
ఒక వ్యక్తి తనకు ఎదురైన అత్యంత చేదు అనుభవాన్ని ఈ ప్రపంచంతో పంచుకున్నాడు. తాను అమితంగా ప్రేమించిన తన భార్య తనను ఘోరంగా మోసగించిందంటూ తన బాధను వెళ్లగక్కాడు. తన భార్య తన తండ్రితో తిరుగుతున్నదని తెలుసుకుని అతను నిశ్చేష్టుడైపోయాడు. ఇప్పుడు తన భార్య తన తండ్రి కారణంగా గర్భం ధరించిందని తెలుసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకున్నాడు.
ఆ వ్యక్తి పేరు డెక్లాన్ ఫులర్. తన 22 ఏళ్ల భార్య స్టెఫనీ తనను మోసగించిందని తెలియగానే అతనికి కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయినట్లయ్యింది. ఆమె తన 44 ఏళ్ల తండ్రి డైరెన్‌తో సంబంధం పెట్టుకుందని తెలిసి అతను తల్లడిల్లిపోయాడు. ది సన్ రిపోర్టును అనుసరించి ఈ కుటుంబం బ్రిటన్‌లో ఉంటోంది. 22 ఏళ్ల డెక్లాన్, స్టెఫనీలకు రెండేళ్ల కుమార్తె విలో కూడా ఉంది. బాధితుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ తాను మధ్యాహ్నం సమయంలో తన భార్య, తండ్రి కలసి బెడ్‌రూమ్‌లో సరసాలు ఆడటాన్ని చూశానని తెలిపారు.
అయితే స్టెఫనీ దీని గురించి మాట్లాడుతూ తాను, తన మామగారితో పాటు ఆ సమయంలో టీవీ చూస్తున్నానని తెలిపింది. అయితే తన తండ్రి కూడా తనను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. తన తండ్రి గతంలో తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నాడని, అయినా తిరిగి తమ ఇంటికి వచ్చివుంటున్నాడన్నారు. పైగా తన భార్య, తన తండ్రి కలసి ఉండటాన్ని చూశాన్నారు. త్వరలో తన భార్య కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నదని అన్నారు. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తమ కుటుంబం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాగా త్వరలో పుట్టబోయే కవలలకు డెక్లాన్ సవతి సోదరుడు కానున్నాడు. అలాగే అతని కుమార్తె విలో ఆ చిన్నారులకు ఆంటీ కాబోతోంది. ఇటువంటి పరిస్థితులను నమ్మలేకపోతున్నానని డెక్లాన్ వాపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment