లండన్: వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితులకు డెక్సామెథాసోన్ అద్భుతంగా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యంత చౌకగా లభించే ఈ ఔషధం కరోనా బాధితుల్లో మూడింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు, ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న బాధితుల్లో ఐదింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. యూకేలోని వివిధ ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 11,500 మందికిపైగా బాధితులపై డెక్సామెథాసోన్‌ను ప్రయోగించి, ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. వెంటిలేటర్ లేదా ఆక్సిజన్ సపోర్టు అవసరం లేని బాధితులకు డెక్సామెథాసోన్‌తో పెద్దగా ఉపయోగం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్ రోగుల్లో సానుకూలమైన ఫలితాలు చూపిన తొలి ఔషధం డెక్సామెథాసోన్ మాత్రమేనని, అది ఆహ్వానించదగ్గ పరిణామమని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ పీటర్ హార్బీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment