న్యూఢిల్లీ: తాజాగా గోల్డ్‌కోస్ట్‌లో ముగిసిన కామన్వెల్త్ క్రీడల షూటింగ్‌లో స్వర్ణం, రజతం గెలిచిన హీనా సిద్ధూ... ఈ నెల 22 నుంచి 29 వరకు మ్యునిక్‌లో జరగనున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌పైనా ఆశావహంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, తాను మరింత నిలకడ సాధించాల్సి ఉందని పేర్కొంది.
28 ఏళ్ల హీనా గోల్డ్‌కోస్ట్‌లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో కామన్వెల్త్ క్రీడల రికార్డు నెలకొల్పుతూ స్వర్ణం నెగ్గింది. నేటి నుంచి 21 వరకు సన్నాహకం కొనసాగిస్తానని చెప్పిన ఆమె... మారిన షూటింగ్ షెడ్యూల్ దృష్ట్యా తన దృష్టంతా నిలకడ కొనసాగించడంపైనే అని వివరించింది. ఆగస్టు, సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో టాప్‌లో నిలవడం ధ్యేయమని పేర్కొంది.
నిలకడపై దృష్టిపెడతా: హీనా
Published Tue, May 8 2018 1:06 AM | Last Updated on Tue, May 8 2018 1:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment