parliement session
-
‘విభజన హామీలన్నీ నెరవేర్చాలని పార్లమెంటులో పోరాడతాం’
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. కాగా, సమావేశం అనంతరం వైఎస్సార్ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సమావేశంలో కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న మరో 24 పంటలకు కూడా కేంద్రం ఎంఎస్పీని ప్రకటించాలని కోరామని పేర్కొన్నారు. అదే విధంగా, సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో.. దిశ బిల్లును ఆమోదించాలని, విభజన హామీలన్ని నెరవేర్చేలా పోరాడతామని తెలిపారు. చంద్రబాబు.. ఏడుపు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గతంలో.. వైఎస్సార్సీపీ వ్యవసాయ చట్టాలకు సంబంధించి పలు అభ్యంతరాలను తెలిపిందని గుర్తుచేశారు. కనీస మద్దతు ధర విషయంలో వైఎస్సార్సీపీ తమ విధానాన్ని చాలా స్పష్టంగా విశదీకరించిందన్నారు. ఎంఎస్పీ లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, వారితో చర్చించి వాటిని పునఃపరిశీలించాలని చెప్పడం జరిగిందని తెలిపారు. రైతులు, రైతు సంఘాలు, స్టేక్ హౌల్డర్స్ అభిమతాన్ని తెలుసుకునే విధంగా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సమావేశంలో కోరామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు తమ వాయిస్‌ను గట్టిగా వినిపించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో ఎంపీల ఆధ్వర్యంలో ముఖ్యంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో ఉభయ సభల్లో కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించాలన్నారు. ఇప్పటికే తాము.. చాలా ఓపిక పట్టామని.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదీలేదని స్పష్టంచేశారు. కేంద్రం.. రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడంలేదని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. -
జాత్యహంకార అంశంపై చర్చిస్తాం: విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: జాత్యహంకార వ్యాఖ్యల ఆరోపణనలపై యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సీటి స్టూడెంట్ యూనియన్‌కి రష్మీ స మంత్ గత నెలలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఒడిషాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో జాత్యహంకార అంశాన్ని మరోసారి లేవనెత్తారు. దీనిపై బ్రిటన్‌తో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే టాప్ యూనివర్సీటీలో ఒకటైన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని వైష్ణవ్ అన్నారు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మహత్మగాంధీ వంటి వారు జాత్యహంకారం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు. సమయం వచ్చినప్పుడు తాము తప్పకుండా ఈ అంశంపై బ్రిటన్‌తో చర్చిస్తామని, ఇలాంటి సంఘటనలను సహించబోమని జైశంకర్ అన్నారు. కాగా, కర్ణాటకకు చెందిన సమంత్ ఉన్నత విద్యాభ్యాసం కోసం యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లి, ఎన్నికలలో పాల్గొని స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా సమంత్ రికార్డు సృష్టించారు. 2021లో జరిగిన ఒక ఈవెంట్లో ఒక సంస్థ స్కాలర్షిప్ గురించి ‘హిట్లర్ ఫండ్’ అని సమంత్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదం కావడంతో స్టూడెంట్ యూనియన్‌కి రాజీనామా చేశారు. చదవండి: జాత్యహంకార వ్యాఖ్యలు: రాజీనామా.. -
సోనియాతో వెంకయ్య నాయుడు భేటీ
పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షాల సహాయ సహకారాలు కోరే పనులు దాదాపుగా పూర్తి చేసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఈ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్‌లను చట్టరూపంలోకి మార్చాల్సిన అవసరం ఉండటం, అందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం ఉండటం వంటి కారణాలవల్లే ఈ భేటీ జరిగినట్లు తెలిసింది. సోనియాగాంధీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సమావేశం సజావుగా జరిగిందని, పార్లమెంటు కార్యకలాపాల్లో మద్దతుకోసమే ఆమెను కలిసినట్లు చెప్పారు. తాము చేసే ప్రతిపనిని ప్రతిపక్షాలకు తప్పక వివరిస్తామని, వారు విలువైన సూచనలిస్తే తప్పక స్వీకరిస్తామని అన్నారు. అధికారపక్షం, మిత్రపక్షం సమన్వయంతో ముందుకెళితేనే బాగుంటుందని తెలిపారు.