Bindra
-
ఒలింపిక్స్ టాస్క్‌ఫోర్స్‌లో బింద్రా, గోపీచంద్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ పతక విజేతల కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌లో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలింపిక్ చాంపియన్ అభినవ్ బింద్రాలకు చోటుదక్కింది. తదుపరి మూడు ఒలింపిక్స్ (2020, 2024, 2028)ల కోసం కేంద్ర క్రీడాశాఖ చేపట్టిన యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. రియోలో కేవలం రెండే పతకాలతో సరిపెట్టుకోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఆయన సూచనలకు అనుగుణంగా ఏర్పాటైన ‘టాస్క్‌ఫోర్స్’లో భారత హాకీ మాజీ సారథి వీరెన్ రస్కిన్హా, హాకీ కోచ్ బల్దేవ్ సింగ్, ప్రొఫెసర్ జి.ఎల్.ఖన్నా, జర్నలిస్ట్ రాజేశ్ కల్రా, గుజరాత్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు హెడ్ ఓం పాథక్ ఉన్నారు. దీనిపై క్రీడల మంత్రి విజయ్ గోయెల్ మాట్లాడుతూ ‘ఈ కమిటీ మూడు నెలలు, లేదంటే తుది నివేదిక సమర్పించేవరకు పనిచేస్తుంది. ఒలింపిక్స్‌లో సత్తాచాటేందుకు ఆటగాళ్లకు అవసరమైన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక శిక్షణలపై ఈ కమిటీ ప్రధానంగా సూచనలివ్వాల్సి వుంటుంది’ అని ఆయన చెప్పారు. -
జాతీయ క్రీడా అభివృద్ధి కమిటీలో అభినవ్ బింద్రా
దేశంలోని అన్ని క్రీడా విభాగాల్లో జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్‌ను అమలు పరిచేలా తగిన ప్రతిపాదనలను సూచించేందుకు క్రీడా శాఖ ఓ కమిటీని నియమించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా, మాజీ అథ్లెట్ అంజూ బాబీ జార్జి, దిగ్గజ షట్లర్ ప్రకాశ్ పదుకొనేలకు చోటు కల్పించారు. క్రీడా శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా ఎఫ్ఐహెచ్ చీఫ్ నరీందర్ బాత్రా, జిమ్నాస్టిక్స్ కోచ్ విశ్వేశ్వర్, లాయర్ నందన్ కామత్, క్రీడా జర్నలిస్ట్ విజయ్ లోక్‌పల్లి ఇతర సభ్యులు. -
రజతం నెగ్గిన హీనా
న్యూఢిల్లీ: హ నోవర్ అంతర్జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు హీనా సిద్ధూ, అభినవ్ బింద్రా రజత, కాంస్య పతకాలతో రాణించారు. జర్మనీలో జరిగిన ఈ టోర్నీలో హీనా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 199.1 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. జర్మనీకి చెందిన సాండ్రా హార్నంగ్ 199.4 పాయింట్లతో స్వర్ణాన్ని నెగ్గింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అతను 184.5 పాయింట్లు స్కోరు చేశాడు. జాన్ లాచ్బిలర్ (స్విట్జర్లాండ్-206.2 పాయింట్లు), నికోలస్ స్కాలెన్బెర్గర్ (జర్మనీ- 204.5) స్వర్ణ, రజత పతకాలు సాధించారు. -
బింద్రాపై క్రమశిక్షణ చర్య!
ముంబై: తమకు ఇబ్బందికరంగా మారుతున్న మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రాపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు దిగనుంది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడికి మద్దతిస్తుండడమే కాకుండా వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో స్పాట్ ఫిక్సింగ్పై సరైన రీతిలో వ్యవహరించలేదని బింద్రా విమర్శించారు. ‘ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ ఎప్పటిలాగే మిన్నకుండిపోయింది. రూ.10 వేల కోట్ల కుంభకోణంలో మోడిని ఇరికించేందుకు సమాయత్తమవుతుంది’ అని గురువారం తన ట్విట్టర్ పేజిలో బింద్రా పేర్కొన్నారు. దీంతో పాటు పలు బీసీసీఐ సమావేశాల మినిట్స్‌ను కూడా జత పరిచారు. దీంతో బోర్డు ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. బీసీసీఐ పరువుకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నందుకు ముందుగా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని భావిస్తున్నారు. గత జూన్‌లో గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై విచారణ ముగిసేదాకా శ్రీనివాసన్‌ను సమావేశాలకు హాజరు కానీయవద్దని ఐసీసీ బోర్డు సభ్యులకు బహిరంగ లేఖ రాశారు. అలాగే ద క్షిణాఫ్రికా క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా లోర్గాట్ నియామకాన్ని సమర్థించారు.