మాజీ నంబర్ వన్ కూడా విఫలం! | Heena Sidhu fails to reach 10 meter air rifle shooting | Sakshi
Sakshi News home page

మాజీ నంబర్ వన్ కూడా విఫలం!

Published Sun, Aug 7 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

మాజీ నంబర్ వన్ కూడా విఫలం!

మాజీ నంబర్ వన్ కూడా విఫలం!

రియోడిజనీరో: భారత టాప్ షూటర్‌ హీనా సిద్ధూ విఫలమైంది. హీనాపై భారత్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. రియో ఒలింపిక్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. క్వాలిఫైయింగ్ పోటీల్లో ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ అయిన హీనా 380 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి 14వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది.

రియో ఒలింపిక్స్‌ కు అర్హత పోటీల్లో బంగారు పతకం నెగ్గిన హీనా దాంతో పాటు ఒలింపిక్‌ బెర్త్‌ సొంతం చేసుకుంది. ఎన్నో ఆశలు రేకెత్తించినా చివరికి అత్యున్నత క్రీడల్లో హీనా ఒత్తిడికి లోనై  ఫైనల్ చేరడంలో విఫలమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement