Heena Sidhu
-
మళ్లీ గురి తప్పారు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత స్టార్ షూటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఒత్తిడికి లోనై గురి తప్పారు. ఫలితంగా అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ టోర్నమెంట్లో నాలుగో రోజు భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్, అనురాధ, హీనా సిద్ధూ, వరుసగా 14వ, 22వ, 25వ స్థానాల్లో నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో గాయత్రి 36వ స్థానంలో, సునిధి చౌహాన్ 49వ స్థానంలో నిలిచారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో ఆదర్శ్ సింగ్, అర్పిత్ గోయల్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరగ్గా... 16 ఏళ్ల అనీశ్ భన్వాలా ఫైనల్‌కు చేరినా పతకం నెగ్గలేదు. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అనీశ్ భన్వాలా 14 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఒలింపిక్ చాంప్ క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ–35 పాయిం ట్లు) స్వర్ణం... ప్రపంచ చాంపియన్ జున్మిన్ లిన్ (చైనా–31 పాయింట్లు) రజతం... కిమ్ జున్హోంగ్ (కొరియా–22 పాయింట్లు) కాంస్యం నెగ్గారు. -
హీనా ఖాతాలో కాంస్యం
పాలెంబాంగ్: ఆసియా క్రీడల షూటింగ్ పోటీల్లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధూ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. ఫైనల్లో హీనా 219.2 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన మనూ భాకర్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. కియాన్ వాంగ్ (చైనా–240.3 పాయింట్లు) స్వర్ణం, కిమ్ మిన్‌జుంగ్ (కొరియా–237.6 పాయింట్లు) రజతం సాధించారు. -
షూటింగ్లో భారత్‌కు మరో మెడల్
-
షూటింగ్ సెలక్షన్స్‌పై హీనా ఫిర్యాదు
న్యూఢిల్లీ: భారత మేటి షూటర్ హీనా సిద్ధూ తనకు సెలక్షన్స్‌లో జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు శనివారం జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) తలుపు తట్టింది. అయితే రోజంతా నిరీక్షించిన ఆమెకు ఎన్ఆర్ఏఐ చీఫ్ రణీందర్ సింగ్ ఆదివారం చర్చిద్దామని హామీ ఇచ్చారు. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత షూటింగ్ జట్టులో తనను మిక్స్డ్ పెయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ నుంచి తప్పించారని 28 ఏళ్ల హీనా వాపోయింది. కేవలం వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనే ఎంపిక చేయడం అసంతృప్తికి గురిచేస్తోందని చెప్పింది. 25 మీ. పిస్టల్ ఈవెంట్లో ఆమె కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్. 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనూ హీనా రజతం నెగ్గింది. ‘ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్‌ను కలిసేందుకు రోజంతా నిరీక్షించాను. ఎట్టకేలకు ఆయన స్పందించి ఆదివారం మాట్లాడదామని చెప్పారు. ఆయన మంచి వ్యక్తి అని తెలిసే ఇక్కడికి వచ్చాను. మెరిట్‌కు విలువిస్తారని, పారదర్శకత పాటిస్తారనే నమ్మకముంది. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు సెలక్షన్ కమిటీలో సాంకేతిక అవకతవకలకు పాల్పడ్డారు’ అని హీనా విమర్శించారు. మను బాకర్‌కు మేలు చేకూర్చేందుకే తనను టీమ్ ఈవెంట్ నుంచి తప్పించారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెస్తున్న తనలాంటి షూటర్లకే ఇలాంటి పరిస్థితి రావడం ఘోరమని ఆమె వాపోయింది. -
నిలకడపై దృష్టిపెడతా: హీనా
న్యూఢిల్లీ: తాజాగా గోల్డ్‌కోస్ట్‌లో ముగిసిన కామన్వెల్త్ క్రీడల షూటింగ్లో స్వర్ణం, రజతం గెలిచిన హీనా సిద్ధూ... ఈ నెల 22 నుంచి 29 వరకు మ్యునిక్‌లో జరగనున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్పైనా ఆశావహంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, తాను మరింత నిలకడ సాధించాల్సి ఉందని పేర్కొంది. 28 ఏళ్ల హీనా గోల్డ్‌కోస్ట్‌లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో కామన్వెల్త్ క్రీడల రికార్డు నెలకొల్పుతూ స్వర్ణం నెగ్గింది. నేటి నుంచి 21 వరకు సన్నాహకం కొనసాగిస్తానని చెప్పిన ఆమె... మారిన షూటింగ్ షెడ్యూల్ దృష్ట్యా తన దృష్టంతా నిలకడ కొనసాగించడంపైనే అని వివరించింది. ఆగస్టు, సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో టాప్‌లో నిలవడం ధ్యేయమని పేర్కొంది. -
హీనా పసిడి గురి
వెయిట్‌లిఫ్టర్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మను భాకర్... జీతూ రాయ్ పసిడి పతకాలు సొంతం చేసుకోగా... మూడో రోజు హీనా సిద్ధూ భారత్‌కు మరో బంగారు పతకాన్ని అందించింది. పారా పవర్‌లిఫ్టింగ్‌లో సచిన్ చౌధరీ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ఓవరాల్‌గా పోటీల ఆరోరోజు భారత్ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక కాంస్యం చేరింది. పతకాల వేటలో జోరు తగ్గినా పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. గోల్డ్‌కోస్ట్: సత్తా ఉన్నా మెగా ఈవెంట్స్‌లో స్వర్ణం సాధించడంలో గురి తప్పుతుందని తనపై వస్తున్న విమర్శలకు ఎట్టకేలకు హీనా సిద్ధూ తన ప్రదర్శనతోనే జవాబు ఇచ్చింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇన్నాళ్లు లోటుగా ఉన్న వ్యక్తిగత పసిడి పతకాన్ని మంగళవారం ఆమె తన ఖాతాలో వేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం నెగ్గిన హీనా సిద్ధూ... 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకంతో మెరిసింది. ఫైనల్లో హీనా 38 పాయింట్లు స్కోరు చేసి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో షూటర్ అన్ను సింగ్ 15 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది. ఎలీనా గలియబోవిచ్ (ఆస్ట్రేలియా–35 పాయింట్లు) రజతం... అలా సజానా అజహరి (మలేసియా–26 పాయింట్లు) కాంస్యం గెలిచారు. క్వాలిఫయింగ్‌లో అన్ను 584 పాయింట్లతో రెండో స్థానంలో, హీనా 579 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. దంత వైద్య విద్య అభ్యసించిన హీనాకు ఆమె భర్త రోనక్ పండిత్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2006 మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లో రోనక్ 25 మీటర్ల పిస్టల్ పెయిర్స్ విభాగంలో స్వర్ణం సాధించడం విశేషం. భారీ అంచనాలతో 2016 రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన హీనా 20వ స్థానంలో నిలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో ఏడో స్థానాన్ని సంపాదించింది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రజతం, పెయిర్స్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. తాజా ప్రదర్శనతో ఎట్టకేలకు వ్యక్తిగత స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో సీనియర్ షూటర్లు గగన్ నారంగ్, చెయిన్ సింగ్ ఫైనల్‌కు చేరినా పతకం మాత్రం నెగ్గలేకపోయారు. చెయిన్ సింగ్ 204.8 పాయింట్లతో నాలుగో స్థానంలో, గగన్ నారంగ్ 142.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. తొలి లక్ష్యం పూర్తి... హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్ బెర్త్‌లు ఖాయం చేసుకొని తొలి లక్ష్యాన్ని పూర్తి చేశాయి. మలేసియాతో జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 2–1తో గెలిచింది. రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో భారత్ ఏడు పాయింట్లతో ఇంగ్లండ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే సెమీస్ చేరిన ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య బుధవారం జరిగే మ్యాచ్ ద్వారా గ్రూప్ టాపర్ ఎవరో తేలుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 1–0తో గెలిచింది. దాంతో తొమ్మిది పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరాయి. అయ్యో... అనస్! అథ్లెటిక్స్‌లో పురుషుల 400 మీటర్ల ఫైనల్లో మొహమ్మద్ అనస్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫెనల్ రేసును అనస్ 45.31 సెకన్లలో ముగించి కొత్త జాతీయ రికార్డును సృష్టించినా పతకం మాత్రం నెగ్గలేకపోయాడు. మరోవైపు మహిళల 400 మీటర్ల విభాగంలో హిమా దాస్ సెమీఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. తద్వారా ఈ గేమ్స్ చరిత్రలో ఈ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. రెండో రౌండ్లో సాత్విక్–అశ్విని జంట బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ వ్యక్తిగత ఈవెంట్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఈ భారత జోడీ 21–9, 21–5తో స్టువర్ట్–చోల్ లీ ద్వయంపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ‘బై’ పొందిన శ్రీకాంత్, ప్రణయ్, సైనా, సింధు బుధవారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పోటీపడతారు. హుసాముద్దీన్‌కు పతకం ఖాయం బాక్సింగ్‌లో ఐదుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరడంద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకన్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు) 5–0తో ఎవరిస్టో ములెంగా (జాంబియా)పై... అమిత్ (49 కేజీలు) 4–1తో అకీల్ అహ్మద్ (స్కాట్లాండ్)పై... మనోజ్ (69 కేజీలు) 4–1తో టెరీ నికోలస్ (ఆస్ట్రేలియా)పై... నమన్ తన్వర్ (91 కేజీలు) 5–0తో ఫ్రాంక్ మసోయి (సమోవా)పై... సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) 4–1తో నైగెల్ పాల్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో)పై గెలిచారు. ►పారా పవర్‌లిఫ్టింగ్‌లో భారత లిఫ్టర్ సచిన్ చౌధరీ ప్లస్ 107 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మొత్తం 181 కేజీల బరువెత్తాడు. -
కామన్వెల్త్ గేమ్స్: పసిడి సాధించిన హీనా
-
కామన్వెల్త్ గేమ్స్: పసిడి సాధించిన హీనా
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పసిడి పతకాల జోరు కొనసాగుతోంది. ఆరో రోజు ఈవెంట్లో భాగంగా మంగళవారం మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ హీనా సిద్దు స్వర్ణం కైవసం చేసుకుంది. 38 రికార్డు స్కోర్ నమోదు చేయడంతో హీనాకు పసిడి ఖాయమైంది. ఇప్పటికే 10మీటర్ల విభాగంలో హీనా రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ 2018లో భారత్‌కి రెండు పతకాలు అందించిన తొలి క్రీడాకారిణిగా హీనా సిద్దూ రికార్డుకెక్కింది. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 11కు చేరగా 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం మెడల్స్ సంఖ్య 20కి చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట
-
కామన్వెల్త్ గేమ్స్ : 6 స్వర్ణాలతో నాలుగోస్థానంలో భారత్
గోల్డ్ కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం భారత్ ఖాతాలో మరో ఐదు పతకాలు చేరాయి. నాలుగో రోజు వెయిట్ లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణ పతకం గెలవగా.. 10 మీటర్ల మహిళల ఏయిర్ పిస్టల్ విభాగంలో మనూ భాకర్ స్వర్ణం సాధించారు. ఇదే విభాగంలో హీనా సిద్ధు రజత పతకం గెలిచారు. 10 మీటర్ల పురుషుల ఏయిర్ పిస్టల్ విభాగంలో రవికుమార్ కాంస్యం సొంతం చేసుకోగా.. పురుషుల 94 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వికాస్ ఠాకుర్ కాంస్యపతకం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్యలతో మొత్తం11 మెడల్స్‌తో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో ఎనిమిది పతకాలు వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. ఇక ఈ జాబితాలో 66 పతకాలతో(23 స్వర్ణాలు) ఆస్ట్రేలియా తొలిస్థానంలో ఉండగా.. 37 పతకాలతో(15 స్వర్ణాలు) ఇంగ్లండ్, 23 పతకాలతో(6 స్వర్ణాలు) కెనడా భారత్‌కన్నా ముందు స్థానాల్లో ఉన్నాయి. 18 పతకాలు గెలిచిన స్కాట్లాండ్ స్వర్ణపతకాల సంఖ్య(4) భారత్ కన్నా తక్కువగా ఉండటంతో ఐదో స్థానానికి పరిమితమైంది. -
‘స్వర్ణ’ మను .. హీనాకు రజతం
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళా షూటర్లు రాణించటంతో మరో రెండు పతకాలు భారత్ ఖాతాలోకి చేరాయి. ఆదివారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్(మహిళల) పోటీల్లో హరియాణాకు చెందిన 16 ఏళ్ల మను భాకర్ స్వర్ణం సాధించింది. ఇక భారత్‌కే చెందిన మరో షూటర్ హీనా సిధూ రజత పతకం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలెనా గలియా బోవిచ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో కామెన్వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 9కి చేరుకుంది. అందులో ఆరు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. కాగా, ఈ ఉదయమే వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్ 69 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. -
హీనా మళ్లీ మెరిసింది
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజే భారత షూటర్ హీనా సిద్ధూ మెరిసింది. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీ మహిళల 10మీ. ఎయిర్‌రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో హీనా 240.8 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గాలియాబొవిచ్ (238.2), క్రిస్టీ గిల్‌మెన్ (213.7) వరుసగా రజత కాంస్యాలను గెలుచుకున్నారు. ఇటీవలే ఢిల్లీలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నీలోనూ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పసిడి పతకాన్ని సాధించిన హీనా, వారం తిరిగే లోపే మరో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్‌కు చెందిన దీపక్ కుమార్ 224.2 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకోగా, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్‌నారంగ్ 203 పాయింట్లు స్కోర్ చేసి నాలుగోస్థానంతో సంతృప్తి చెందాడు. మహిళల స్కీట్ ఈవెంట్లో రష్మీ రాథోడ్ (భారత్) ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆమె క్వాలిఫయింగ్ ఈవెంట్లో 75 పాయింట్లకు గానూ 65 స్కోర్ చేసి ఫైనల్లో ఆఖరిదైన ఆరో స్థానాన్ని దక్కించుకుంది. -
రియో నుంచి మాజీ నంబర్‌వన్ ఔట్
రియో డి జనీరో: భారత టాప్ షూటర్ హీనా సిద్ధూ విఫలమైంది. ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ మళ్లీ నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా మంగళవారం జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్ ర్యాపిడ్ విభాగంలో జరిగిన అర్హత పోటీల్లో హీనా 20వ స్థానంలో నిలిచింది. హీనాపై భారత్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. మూడు రౌండ్లలో కలిపి 97, 97, 96తో మొత్తం 290 పాయింట్లు సాధించిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ అయిన హీనా ఇంటిదారి పట్టింది. ఇప్పటికే రియోలో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్‌కు చేరుకోవడంలో హీనా విఫలమైన విషయం తెలిసిందే. ఆమె పాల్గొనే అన్ని విభాగాలు ముగియడంతో పతకం సాధించకుండానే హీనా రియో నుంచి వైదొలిగింది. -
మాజీ నంబర్ వన్ కూడా విఫలం!
రియోడిజనీరో: భారత టాప్ షూటర్ హీనా సిద్ధూ విఫలమైంది. హీనాపై భారత్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. రియో ఒలింపిక్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. క్వాలిఫైయింగ్ పోటీల్లో ప్రపంచ మాజీ నెంబర్ వన్ అయిన హీనా 380 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి 14వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ కు అర్హత పోటీల్లో బంగారు పతకం నెగ్గిన హీనా దాంతో పాటు ఒలింపిక్ బెర్త్ సొంతం చేసుకుంది. ఎన్నో ఆశలు రేకెత్తించినా చివరికి అత్యున్నత క్రీడల్లో హీనా ఒత్తిడికి లోనై ఫైనల్ చేరడంలో విఫలమైంది. -
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో గగన్ నారంగ్‌కు నిరాశ
నాలుగు రోజుల వ్యవధిలో రెండు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న భారత షూటర్ గగన్ నారంగ్ పతకం మాత్రం సాధించలేకపోయాడు. అజర్బైజాన్లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో ఆదివారం భారత షూటర్లు గగన్ నారంగ్, హీనా సిద్ధూ నిరాశ పరిచారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఫైనల్లో గగన్ నారంగ్ 103.1 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో హీనా సిద్ధూ ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
రజతం నెగ్గిన హీనా
న్యూఢిల్లీ: హ నోవర్ అంతర్జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు హీనా సిద్ధూ, అభినవ్ బింద్రా రజత, కాంస్య పతకాలతో రాణించారు. జర్మనీలో జరిగిన ఈ టోర్నీలో హీనా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 199.1 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. జర్మనీకి చెందిన సాండ్రా హార్నంగ్ 199.4 పాయింట్లతో స్వర్ణాన్ని నెగ్గింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అతను 184.5 పాయింట్లు స్కోరు చేశాడు. జాన్ లాచ్బిలర్ (స్విట్జర్లాండ్-206.2 పాయింట్లు), నికోలస్ స్కాలెన్బెర్గర్ (జర్మనీ- 204.5) స్వర్ణ, రజత పతకాలు సాధించారు. -
హీనాకు రియో బెర్త్
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో స్వర్ణం న్యూఢిల్లీ: భారత టాప్ షూటర్ హీనా సిద్ధూ.. రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో హీనా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం గెలుచుకుంది. 8 మంది బరిలోకి దిగిన ఫైనల్స్‌లో భారత షూటర్ 199.4 పాయింట్లు సాధించింది. చైనీస్ తైపీకి చెందిన టియాన్ చియా చెన్ (198.1), గిమ్ యున్ మి (177.9) రజతం, కాంస్యం దక్కించుకున్నారు. భారత్ తరఫున షూటింగ్లో ఇది 9వ ఒలింపిక్ బెర్త్. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో స్వప్నిల్ కౌశల్ 617.2 పాయింట్లతో 14వ; సుశీల్ ఘాలె 17వ, సురేంద్ర సింగ్ రాథోడ్ 24వ స్థానంతో సంతృప్తిపడ్డారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్ కుమార్ 285 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. నీరజ్ కుమార్, హర్‌ప్రీత్ సింగ్‌లకు 13, 16 స్థానాలు దక్కాయి. మహిళల ట్రాప్ ఈవెంట్లో ఒక్కరు కూడా క్వాలిఫయింగ్ అడ్డంకిని దాటలేకపోయారు. -
హీనాకు స్వర్ణం
కువైట్ సిటీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధూ 198.2 పాయింట్లతో స్వర్ణం సాధిం చింది. జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో శ్రీనివేత 195.8 మీటర్లతో పసిడిని సొంతం చేసుకుంది. ఈ విభాగంలో భారత్‌కు టీమ్ స్వర్ణం కూడా లభించింది. 10మీ. యూత్ మహిళల విభాగంలోనూ భారత్‌కు పసిడి లభించింది. -
‘పసిడి’తోనే ముగించారు
చివరి రోజు భారత్‌కు ఐదు స్వర్ణాలు ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత షూటర్లు మెరిశారు. ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలతో తమ వేటను ముగించారు. తొలి రోజు ఆదివారం రెండు స్వర్ణాలతో బోణీ కొట్టిన భారత్... చివరి రోజు ఏకంగా ఐదు పసిడి పతకాలను సాధించింది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో స్టార్ క్రీడాకారిణి హీనా సిద్ధూ (197.8 పాయింట్లు) స్వర్ణం, మరో షూటర్ శ్వేతా సింగ్ రజతం (197 పాయింట్లు) గెలిచారు. హీనా సిద్ధూ, శ్వేతా సింగ్, యశస్విని సింగ్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1157 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో హర్షదా నితవే (174.8 పాయింట్లు) కాంస్యం సాధించగా... మలైకా గోయల్, హర్షదా, నయని భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టు 1116 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. శ్రీనివేత (200.7 పాయింట్లు), గౌరి, శ్రేయా వరుసగా భారత్‌కు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించారు. ఈ ముగ్గురితో కూడిన భారత జట్టుకే టీమ్ ఈవెంట్లో పసిడి పతకం లభించింది. -
దూసుకెళ్తున్న భారత షూటర్లు
ఇంచియాన్: 17వ ఆసియా క్రీడల్లో భారత షూటర్లు బుల్లెట్ మీద బుల్లెట్ దించుతున్నారు. గురి తప్పకుండా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా మరో కాంస్య పతకం సాధించి ఈ విభాగంలో గెల్చుకున్న మెడల్స్ సంఖ్య నాలుగు పెంచారు. మహిళల 25 మీటర్ల టీమ్ ఈవెంట్ లో భాతర షూటర్లు హీనా సిద్ధూ, అనీషా సయ్యద్, రహీ సర్నోబాట్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు. ఇండియాకు నాలుగో రోజు రెండు పతకాలు దక్కాయి. స్వ్కాష్ లో దిపికా పల్లికల్ కాంస్యం గెల్చుకుంది. మొత్తం ఆరు పతకాలతో పాయింట్ల పట్టికలో భారత్ 13వ స్థానంలో నిలిచింది. స్వ్కాష్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లి సౌరవ్ గోషల్ మరో పతకం ఖాయం చేశాడు. ఫైనల్లో ఓడిపోయినా అతడికి సిల్వర్ మెడల్ ఖాయం. -
నెంబర్ వన్ షూటర్!
మామయ్య తుపాకుల దుకాణంలో చిన్నారి హీనా సిద్ధు ఆటలు ఆడుకుంటూ ఉండేది. ఆ తుపాకులను ఎప్పుడూ చూస్తుండడం వల్ల అవి అంటే ఆసక్తి పెరిగింది. బొమ్మ తుపాకీని చేతుల్లోకి తీసుకొని ‘ఢిష్యూం’ ‘డిష్యూం’ అని గాల్లోకి ఉత్తుత్తి కాల్పులు జరిపేది. షూటింగ్ అనేది ‘ప్రొఫెషనల్ స్పోర్ట్’ అనే సంగతి హీనాకు తెలియని వయసు అది. ఆమె తండ్రి రక్బీర్సింగ్ నేషనల్ షూటర్. కుమార్తెను కూడా తన లాగే షూటర్‌ను చేయాలని సంకల్పించాడు. కథల మాదిరిగా షూటింగ్‌కు సంబంధించిన విషయాలను హీనా సిద్ధుకు ఆసక్తిగా చెబుతుండేవాడు. ‘‘ప్రపంచంలో ఏ మూల షూటింగ్ అనే పదం వినబడినా...నీ పేరు గుర్తుకు రావాలి. నువ్వు నెంబర్‌వన్ కావాలి!’’ అనేవాడు కుమార్తె కళ్లలోకి చూస్తూ. ప్రపంచ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నెంబర్‌వన్ షూటర్‌గా నిలిచి తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది హీన. ఐయస్యస్ఎఫ్ వరల్డ్ కప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవాలనేది ప్రతి షూటర్ కల. ఆ కలను గత సంవత్సరం నెరవేర్చుకుంది హీన. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐయస్యస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో బంగారు పతకాన్ని గెల్చుకుంది. ఐఎస్ఎస్ఎఫ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన ‘ఫస్ట్ ఇండియన్ షూటర్’ హీనా. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన హీనాకు పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. చక్కగా బొమ్మలు వేస్తుంది. పది సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు గీస్తోంది హీనా. బొమ్మలు గీయడం ద్వారా తాను సేద తీరుతానని చెబుతోంది. ‘‘గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే... నాలోని శక్తిని సరిగ్గా వినియోగించుకోలేదు అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఆటకు వెళ్లే ముందు గతంలో చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకుంటాను. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. మరింత ఎక్కువగా కష్టపడతాను’’ అంటున్న హీనా సిద్ధును- ‘‘మీలో ఉన్న శక్తి ఏమిటనుకుంటున్నారు?’’ అని అడిగితే- ‘‘సాధించాలనే తపన’’ అంటు తన విజయరహస్యాన్ని చెప్పకనే చెబుతుంది. హీనాకు పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. చక్కగా బొమ్మలు వేస్తుంది. పది సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు గీస్తోంది హీనా. బొమ్మలు గీయడం ద్వారా తాను సేద తీరుతానని చెబుతోంది. -
నంబర్‌వన్ హీనా
ప్రపంచ షూటింగ్ ర్యాంకింగ్స్ న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా షూటర్ హీనా సిద్ధూ టాప్ ర్యాంకుకు ఎగబాకింది. ఇటీవల విశేషంగా రాణిస్తున్న ఆమె... ఐఎస్ఎస్ఎఫ్ విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. గత నవంబర్‌లో మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆమె వరల్డ్ రికార్డ్ స్కోరుతో స్వర్ణ పతకం నెగ్గింది. గత నెల కువైట్‌లో జరిగిన ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం, అమెరికాలో జరిగిన ప్రపంచకప్‌లో రజతం గెలిచింది. దీంతో అచిర కాలంలోనే నంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘టాప్ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. కొన్నాళ్లుగా స్థిరంగా చెమటోడ్చడం వల్లే ఈ స్థానానికి ఎగబాకాను. నా భర్త రోనక్ పండిత్ ప్రోత్సాహం, కోచ్ అనతోలి శిక్షణ వల్లే రాణించగలుగుతున్నాను. ప్రభుత్వ సాయం కూడా మరవలేను. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఇప్పించింది. ఇదే ఉత్సాహంతో ఒలింపిక్ మెడల్ లక్ష్యంగా కఠోరంగా శ్రమిస్తాను’ అని తెలిపింది. -
హీనా సిద్ధూకు స్వర్ణం
కువైట్ సిటీ: వరుసగా రెండో రోజు ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల గురి అదిరింది. సోమవారం జరిగిన రెండు ఈవెంట్స్‌లో భారత్‌కు మొత్తం నాలుగు పతకాలు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం ఉన్నాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్లో 400 పాయింట్లకు 386 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానం పొందిన హీనా... ఫైనల్లో 200.3 పాయింట్లతో విజేతగా నిలిచింది. వూ చియా యింగ్ (చైనీస్ తైపీ-198.3 పాయింట్లు) రజతం... అల్ బాలూషీ వధా (ఒమన్-177.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. హీనా సిద్ధూ, శ్వేతా చౌదరీ, హర్వీన్‌లతో కూడిన భారత బృందం 1138 పాయింట్లతో టీమ్ విభాగంలో రజతం నెగ్గింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో చెయిన్ సింగ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో 619.6 పాయింట్లు స్కోరు చేసిన చెయిన్ సింగ్... ఫైనల్లో 206 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, రవి కుమార్, రఘునాథ్‌లతో కూడిన భారత జట్టుకు కాంస్యం లభించింది. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఇప్పటివరకు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు చేరాయి. -
గోల్డ్ మెడల్లో భారత షూటర్ హీనా రికార్డ్
-
హీనా సంచలనం
ముంబై: భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ ఫైనల్స్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ పిస్టల్ షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఈ సీజన్ ముగింపు టోర్నమెంట్లో హీనా సిద్ధూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. గతంలో భారత్ నుంచి అంజలి భగవత్ (2002లో), గగన్ నారంగ్ (2008లో) రైఫిల్ ఈవెంట్లో ఈ ఘనత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10 షూటర్లు మాత్రమే పాల్గొనే ఈ టోర్నీలో హీనా విశేషంగా రాణించింది. స్వర్ణ పతకాన్ని నెగ్గే క్రమంలో ఈ పంజాబ్ అమ్మాయి ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్జున్ (చైనా)... ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా)... రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఒలెనా కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది. క్వాలిఫయింగ్‌లో 384 పాయింట్లు స్కోరు చేసిన హీనా... ఫైనల్లో 203.8 పాయింట్లు సాధించింది. జొరానా (సెర్బియా) 198.6 పాయింట్లతో రజతం... విక్టోరియా (బెలారస్) 176.8 పాయింట్లతో కాంస్యం గెలిచారు. ఈ ఏడాది ఆరంభంలో షూటర్ రోనక్ పండిత్ (మహారాష్ట్ర)ను వివాహం చేసుకున్న 24 ఏళ్ల హీనా తన శిక్షణ కేంద్రాన్ని పాటియాలా నుంచి ముంబైకు మార్చుకుంది. భర్త పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్న హీనా మ్యూనిచ్‌లో అందరి అంచనాలను తారుమారు చేసి విజేతగా నిలిచింది. అంతర్జాతీయస్థాయిలో హీనాకిదే తొలి పతకం కావడం విశేషం. గత మే నెలలో ఆమె కొరియా, జర్మనీలలో జరిగిన రెండు ప్రపంచ కప్ టోర్నమెంట్లలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. వాస్తవానికి హీనా ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించలేదు. అయితే ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందిన ముగ్గురు విదేశీ క్రీడాకారిణులు వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు. దాంతో ఫైనల్స్‌లో పాల్గొనాలని హీనాకు నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చింది. దాంతో ఆమె పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకుండానే ఈ టోర్నీలో బరిలోకి దిగి అనూహ్యంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘పతకం నెగ్గడం నాకే ఆశ్చర్యమనిపిస్తోంది. అసలు ఈ టోర్నీలో పాల్గొంటానని అనుకోలేదు. అర్హత సాధించిన ముగ్గురు షూటర్లు చివరి నిమిషంలో వైదొలగడంతో నాకు అవకాశం లభించింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో వీసా ఏర్పాట్లు పూర్తిచేసుకొని విమానం టిక్కెట్లు సంపాదించి మ్యూనిచ్కు వచ్చాను. చాలా కాలం నుంచి అంతర్జాతీయస్థాయిలో పతకం లేకుండానే శిక్షణ కొనసాగిస్తున్నాను. ఈ రోజు నాకు అంతా కలిసొచ్చింది.’ - హీనా సిద్ధూ