. ఆమె ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన మాగ్డలిన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ విద్యను అభ్యసిస్తున్నారు. అధ్యక్షురాలిగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని అన్వీ పేర్కొ న్నారు. తోటి విద్యార్థుల నుంచి తనకు అద్భుత మైన మద్దతు లభించిందని ఆనందం వ్యక్తం చేశా యి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో అన్వీ మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. అధ్యక్షురాలిగా ఉన్న భారత సంతతి విద్యార్థిని రష్మీ సామంత్ రాజీనా మా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ విద్యార్థులందరి తరఫున తాను ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప గౌరవమని అన్వీ వ్యాఖ్యానించింది. 2021–22 విద్యా సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికే చెందిన దేవిక ఎన్నిక కావడం విశేషం. -
జాత్యహంకార అంశంపై చర్చిస్తాం: విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: జాత్యహంకార వ్యాఖ్యల ఆరోపణనలపై యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సీటి స్టూడెంట్ యూనియన్‌కి రష్మీ స మంత్ గత నెలలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఒడిషాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో జాత్యహంకార అంశాన్ని మరోసారి లేవనెత్తారు. దీనిపై బ్రిటన్‌తో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే టాప్ యూనివర్సీటీలో ఒకటైన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని వైష్ణవ్ అన్నారు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మహత్మగాంధీ వంటి వారు జాత్యహంకారం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు. సమయం వచ్చినప్పుడు తాము తప్పకుండా ఈ అంశంపై బ్రిటన్‌తో చర్చిస్తామని, ఇలాంటి సంఘటనలను సహించబోమని జైశంకర్ అన్నారు. కాగా, కర్ణాటకకు చెందిన సమంత్ ఉన్నత విద్యాభ్యాసం కోసం యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లి, ఎన్నికలలో పాల్గొని స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా సమంత్ రికార్డు సృష్టించారు. 2021లో జరిగిన ఒక ఈవెంట్లో ఒక సంస్థ స్కాలర్షిప్ గురించి ‘హిట్లర్ ఫండ్’ అని సమంత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదం కావడంతో స్టూడెంట్ యూనియన్‌కి రాజీనామా చేశారు. చదవండి: జాత్యహంకార వ్యాఖ్యలు: రాజీనామా.. -
జాత్యహంకార వ్యాఖ్యలు: రాజీనామా..
న్యూఢిల్లీ: రష్మి సమంత్ ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో రష్మి సమంత్ సోషల్ మీడియా వేదికగా కొన్ని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, కర్ణాటకకు చెందిన సమంత్ ఉన్నత విద్యాభ్యాసం కోసం యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ జరిగిన ఎన్నికలలో పాల్గొని స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ పరిధిలోని ఒక కాలేజ్‌లో ఎమ్మెస్సీ ఇన్ ఎనర్జీ సిస్టమ్ కోర్సు చేస్తున్నారు రష్మి సమంత్. యూనివర్సీటిలో ఎన్నికల్లో పోటి చేసిన రష్మి సమంత్.. కాలేజీలో ఆమె గ్రూపు రాజకీయాలు లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. రష్మి ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యం విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఆమెనే తమ నాయకురాలిగా ఎన్నుకొన్నారు. ప్రెసిడెంట్ పదవికి నలుగురు పోటీ చేస్తే, మిగతా ముగ్గురికీ పోలైన మొత్తం ఓట్ల కన్నా రష్మి సమంత్కే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. ఇక ఈ గెలుపు సంబరాలు ఎంతో సేపు నిలవలేదు. ఆక్స్ఫర్డ్ క్యాంపెయిన్ ఫర్ రేసియల్ అవేర్నేస్ అండ్ ఈక్వాలిటీ(సీఆర్ఈఏ) సంస్థ, గతంలో రష్మి సమంత్ సామాజిక మాధ్యమాల వేదికగా అనేక జాత్యహంకార వ్యాఖ్యలున్న పోస్టులు పెట్టినట్లు ఆరోపించింది. 2017 జరిగిన బెర్లిన్ హోలో కాస్ట్ మెమోరియల్‌ను సందర్శించిన నేపథ్యంపై కూడా రష్మి సమంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కామెంట్ల పై విమర్శలు వచ్చాయి. 2021లో జరిగిన ఒక ఈవెంట్లో ఒక సంస్థ స్కాలర్షిప్ గురించి సమంత్.. ‘హిట్లర్ ఫండ్’, ‘హిట్లర్ స్కాలర్షిప్’ అని పేరు పెట్టాలనుకుంటున్నాను. దీనికి మీరు అంగీకరిస్తారా..’ అని రష్మి సమంత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వివాదస్పదమైంది. ఇలా వరుస ఆరోపణలు, విమర్శలు ఈ క్రమంలో రష్మి సమంత్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన విద్యార్థులందరికి ఎప్పటికి రుణపడి ఉంటానని తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామల నేపథ్యంలో ఈ పదవికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. ‘నా మాటలు, చర్యలు ఎవరినైన బాధించి ఉంటే క్షమపణలు కొరుతున్నాను’ అన్నారు రష్మి సమంత్. -
కోవిషీల్డ్ @ రూ.200-400
న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కోవిడ్ టీకా ’కోవిషీల్డ్’ను భారత ప్రభుత్వానికి ఒక్కో డోసు 3–4 డాలర్ల చొప్పున, ప్రైవేట్ మార్కెట్లో 6–8 డాలర్ల చొప్పున విక్రయిస్తామని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు. దేశీయంగా ఆక్స్ఫర్డ్ టీకా ఉత్పత్తి, పంపిణీ సీరమ్ ఇన్స్టిట్యూట్ చేపట్టనుంది. ఇప్పటికే దాదాపు 5 కోట్ల డోసుల కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేశామని అదర్ చెప్పారు. తొలిదశలో భారత ప్రభుత్వానికి, జీఏవీఐ (గ్లోబల్ అలయన్స్ ఫర్ వాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్స్) దేశాలకు అందిస్తామని, తర్వాతే ప్రైవేటు మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. తమ వ్యాక్సిన్ అందరికీ అందుబాటు ధరలో ఉండాలన్నదే తమ ప్రయత్నమని, అందుకే ప్రభుత్వానికి ఒక్కో డోసు 3–4 డాలర్ల ధరకు (సుమారు 200– 280 రూపాయలు) అందిస్తామని చెప్పారు. ప్రైవేట్ మార్కెట్లో ధర రెట్టింపు ఉండొచ్చని అంటే సుమారు 6–8 డాలర్లు (సుమారు 400–600 రూపాయలు) ఉంటుందని చెప్పారు. ఈప్రకారం చూస్తే రెండు డోసులకు కలిపి ప్రభుత్వానికి సుమారు 400–600 రూపాయలు, ప్రైవేట్ మార్కెట్లో రూ. 800–1,200 వరకు ఉంటుంది. వ్యాక్సిన్ అందజేయడంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. డీసీజీఐ అనుమతి అనంతరం 7–10 రోజుల్లో టీకా పంపిణీకి రెడీగా ఉంటుందన్నారు. దేశీయ అవసరాలు తీరే వరకు టీకాను ఎగుమతి చేయవద్దని సీరమ్‌ను డీసీజీఐ ఆదేశించడంపై స్పందిస్తూ, ప్రభుత్వంతో అనుమతి పొందిన అనంతరమే ఎగుమతులు ఆరంభిస్తామన్నారు. తమ వ్యాక్సిన్ 100 శాతం సమర్ధవంతంగా పనిచేస్తోందని భరోసా ఇచ్చారు. -
అస్ట్రాజెనెకా సురక్షితం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతున్న నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ సామర్థ్యంపైనే అందరి దృష్టి ఉంది. ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, సమర్థవంతంగా పని చేస్తోందని సీరమ్ ఇన్‌నిస్టిట్యూట్ వెల్లడించింది. భారత్‌లో ప్రయోగాలు సజావుగా సాగుతున్నాయని గురువారం వెల్లడించింది. ‘‘అస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది. 60–70 శాతం సామర్థ్యమే కలిగి ఉన్నప్పటికీ ఈ టీకాపై పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచవచ్చు’’అని తెలిపింది. సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి ప్రధాని ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు ఆశలు కల్పిస్తూ ఉండడంతో శనివారం ప్రధాని మోదీ పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించనున్నారు. అక్కడ శాస్త్రవేత్తలతో టీకా ప్రయోగాలపై, డోసుల ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ వంటివాటిపైన చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో 100 దేశాల రాయబారులు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ని సందర్శించనున్నారు. డోసుల్లో పొరపాటు సామర్థ్యాన్ని పెంచింది అస్ట్రాజెనెకా ప్రయోగాల్లో డోసులు ఇవ్వడంలో పొరపాటు వల్ల వ్యాక్సిన్ పనితీరు అద్భుతంగా ఉన్నట్టు రుజువు కావడం అందరిలోనూ ఆశలు పెంచుతోంది. ఈ ప్రయోగాల్లో నెల రోజుల తేడాలో రెండు డోసులు ఇవ్వాలి. వైద్యులు పొరపాటుగా మొదటి డోసు పరిమాణాన్ని సగానికి తగ్గించి ఇచ్చారు. ఆ తర్వాత పొరపాటు తెలుసుకున్న వైద్యులు మరో బృందానికి పూర్తి డోసు ఇచ్చారు. అలా రెండు డోసులు పూర్తయ్యాక డోసున్నర తీసుకున్న వారిలో 90% సామర్థ్యం, రెండు డోసులు పూర్తిగా తీసుకున్న వారిలో 62% సామర్థ్యంతో టీకా పని చేసింది. దీంతో సగటున 70% సామర్థ్యాన్ని ఈ టీకా కలిగి ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. -
నాలుగు కోట్ల డోసులు సిద్ధం
బెంగళూరు: కోవిడ్ టీకా తయారీలో ఇంకో ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా డోసులు సుమారు నాలుగు కోట్లు సిద్ధంగా ఉన్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభిస్తే నోవావాక్స్ టీకా తయారీ కూడా చేపడతామని సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల టీకా కోవిషీల్డ్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి. టీకా పనితీరుపై ముందస్తు ఫలితాలు ప్రకటించాలని ఆస్ట్రాజెనెకా సిద్ధమవుతున్న తరుణంలో యూకేలో వేసవి కారణంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. దీంతో టీకాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ గత వారమే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా టీకాలను భారత్‌లో తయారు చేస్తున్న సీరమ్ నాలుగు కోట్ల డోసులు సిద్ధమైనట్లు ప్రకటించడం గమనార్హం.∙తయారైన డోసులు అంతర్జాతీయ వినియోగానికా? భారత్‌లో పంపిణీ చేసేందుకా తెలిపేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ నిరాకరించింది. -
ఇంతకీ ఏమిటి ఈ డెక్సామెథాసోన్?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసే ఔషధం కోసం ప్రపంచదేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆయా దేశాల శాస్త్రవేత్తలు ఔషధ తయారీలో తలమునకలయ్యారు. కరోనాకు మందు కనుక్కోవటానికి ఇంకో సంవత్సరం పట్టే అవకాశం ఉందని అందరూ భావిస్తున్న సమయంలో ‘యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్’ ఓ శుభవార్త చెప్పింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితులకు ‘డెక్సామెథాసోన్’ అనే ఔషధం అద్భుతంగా పనిచేస్తుందని ప్రకటించింది. అత్యంత చౌకగా లభించే ఈ ఔషధం కరోనా బాధితుల్లో మూడింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు, ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న బాధితుల్లో ఐదింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు తమ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి డెక్సామెథాసోన్‌పై పడింది. ( వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితులకు..) ఇంతకీ ఏమిటి ఈ డెక్సామెథాసోన్? ఎలా పనిచేస్తుంది? డెక్సామెథాసోన్ అనేది ఓ స్టెరాయిడ్. అది మన శరీరంలో సహజ రక్షణ చర్యలను ప్రభావితం చేస్తుంది. మంట, వాపు, అలర్జీలను కలుగజేసే పదార్థాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఈ ఔషధం 1977నుంచి డబ్ల్యూహెచ్ఓ ఎసెన్సియల్ మెడిసిన్స్ లిస్ట్‌లో ఉంది. దాదాపు 1960నుంచి దీన్ని శరీర మంటలను తగ్గించటానికి, కొన్ని క్యాన్సర్ల చికిత్సలోనూ వాడుతున్నారు. లాభాలు : 1) కీళ్ల వాతము 2) క్రోస్ వ్యాధి 3) సిస్టమిక్ లూపస్ 4) సోరియాటిక్ ఆర్థరైటిస్ 5) అల్సరేటివ్ కోలిటిస్ 6) శ్వాసనాళాల ఉబ్బసం 7) అలెర్జీ రినిటిస్ 8) డ్రగ్ ఇన్డూసుడ్ డెర్మటైటిస్ 9) సీ కాంటాక్ట్, అటోపిక్ డెర్మటైటిస్ 10)తీవ్రమైన సోరియాసిస్ 11) పెంఫిగస్ 12) ల్యుకేమియా 13) లింఫ్ గ్లాండ్ క్యాన్సర్ 14) రక్త సంబంధ రోగాలు మొదలైన వాటి నివారణలో ఈ స్టెరాయిడ్‌ను విరివిగా ఉపయోగిస్తుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ : 1) బరువు పెరగటం 2) అధిక రక్తపోటు 3) కడుపులో వికారం 4) మత్తు, తలనొప్పి 5) శరీరంలో పొటాషియం తగ్గుదల 6) సిరమ్లో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది(ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారిలో) 7) నిద్ర సంబంధ ఇబ్బందులు 8) బుతుక్రమం తప్పటం 9) అప్పిటైట్ పెరుగుదల 11) ఒత్తిడి -
వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితులకు..
లండన్: వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితులకు డెక్సామెథాసోన్ అద్భుతంగా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యంత చౌకగా లభించే ఈ ఔషధం కరోనా బాధితుల్లో మూడింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు, ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న బాధితుల్లో ఐదింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. యూకేలోని వివిధ ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 11,500 మందికిపైగా బాధితులపై డెక్సామెథాసోన్‌ను ప్రయోగించి, ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. వెంటిలేటర్ లేదా ఆక్సిజన్ సపోర్టు అవసరం లేని బాధితులకు డెక్సామెథాసోన్‌తో పెద్దగా ఉపయోగం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్ రోగుల్లో సానుకూలమైన ఫలితాలు చూపిన తొలి ఔషధం డెక్సామెథాసోన్ మాత్రమేనని, అది ఆహ్వానించదగ్గ పరిణామమని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ పీటర్ హార్బీ చెప్పారు. -
‘ఎడమ చేతి వాటం’ ఎందుకొస్తుందీ?
న్యూఢిల్లీ : సాధారణంగా మెజారిటీ మనుషులు కుడిచేతితోనే ఎక్కుమ పనులు చేస్తుంటారు. అందుకు కారణం వారిలో ఎడమ చేయి కొంత బలహీనంగా ఉండడమే. అలాంటి వారిని మనం రైట్ హ్యాండర్స్ అని పిలుస్తుంటాం. కొంత మందికి ఏ పనికైనా మనం కుడిచేతిని వాడినట్లుగా వారు ఎడమ చేతిని వాడుతుంటారు. అందుకు కారణం వారిలో కుడి చేయి కాస్త బలహీనంగా ఉండడమే. అలాంటి వారిని లñ ఫ్ట్ హ్యాండర్స్ (ఎడమ చేతి వాటంగల వాళ్లు) అని పిలుస్తారు. క్రికెట్ భాషలోనైతే ఇది చాలా పాపులర్. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అని, బ్యాట్స్‌మేన్ అని స్పష్టంగా పేర్కొంటారు. రైట్ హ్యాండ్ బాట్స్మేన్లు లెఫ్ట్‌హ్యాండ్ బౌలర్లను ఎదుర్కోవడం కొంత కష్టం కనుకనే అలా లెఫ్ట్ హ్యాండర్లకు ప్రాముఖ్యత వచ్చి ఉంటుంది. మిగతా అన్ని రంగాల్లో లెఫ్ట్ హ్యాండర్లను దురదృష్టవంతులుగా చిన్న చూపు చూస్తారు. ప్రపంచ భాషల్లోనూ రైట్కున్న మంచితనం లెఫ్ట్‌కు లేదు. ఇంగ్లీషు భాషలో రైట్ అంటే కరెక్ట్, సముచితమని అర్థం. అదే ఫ్రెంచ్‌లో లెఫ్ట్‌ను ‘గాచే’ అంటారు. అర్థం బాగోలేదు, గందరగోళంగా ఉందని అర్థం. లెఫ్ట్ హ్యాండర్లు వివిధ రంగాల్లో రాణించిన వారున్నారు. భాషా రంగంలో ఎడమ చేతి వాటంగల వాళ్లు రాణించినంతగా కుడిచేతి వాటంగాళ్లు రాణించలేరనే కొత్త విషయం కూడా ఈ తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. అసలు లెఫ్ట్ హ్యాండర్లు ఎందుకు అవుతారు? దానికి కారణాలేమిటి? పుట్టుకతోనే ఈ లక్షణాలు వస్తాయా? అలవాట్ల కారణంగా మధ్యలో వస్తాయా? లెఫ్ట్ వల్ల వచ్చే లాభ, నష్టాలేమిటి? అన్న అంశాలపై ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ఫెల్లోగా పనిచేస్తున్న డాక్టర్ అఖిర విబర్గ్ అధ్యయనం జరపగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రపంచంలో 90 శాతం మంది మనుషులు కుడిచేతి వాటంగల వాళ్లే ఉంటారు. కేవలం పది శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటంగాళ్లు పుడతారు. పుట్టుకతోనే వారికి ఎడమ చేతి వాటం వస్తుంది. వారి మెదడులో కొంత భాగం కొంత భిన్నంగా ఉంటుందట. ఎడమ చేయి వాటంగల వాళ్లకు తల్లి కడుపులో ఉండగానే మెదడు నిర్మాణంలో మార్పు వస్తుందట. భాషకు సంబంధించి వారి మెదడులో కుడి, ఎడమ భాగాలు మంచి అవగాహనతో పనిచేస్తాయట. అందుకనే వారికి భాషా ప్రావీణత ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాలను బ్రిటన్ బయోబ్యాంక్‌లో ఉన్న నాలుగు లక్షల మందిపై అధ్యయనం జరపడం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో 38,332 మంది ఎడమ చేతి వాటంగల వాళ్లు ఉన్నారని తేలింది. ఎడమ చేతి వాటంగల వాళ్లలో మెదడులో నిర్మాణం ఒకే తీరుగా లేదని, కొందరిలోనే ఏక రీతి నిర్మాణం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఎడమ చేతి వాటం రావడానికి అసలు కారణం జన్యువులేనని, అధ్యయనంలో కచ్చితంగా ఆ జన్యువులను గుర్తించలేక పోయినప్పటికీ అవి ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించామని వారు చెప్పారు. ఎడమ చేతి వాటంగల వాళ్లలో భాషా ప్రవీణత ఒకటే కాకుండా తర్కంలో కూడా వారిదే పైచేయి అవుతుందని వారు తెలిపారు. ఎడమ చేతి వాటంగల ప్రముఖులు : లియోనార్డో డావిన్సీ, పీలే, డియాగో మరడోనా, మట్ గ్రోనింగ్, కుర్త్ కొబేన్, టామ్ క్రూజ్, మార్లిన్ మాన్రో, నికొలే కిడ్మన్, జిమ్ కేరి, స్కార్లెట్ జొహాన్సన్, బ్రూస్ విల్లీస్, జెన్నిఫర్ లారెన్స్, సారా జెస్సికా పార్కర్ తదితరులు ఉన్నారు. -
ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేస్తే....
లండన్: మాంసాహారానికి స్వస్తి చెప్పి శాకాహారాన్ని ఆశ్రయించాలని ప్రపంచవ్యాప్తంగా విజిటేరియన్లు ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. అందరూ శాకాహారాన్ని ఆశ్రయించడం వల్ల పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్న కొత్త వాదన కూడా శాకాహార ప్రోత్సహానికి దోహద పడుతోంది. ఈ మేరకు ప్రపంచమంతా మాంసాహారానికి స్వస్తి చెబితే ఏమవుతుంది? పళ్లు, కూరగాయల పెంపకం వల్ల వాతావరణంలో కలిసే కార్బన్డయాక్సైడ్ కన్నా కోళ్లు, మేకలు, ఆవులు, పందుల మాంసం వల్ల ఎక్కువ కార్బన్డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తోంది. 226 గ్రాముల బంగాళ దుంపలు విడుదలచేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్నకారు 0.2 కిలోమీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానం. అదే 226 గ్రాముల ఆవు మాంసం విడుదల చేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్నకారు 12.7 కిలోమీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానమని ‘సైంటిఫిక్ అమెరికన్’ పత్రిక వెల్లడించింది. ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేసి శాకాహారానికి మారితే పర్యావరణంలో కర్బన ఉద్గారాలు మూడింట రెండు వంతులు తగ్గుతాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోని ఆక్స్ఫర్డ్ మార్టిన్ స్కూల్ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. మాంసాహారాన్ని వదులుకోవడం వల్ల అపారంగా నీటి వనరులు కూడా మిగులుతాయి. చెరకు, కూరగాయలు, పళ్లు, పప్పు దినుసులు పండించడం కన్నా కోళ్లు, మేకలు, గొర్రెలు, ఆవుల పెంపకానికి ఎక్కువ నీటి వనరులు అవసరమవుతాయి. అన్నింటి కన్నా ఆవులకు ఎక్కువ నీరు అవసరం. శాకాహారం ఫలితంగా ప్రపంచమంతా పచ్చదనం అలుముకుంటుందని, పర్యావరణంతోపాటు మానవుల ఆరోగ్యం కూడా బాగుపడుతుందన్నది ఈ పరిశోధనల సారాంశం. మాంసాహారానికి స్వస్తి చెప్పడం వల్ల లాభాలే తప్ప నష్టాలే లేవా? ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 400 కోట్ల నెమరువేసే జంతువులను, లక్షలాది కోట్ల కోళ్లను మాంసం కోసం పోషిస్తున్నారు. వీటికి స్వస్తి చెప్పడం వల్లన జీవవైవిద్యం దెబ్బతింటుంది. పేదలకు పౌష్టికాహారం మాంసం రూపంలోనే ఎక్కువగా దొరకుతుంది. అది వారికి దూరమైతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మరో పక్క ప్రపంచంలో మాంసాహారంపై ఆధారపడి కోట్లాది మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. మాంసాహారానికి స్వస్తి చెబితే వారంతా ఒక్కసారిగా రోడ్డున పడడమే కాకుండా కొన్ని జాతుల ప్రజల సంస్కతి, సంప్రదాయాలు కూడా దెబ్బతింటాయని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఓ అధ్యయనంలో తెలిపింది. నిరుద్యోగ సమస్య పెరిగి ప్రజల మధ్య అసమానతలు పెరుగుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైషమ్యాలు కూడా పెరుగుతాయని యూనివర్శిటీ అందులో హెచ్చరించింది. పలు ప్రాణాధార ఔషధాల్లో జంతు ఉత్పత్తులను వాడుతున్నారు. వాటికి కూడా స్పస్తి చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా శాకాహారం గురించి ఎంత తీవ్రంగా ప్రచారం చేస్తున్న మాంసాహారం మానేసే వారు తక్కువే ఉన్నారు. కనుక ఇప్పట్లో మాంసాహారాలకు వచ్చే ముప్పేమి లేదు. -
కంప్యూటర్ గేమ్స్‌తో అవాంఛిత జ్ఞాపకాలు దూరం
న్యూయార్క్: జ్ఞాపకాలు.. కొన్ని తీపివి.. మరి కొన్ని చేదువి. తీపి జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని భావిస్తే చేదు జ్ఞాపకాల్ని మాత్రం త్వరగా మర్చిపోవాలనుకుంటాం. అయితే అది అంత సులభం కాదు. కానీ దీనికో చిన్న ఉపాయం సూచిస్తున్నారు నిపుణులు. కంప్యూటర్ గేమ్స్ ఆడితే ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మెదడుకు గాయం కావడం వల్ల ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు ఏర్పడే అవకాశం ఉంది. మెదడులో గాయాలున్న వారు అవాంచిత దృశ్యాల్ని చూడడానికి ఇష్టపడరు. వాటిని మర్చిపోవాలని వారు భావిస్తారు. మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటారు. అయితే కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల ఇలాంటి విషయాల్ని త్వరగా మర్చిపోగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు. తమ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు.