న్యూఢిల్లీ: జాత్యహంకార వ్యాఖ్యల ఆరోపణనలపై యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సీటి స్టూడెంట్ యూనియన్‌కి రష్మీ స మంత్ గత నెలలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఒడిషాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో జాత్యహంకార అంశాన్ని మరోసారి లేవనెత్తారు. దీనిపై బ్రిటన్‌తో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే టాప్ యూనివర్సీటీలో ఒకటైన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని వైష్ణవ్ అన్నారు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మహత్మగాంధీ వంటి వారు జాత్యహంకారం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు. సమయం వచ్చినప్పుడు తాము తప్పకుండా ఈ అంశంపై బ్రిటన్‌తో చర్చిస్తామని, ఇలాంటి సంఘటనలను సహించబోమని జైశంకర్ అన్నారు.
కాగా, కర్ణాటకకు చెందిన సమంత్ ఉన్నత విద్యాభ్యాసం కోసం యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లి, ఎన్నికలలో పాల్గొని స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా సమంత్ రికార్డు సృష్టించారు. 2021లో జరిగిన ఒక ఈవెంట్‌లో ఒక సంస్థ స్కాలర్‌షిప్ గురించి ‘హిట్లర్ ఫండ్’ అని సమంత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదం కావడంతో స్టూడెంట్ యూనియన్‌కి రాజీనామా చేశారు.
చదవండి: జాత్యహంకార వ్యాఖ్యలు: రాజీనామా..
Comments
Please login to add a commentAdd a comment