హీనాకు రియో బెర్త్ | Heena Sidhu shoots Gold at Asia Olympic Shooting Qualifiers, wins Olympic quota | Sakshi
Sakshi News home page

హీనాకు రియో బెర్త్

Published Thu, Jan 28 2016 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

హీనాకు రియో బెర్త్

హీనాకు రియో బెర్త్

ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో స్వర్ణం
న్యూఢిల్లీ: భారత టాప్ షూటర్ హీనా సిద్ధూ.. రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో హీనా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం గెలుచుకుంది. 8 మంది బరిలోకి దిగిన ఫైనల్స్‌లో భారత షూటర్ 199.4 పాయింట్లు సాధించింది. చైనీస్ తైపీకి చెందిన టియాన్ చియా చెన్ (198.1), గిమ్ యున్ మి (177.9) రజతం, కాంస్యం దక్కించుకున్నారు. భారత్ తరఫున షూటింగ్‌లో ఇది 9వ ఒలింపిక్ బెర్త్.

మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో స్వప్నిల్ కౌశల్ 617.2 పాయింట్లతో 14వ; సుశీల్ ఘాలె 17వ, సురేంద్ర సింగ్ రాథోడ్ 24వ స్థానంతో సంతృప్తిపడ్డారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్ కుమార్ 285 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. నీరజ్ కుమార్, హర్‌ప్రీత్ సింగ్‌లకు 13, 16 స్థానాలు దక్కాయి. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో ఒక్కరు కూడా క్వాలిఫయింగ్ అడ్డంకిని దాటలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement