
పాలెంబాంగ్: ఆసియా క్రీడల షూటింగ్ పోటీల్లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో హీనా సిద్ధూ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. ఫైనల్లో హీనా 219.2 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది.
భారత్‌కే చెందిన మనూ భాకర్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. కియాన్ వాంగ్ (చైనా–240.3 పాయింట్లు) స్వర్ణం, కిమ్ మిన్‌జుంగ్ (కొరియా–237.6 పాయింట్లు) రజతం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment