
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత స్టార్ షూటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఒత్తిడికి లోనై గురి తప్పారు. ఫలితంగా అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో నాలుగో రోజు భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్, అనురాధ, హీనా సిద్ధూ, వరుసగా 14వ, 22వ, 25వ స్థానాల్లో నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో గాయత్రి 36వ స్థానంలో, సునిధి చౌహాన్ 49వ స్థానంలో నిలిచారు.
పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో ఆదర్శ్ సింగ్, అర్పిత్ గోయల్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరగ్గా... 16 ఏళ్ల అనీశ్ భన్వాలా ఫైనల్‌కు చేరినా పతకం నెగ్గలేదు. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అనీశ్ భన్వాలా 14 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఒలింపిక్ చాంప్ క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ–35 పాయిం ట్లు) స్వర్ణం... ప్రపంచ చాంపియన్ జున్‌మిన్ లిన్ (చైనా–31 పాయింట్లు) రజతం... కిమ్ జున్‌హోంగ్ (కొరియా–22 పాయింట్లు) కాంస్యం నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment