
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పురోగతి సాధించింది. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హంపి 2586 ఎలో రేటింగ్ పాయింట్లతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. 2658 ఎలో రేటింగ్ పాయింట్లతో హూ ఇఫాన్ (చైనా) టాప్ ర్యాంక్‌లో ఉంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్‌జున్ రెండో ర్యాంక్ నుంచి (చైనా–2583 పాయింట్లు) మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 2517 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment