Anvee Bhutani: ఆక్స్‌ఫర్డ్‌ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా అన్వీ భూటానీ | Anvee Bhutani Elected Oxford Student Union President | Sakshi

Anvee Bhutani: ఆక్స్‌ఫర్డ్‌ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా అన్వీ భూటానీ

Published Sat, May 22 2021 7:31 PM | Last Updated on Sat, May 22 2021 7:34 PM

Anvee Bhutani Elected Oxford Student Union President  - Sakshi

అన్వీ భూటానీ; ఫోటో సోర్స్‌ ట్వీటర్‌ అకౌంట్‌

లండన్‌: యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటానీ ఎన్నికయ్యారు. ఆమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన మాగ్డలిన్‌ కాలేజీలో హ్యూమన్‌ సైన్స్‌ విద్యను అభ్యసిస్తున్నారు. అధ్యక్షురాలిగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని అన్వీ పేర్కొ న్నారు. తోటి విద్యార్థుల నుంచి తనకు అద్భుత మైన మద్దతు లభించిందని ఆనందం వ్యక్తం చేశా యి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో అన్వీ మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. 

అధ్యక్షురాలిగా ఉన్న భారత సంతతి విద్యార్థిని రష్మీ సామంత్‌ రాజీనా మా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ విద్యార్థులందరి తరఫున తాను ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప గౌరవమని అన్వీ వ్యాఖ్యానించింది. 2021–22 విద్యా సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికే చెందిన దేవిక ఎన్నిక కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement