second rank
-
జేఈఈ–అడ్వాన్స్డ్ టాపర్ చిరాగ్
న్యూఢిల్లీ/పుణే: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–అడ్వాన్స్డ్ పరీక్షలో మహారాష్ట్రలోని పుణే విద్యార్థి చిరాగ్ ఫలోర్ టాపర్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గంగుల భువన్‌రెడ్డి రెండో ర్యాంకు, బిహార్‌కు చెందిన వైభవ్‌రాజ్ మూడో ర్యాంకు సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ–ఢిల్లీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ–ఢిల్లీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1.5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 43 వేల మందికిపైగా అర్హత సాధించారు. వీరిలో 6,707 మంది బాలికలు ఉన్నారు. మొదటి ర్యాంకు సాధించిన చిరాగ్ ఫలోర్ మొత్తం 396 మార్కులను గాను 352 మార్కులు సాధించాడు. 17వ ర్యాంకర్ కనిష్కా మిట్టల్ బాలికల్లో అగ్రస్థానంలో నిలిచారు. అమె 315 మార్కులు సాధించారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ అభినందనలు తెలియజేశారు. ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సమీప భవిష్యత్తులో ఆత్మ నిర్భర్ భారత్ కోసం పని చేయాలని కోరారు. పరీక్షలో కోరుకున్న ర్యాంకు పొందలేకపోయిన వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తా: చిరాగ్ జేఈఈ–అడ్వాన్స్డ్ టెస్టులో తనకు మొదటి ర్యాంకు దక్కినప్పటికీ అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లోనే చదువు కొనసాగిస్తానని చిరాగ్ ఫలోర్ తెలిపాడు. ఈ ఏడాది మార్చి లో ఎంఐటీలో అడ్మిషన్ పొందానని, ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా క్లాస్‌లకు హాజరవుతున్నానని వెల్లడించాడు. జేఈఈ–మెయిన్‌లో 12వ ర్యాంకు పొందిన చిరాగ్ అడ్వాన్స్‌డ్‌లో ఏకంగా ఫస్టు ర్యాంకు సొంతం చేసుకోవడం విశేషం. ఐఐటీల్లో సీటు దక్కించుకోవడం చాలా కష్టమైన విషయమని చిరాగ్ వివరించాడు. ప్రతిభకు మెరుగుదిద్దే విద్యావిధానం ఉన్న ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తానని పేర్కొన్నాడు. ఎంఐటీ ప్రవేశ పరీక్ష కంటే జేఈఈ టెస్టే కఠినంగా ఉంటుందని, ఈ పరీక్ష తనకు భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. చిరాగ్ ఫలోర్ ఢిల్లీని ప్రగతి పబ్లిక్ స్కూల్, పుణేలోని సెయింట్ ఆర్నాల్డ్ సెంట్రల్ స్కూల్లో చదివాడు. 2019లో హంగేరీలో జరిగిన 13వ అస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. 2019లో అమెరికన్ మ్యాథమెటిక్స్ పోటీలో ఫస్టు ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 2020 సంవత్సరానికి గాను బాలశక్తి పురస్కారం స్వీకరించాడు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకర్లు... 1. చిరాగ్ ఫాలర్ (మహారాష్ట్ర) 2. గంగుల భువన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 3. వైభవ్‌రాజ్ (బిహార్) 4. ఆర్.మహేందర్‌రాజ్ (రాజస్తాన్) 5. కేశవ్ అగర్వాల్ (హరియాణా) 6. హర్ధిక్ రాజ్‌పాల్ (తెలంగాణ) 7. వేదాంగ్ ధీరేంద్ర అస్గోవాంకర్ (మహారాష్ట్ర) 8. స్వయం శశాంక్ చూబే (మహారాష్ట్ర) 9. హర్షవర్ధన్ అగర్వాల్ (హరియాణా) 10. ధ్వనిత్ బేనీవాల్ (హరియాణా) -
రెండో స్థానంలోనే కోహ్లి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు సారథి విరాట్ కోహ్లి తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బ్యాట్స్‌మన్ విభాగంలో కోహ్లి 886 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా... చతేశ్వర్ పుజారా (8), అజింక్యా రçహానే (10) తమ స్థానాలను కాపాడుకున్నారు. ఈ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా మూడు, అశ్విన్ ఐదు ర్యాంకుల్లో ఉన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భారత్ 360 పాయింట్లతో ‘టాప్’ పొజిషన్‌ను కొనసాగిస్తోంది. ఆసీస్ (296)... ఇంగ్లండ్ (279) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
రెండో ర్యాంక్‌లో రెజ్లర్ బజరంగ్
న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ 59 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 60 పాయింట్లతో ఒలింపిక్ చాంపియన్ రషిదోవ్ (రష్యా) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్–56 పాయింట్లు), ఇస్మాయిల్ ముస్జుకజెవ్ (హంగేరి–41 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్ ప్రకారం ఈ నలుగురికి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో టాప్–4లో సీడింగ్ లభించడం ఖాయమైంది. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన రవి దహియా 45 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా 54 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. -
ప్రపంచ రెండో ర్యాంకర్‌గా కోనేరు హంపి
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పురోగతి సాధించింది. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హంపి 2586 ఎలో రేటింగ్ పాయింట్లతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. 2658 ఎలో రేటింగ్ పాయింట్లతో హూ ఇఫాన్ (చైనా) టాప్ ర్యాంక్‌లో ఉంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ రెండో ర్యాంక్ నుంచి (చైనా–2583 పాయింట్లు) మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 2517 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉంది. -
టి20 కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో రాహుల్
దుబాయ్: న్యూజిలాండ్‌తో ముగిసిన టి20 సిరీస్‌ను 5–0తో భారత్ క్లీన్‌స్వీప్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన భారత బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ టి20 ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను నాలుగు స్థానాలు పురోగతి సాధించాడు. దీంతో 823 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను సాధించాడు. భారత సారథి విరాట్ కోహ్లి తొమ్మిది, రోహిత్ శర్మ పదో స్థానాల్లో ఉన్నారు. ఇదే సిరీస్‌లో రాణించిన శ్రేయస్ అయ్యర్ 55వ, మనీశ్ పాండే 58వ స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో పాకిస్తాన్ టి20 సారథి బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా 11వ, చహల్ 30వ, శార్దుల్ ఠాకూర్ 57వ, నవదీప్ సైనీ 71వ, రవీంద్ర జడేజా 76వ స్థానాల్లో నిలిచారు. -
మహిళా టాపర్‌గా హేమలత
మారుమూల పల్లెటూరు... సాధారణ వ్యవసాయ కుటుంబం... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం... ఇవేవీ ఆమె లక్ష్యానికి అడ్డంకి కాలేదు! స్వయంకృషితో ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే కుటుంబం అండగా నిలిచింది! సివిల్ సర్వీసెస్ తర్వాత అంత అత్యున్నతమైన ఉద్యోగాన్ని సాధించడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి! తొలిసారిగా ఒక గ్రూప్–1 టాపర్‌ను సమాజసేవకు అందించిన కనుగులవానిపేటలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి! ఇంతటి భావోద్వేగాలకు కారణమైన ఆమె పేరు కనుగుల హేమలత! గ్రూప్–1 (2011)లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. మహిళల్లోనే టాపర్‌గా నిలిచింది. సిక్కోలు సిగలో మరో మణిపూసగా మెరిసింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:శ్రీకాకుళం రూరల్ మండలంలో ఇప్పిలి శివారు గ్రామమైన కనుగులవానిపేట ముద్దుబిడ్డే హేమలత! ఆమె తండ్రి ప్రసాదరావు, తల్లి సుజాత. వారిది వ్యవసాయ కుటుంబం. ఆరోగ్యపరమైన కారణాల వల్ల ప్రసాదరావు పాఠశాల స్థాయిలో అర్ధంతరంగా చదువు ముగించాల్సి వచ్చింది. ఆయన సోదరులంతా విద్యాభ్యాసం ద్వారానే మంచి స్థానంలోకి వెళ్లారు. ఉన్నత విద్యాభ్యాసం చేయాలి, సమాజసేవ చేయాలి అనే కలలను తన పిల్లల ద్వారా సాకారం చేయాలని తపించారు. అందుకు తగ్గట్లే హేమలత సహా ముగ్గురు పిల్లలూ గౌరవనీయమైన ఉద్యోగాలు సాధించారు. ప్రసాదరావు పెద్ద కుమార్తె హైమావతి ఆమదాలవలస మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు జగదీశ్వరరావు జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని దేవరకొండలోనే ఆయన ఉన్నారు. ఇప్పుడు రెండో కుమార్తె హేమలత గ్రూప్–1లో టాపర్‌గా నిలిచారు. ఈ ర్యాంకు డిప్యూటీ కలెక్టరు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సమాజసేవ చేయడానికి, తద్వారా ఉన్నతస్థాయిలో తగిన గుర్తింపు పొందడానికి అవకాశం రావడంతో హేమలత కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. స్వయంకృషితోనే ఒక్కో మెట్టూ... కనుగులవానిపేటలో ప్రసాదరావు కుటుంబానికి మూడెకరాల మెట్టు భూమి ఉంది. గతంలో చిన్న రైస్‌మిల్లు కూడా ఉండేది. ఆయన ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో వాటిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబపోషణ చూసేవారు. కానీ ఏదేమైనా బాగా చదువుకోవాలని పిల్లలకు నూరిపోసేవారు. తండ్రి మనస్సును అర్థం చేసుకున్న పిల్లలు ముగ్గురూ కష్టపడి చదివారు. హేమలత ప్రాథమిక విద్యాభ్యాసం కనుగులవానిపేట పాఠశాలలోనే చదివారు. అయితే గురుకుల పాఠశాలలో చేర్పిస్తే చదువు బాగుంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. దీంతో తండ్రి ప్రోత్సాహంతో హేమలత ఎచ్చెర్లలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో సీటు సాధించింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ అక్కడే విద్యాభ్యాసం సాగింది. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో 2001 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఎంపీసీ సీటు వచ్చింది. అప్పుడే తోటి స్నేహితుల మధ్య సివిల్స్, గ్రూప్–1 గురించి చర్చ వచ్చేదని, సమాజసేవ నేరుగా చేసే అవకాశం ఆ ఉద్యోగాల్లో ఉంటుందనే విషయం తెలిసిందని హేమలత చెప్పారు. కానీ ఇంటర్ తర్వాత ఎంసెట్ ప్రిపరేషన్ ఏడాది చేసినా ఆశించిన ర్యాంకు రాలేదు. అక్క హైమావతి ప్రోత్సాహంతో టీచర్ ట్రైనింగ్ వైపు దృష్టి పెట్టారు. 2002లో శ్రీకాకుళం డైట్లో సీటు సాధించారు. 2004లో కోర్సు పూర్తి చేస్తుండగానే డీఎస్సీ–2003 నోటిఫికేషన్ వెలువడింది. ఆ పరీక్షల్లోనూ రాష్ట్రస్థాయిలో మహిళా టాపర్‌గా హేమలత నిలిచారు. 2005లో సెకండ్‌గ్రేడ్ టీచర్ ఉద్యోగం పొందారు. ఎల్ఎన్ పేట మండలం బొత్తాడసింగి పాఠశాలలో, తర్వాత 2012 వరకూ ఎచ్చెర్ల మండలంలో పనిచేశారు. ఒకవైపు టీచర్ ఉద్యోగం చేస్తూనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కూడా పూర్తి చేశారు. 2012లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం పార్వతీపురంలో పనిచేస్తున్నారు. పదేళ్ల పరిశ్రమ ఫలించింది సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు 2007 సంవత్సరంలోనే హేమలత ప్రిపరేషన్ ప్రారంభించారు. గ్రూప్–1 2007 నోటిఫికేషన్లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ దశ వరకూ వెళ్లారు. త్రుటిలో అవకాశం చేజారింది. తర్వాత మరో రెండు నోటిఫికేషన్లలోనూ ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. ఇక ఆఖరి ప్రయత్నంగా 2011 గ్రూప్–1 నోటిఫికేషన్లో దరఖాస్తు చేశారు. 2012లో మెయిన్స్, ఇంటర్వ్యూ ఆమె బాగానే చేశారు. కానీ న్యాయపరమైన వివాదాల వల్ల ఫలితాలు రద్దు చేసినా ఆమె నిరాశపడలేదు. 2016 సెప్టెంబర్‌లో మరోసారి మెయిన్స్ పరీక్షలు, ఇటీవలే నిర్వహించిన ఇంటర్వ్యూలో బాగానే అటెమ్ట్ చేశానని, తప్పక మంచి పోస్టు వస్తుందని ఆశించానని హేమలత చెప్పారు. ఆశించినట్లే రెండో ర్యాంకు, మహిళలలో ప్రథమ ర్యాంకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. భర్త నుంచి ప్రోత్సాహం హేమలత భర్త కె.తవిటినాయుడు ప్రస్తుతం విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ప్రణవ్ ఉన్నాడు. తన విజయంలో తల్లిదండ్రులు, సోదరి, సోదరుడుతో భర్త ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని హేమలత చెప్పారు. గ్రామీణ ప్రాంతవారమని నిరాశ వద్దు ‘ఉన్నత ఉద్యోగాల సాధనకు గ్రామీణ నేపథ్యం ఏమాత్రం అడ్డంకి కాదు. గ్రామీణ ప్రాంతవారమని అమ్మాయిలకు నిరాశ వద్దు. కష్టపడి, ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అభిరుచిని బట్టి ఏ రంగాన్ని ఎంచుకున్నా లక్ష్యం సాధించేవరకూ విశ్రమించకూడదు.’ – కనుగుల హేమలత, గ్రూప్–1 విజేత -
తైక్వాండో విజేతలకు అభినందనలు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : విజయనగరంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి 3వ క్యాడెట్ అండర్–14 (36వ జూనియర్), అండర్–17 విభాగాలలో తైక్వాండో పోటీల్లో నాలుగు బంగారు, రెండు రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించి అనంతపురం జట్టు రెండో స్థానంలో నిలిచిందని జిల్లా తైక్వాండో అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. గురువారం ఆర్డీటీ కార్యాలయంలో ఆర్డీటీ ప్రెసిడెంట్ అన్నే ఫెర్రర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్‌ను కలిశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను వారు అభినందించారు. జిల్లాలో తైక్వాండో క్రీడ అభివద్ధికి కషి చేస్తామని హామీ ఇచ్చారు. బంగారు పతకాలు సాధించినవారిలో బాలురు జయేష్, దత్తుసాయి, బాలికలు రోజా, సాయిదీప్తి ఉన్నారు. హేమ, ఆశాదీక్షిత రజకపతకాలుసాధించారు. కాంస్య పతకాలు సాధించినవారిలో బాలురు శివకష్ణ, నదీమ్‌ఖాన్, బాలికలు ప్రశాంతి, యశశ్విణి, హేమశశి ఉన్నారు. -
సీఏ ఫైనల్లో మోహన్‌కు రెండో ర్యాంక్
శ్రీకాళహస్తి/విజయవాడ (లబ్బీపేట): చిత్తూరు జిల్లా తొట్టంబేడు వుండలంలోని చోడవరం గ్రావూనికి చెందిన నాగోలు మోహన్‌కువూర్ సీఏలో ఆల్ ఇండియూ రెండో ర్యాంకును సాధించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆదివారం సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలు ప్రకటించింది. ఫలితాల్లో మోహన్‌కుమార్ జాతీయస్థాయిలో ప్రతిభ చూపి రెండోర్యాంకు కైవసం చేసుకున్నారు. విజయవాడలోని సూపర్‌విజ్‌లో మోహన్‌కుమార్ శిక్షణ పొందారు. సీపీటీ, ఐపీసీసీల్లో జాతీయస్థాయిలో తొమ్మిదో ర్యాంకును కైవసం చేసుకున్న మోహన్‌కుమార్.. సీఏ ఫైనల్లోనూ రెండో ర్యాంకుతో సత్తా చాటారు. మొదటి ర్యాంకును తమిళనాడుకు చెందిన విద్యార్థి దక్కించుకోగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మోహన్‌కుమార్‌దే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. మోహన్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు మంజుల, నాగరాజురెడ్డి వ్యవసాయ పనులు చేస్తుంటారని తెలిపారు. ఎంతో కష్టపడుతూ తనను చదివించారని, ఇప్పుడు సాధించిన జాతీయ ర్యాంకును తల్లిదండ్రులకే అంకితమిస్తున్నానని చెప్పారు. సూపర్ విజ్ శిక్షణతోపాటు తన అన్నయ్య భానుప్రసాద్ స్ఫూర్తిగా నిలిచాడన్నారు. శిక్షణ ఇచ్చిన సూపర్‌విజ్ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు మోహన్‌కుమార్‌ను అభినందించారు. తొట్టంబేడు గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు. -
పదోన్నతులకు డీపీసీ
సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యా శాఖలో ద్వితీయ శ్రేణి గెజిటెడ్ అధికారి పోస్టుల్లో పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని (డీపీసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రెండేళ్ల కాలపరిమితితో పని చేస్తుందని పేర్కొన్నారు. మైనార్టీ శాఖకు రూ.30 కోట్లు మంజూరు మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్ షిప్ కింద రూ.30 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
మొదటి రెండూ దొంగ ర్యాంకులే!
-
టోర్నీకి ముందే ఫిట్‌గా ఉంటా: సైనా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వ రల్డ్ చాంపియన్‌షిప్‌కు ముందే భుజం నొప్పి నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 10 నుంచి జకార్తాలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సైనాకు వ రల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం ఇంకా ఊరిస్తూనే ఉంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా క్వార్టర్స్ దాటి ముందుకెళ్లలేదు. ‘ప్రస్తుతానికైతే ఇంకా కొంచెం నొప్పిగా ఉంది. అయితే టోర్నీకి ముందే ఫిట్‌గా ఉంటానన్న నమ్మకముంది. ఇక డ్రా విషయానికి వస్తే కఠినంగానే ఉంది. నా శిక్షణ ఆశాజనకంగా సాగుతోంది. అత్యున్నత టోర్నీలో ఆడేటప్పుడు మనం అన్ని విభాగాల్లోనూ రాటుదేలాల్సి ఉంటుంది’ అని సైనా తెలిపింది.