జాతీయ క్రీడా అభివృద్ధి కమిటీలో అభినవ్ బింద్రా
దేశంలోని అన్ని క్రీడా విభాగాల్లో జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్‌ను అమలు పరిచేలా తగిన ప్రతిపాదనలను సూచించేందుకు క్రీడా శాఖ ఓ కమిటీని నియమించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా, మాజీ అథ్లెట్ అంజూ బాబీ జార్జి, దిగ్గజ షట్లర్ ప్రకాశ్ పదుకొనేలకు చోటు కల్పించారు.
క్రీడా శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా ఎఫ్‌ఐహెచ్ చీఫ్ నరీందర్ బాత్రా, జిమ్నాస్టిక్స్ కోచ్ విశ్వేశ్వర్, లాయర్ నందన్ కామత్, క్రీడా జర్నలిస్ట్ విజయ్ లోక్‌పల్లి ఇతర సభ్యులు.