
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో టాప్–25లో చోటు సంపాదించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా జ్ఞానశేఖరన్ సత్యన్ గుర్తింపు పొందాడు. సోమవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో చెన్నైకు చెందిన సత్యన్ నాలుగు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
హంగేరిలో గత వారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్యన్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ‘నా ప్రదర్శనతో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఈ ఏడాది చివరికల్లా టాప్–15లోకి చేరడమే నా లక్ష్యం’ అని సత్యన్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment