
మళ్లీ టాప్-10లోకి సింధు
భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం పి.వి.సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-10లోకి దూసుకెళ్లింది.
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం పి.వి.సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-10లోకి దూసుకెళ్లింది. గురువారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు తొమ్మిదో ర్యాంకు సాధించి భారత నంబర్‌వన్ షట్లర్ సైనా నెహ్వాల్ (7వ ర్యాంకు)కు మరింత చేరువైంది.
ఇటీవల జరిగిన సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన 18 ఏళ్ల సింధు.. ఆ తరువాత ఆలిండియా ఓపెన్ సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో తన పాయింట్లను 55,752కు పెంచుకున్న సింధు.. సైనా కన్నా 3928 పాయింట్లు మాత్రమే వెనకబడి ఉంది. ఇక పురుషుల విభాగంలో భారత్ నుంచి అత్యుత్తమంగా పారుపల్లి కశ్యప్ 18వ ర్యాంకులో ఉండగా, సౌరభ్‌వర్మ ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి 41వ ర్యాంకులో నిలిచాడు.