రజతం నెగ్గిన హీనా
న్యూఢిల్లీ: హ నోవర్ అంతర్జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు హీనా సిద్ధూ, అభినవ్ బింద్రా రజత, కాంస్య పతకాలతో రాణించారు. జర్మనీలో జరిగిన ఈ టోర్నీలో హీనా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 199.1 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. జర్మనీకి చెందిన సాండ్రా హార్నంగ్ 199.4 పాయింట్లతో స్వర్ణాన్ని నెగ్గింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అతను 184.5 పాయింట్లు స్కోరు చేశాడు. జాన్ లాచ్‌బిలర్ (స్విట్జర్లాండ్-206.2 పాయింట్లు), నికోలస్ స్కాలెన్‌బెర్గర్ (జర్మనీ- 204.5) స్వర్ణ, రజత పతకాలు సాధించారు.