నంబర్‌వన్ హీనా | Nambarvan hīnā | Sakshi
Sakshi News home page

నంబర్‌వన్ హీనా

Published Tue, Apr 8 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM

నంబర్‌వన్ హీనా

నంబర్‌వన్ హీనా

 ప్రపంచ షూటింగ్ ర్యాంకింగ్స్

 న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా షూటర్ హీనా సిద్ధూ టాప్ ర్యాంకుకు ఎగబాకింది. ఇటీవల విశేషంగా రాణిస్తున్న ఆమె... ఐఎస్‌ఎస్‌ఎఫ్ విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. గత నవంబర్‌లో మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో  ఆమె వరల్డ్ రికార్డ్ స్కోరుతో స్వర్ణ పతకం నెగ్గింది. గత నెల కువైట్‌లో జరిగిన ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం, అమెరికాలో జరిగిన ప్రపంచకప్‌లో రజతం గెలిచింది.

దీంతో అచిర కాలంలోనే నంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘టాప్ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. కొన్నాళ్లుగా స్థిరంగా చెమటోడ్చడం వల్లే ఈ స్థానానికి ఎగబాకాను. నా భర్త రోనక్ పండిత్ ప్రోత్సాహం, కోచ్ అనతోలి శిక్షణ వల్లే రాణించగలుగుతున్నాను. ప్రభుత్వ సాయం కూడా మరవలేను. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఇప్పించింది. ఇదే ఉత్సాహంతో ఒలింపిక్ మెడల్ లక్ష్యంగా కఠోరంగా శ్రమిస్తాను’ అని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement