qualifiers
-
2026 FIFA World Cup: భారత ఫుట్‌బాల్ జట్టు సత్తాకు పరీక్ష
దోహా: స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత... భారత ఫుట్‌బాల్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో నేడు ఆడనుంది. ఓవరాల్‌గా ఖతర్‌తో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆడిన భారత్ ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇప్పటికే ఆసియా జోన్ మూడో రౌండ్‌కు అర్హత పొందిన ఖతర్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్‌లా ఉపయోగ పడనుండగా... భారత జట్టుకు మాత్రం తాడోపేడోలాంటింది. గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడనున్న భారత జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’గా ముగిస్తే మాత్రం అఫ్గానిస్తాన్, కువైట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. భారత్ తమ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియాలి. అలా జరిగితేనే భారత్ మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్‌లో ఫలితం వస్తే గెలిచిన జట్టు మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. భారత్‌తోపాటు ఓడిన మరో జట్టు రెండో రౌండ్‌కే పరిమితమవుతుంది. 2026 ప్రపంచకప్‌లో తొలిసారి 48 జట్లు పోటీపడనుండగా... ఆసియా నుంచి 8 జట్లకు నేరుగా అవకాశం లభిస్తుంది. మరో బెర్త్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఖరారవుతుంది. -
నిశాంత్ దేవ్‌కు పారిస్ ‘టికెట్’
బ్యాంకాక్: భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ విమానం ఎక్కనున్నాడు. ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు అతను అర్హత సంపాదించాడు. మెగా ఈవెంట్‌కు ఆఖరి అర్హత టోర్నీ అయిన ‘వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్’లో నిశాంత్ పురుషుల 71 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరడం ద్వారా బెర్త్ దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతను 5–0తో వాసిల్ సె»ొటరి (మాల్దొవా)పై ఏకపక్ష విజయం సాధించాడు. మహిళల 60 కేజీల క్వార్టర్స్‌లో అంకుశిత 2–3తో అగ్నెస్ (స్వీడన్) చేతిలో ఓడి... అరుంధతి 1–4తో జెస్సికా (స్లొవేకియా) చేతిలో ఓడి ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ 5–0తో కిమ్ ఇంక్యూ (కొరియా)పై గెలిచి ‘పారిస్’కు అడుగు దూరంలో ఉన్నాడు. 57 కేజీల క్వార్టర్స్‌లో సచిన్ సివాచ్ 4–1 తో శామ్యూల్ కిస్తోహరీ (ఫ్రాన్స్)పై గెలిచి సెమీస్ చేరాడు. ఈ వెయిట్ కేటగిరీలో మూడు బెర్త్‌లు మాత్రమే ఉండటంతో సచిన్ ఫైనల్ చేరాలి లేదంటే ‘బాక్స్ ఆఫ్’ బౌట్లో గెలిస్తే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. పురుషుల 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సంజీత్ 0–5తో అల్ఫోన్సో (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయాడు. -
టీ20 వరల్డ్‌కప్ 2024కు కొత్తగా అర్హత సాధించిన మూడు జట్లు ఇవే..!
వచ్చే ఏడాది వెస్టిండీస్, యూఎస్ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు కొత్తగా మూడు జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఈస్ట్ ఏసియా పసిఫిక్ రీజియన్స్ క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ జట్లు తాజాగా ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే మెగా టోర్నీలో పై పేర్కొన్న మూడు దేశాలు 13, 14, 15వ జట్లుగా బరిలోకి దిగుతాయి. టీ20 వరల్డ్‌కప్ 2024 నిబంధనల ప్రకారం.. తొమ్మిదో ఎడిషన్ ప్రపంచకప్ కోసం ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్).. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. తాజాగా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ 13, 14, 15 స్థానాలకు క్వాలిఫై కాగా.. మరో 5 స్థానాల కోసం వివిధ రీజియన్లలో పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఆసియా క్వాలిఫయర్-బి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మలేసియా, థాయ్‌లాండ్, భూటాన్, చైనా, మయన్మార్ వరుస స్థానాల్లో ఉన్నాయి. -
French Open Qualifiers 2022: రామ్‌కుమార్ పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పారిస్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ రామనాథన్ 6–7 (6/8), 4–6తో సీన్ క్యూనిన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 17 అనవసర తప్పిదాలు చేసిన ఈ చెన్నై ప్లేయర్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. -
French Open 2022 Qualifiers: రామ్‌కుమార్ సంచలన విజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ రామనాథన్ 6–3, 6–2తో తొమ్మిదో సీడ్ యానిక్ హాంఫ్మన్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకోగా... యూకీ బాంబ్రీ (భారత్) 3–6, 5–7తో అల్తుగ్ సెలిక్బిలెక్ (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. యానిక్తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఆరు ఏస్‌లు సంధించాడు. -
ఐపీఎల్ 2022కు సంబంధించి కీలక అప్డేట్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తరువాత జరిగే క్వాలిఫయర్, ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికలకు (ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, వాంఖడే, బ్రబోర్న్ స్టేడియం, పూణేలోని ఎంసీఏ స్టేడియం) మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. దేశంలో కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికలను విస్తరించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇందులో భాగంగా తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ రెండో క్వాలిఫయర్ సహా ఐపీఎల్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కీలక మ్యాచ్‌లను ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, తొలుత తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వచ్చే నెల (మే) 22 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు కొనసాగుతాయి. ఆ తరువాత క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 29న ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2022: కెప్టెన్‌గా తొలి గెలుపు.. ఆమెకే అంకితం: జడేజా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC 2022: రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్లు.. అయినా అర్హత సాధించలేకపోయారు
West Indies And Sri Lanka Did Not Qualify For T20 World Cup 2022 Super 12: పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన వెస్టిండీస్.. ఓసారి జగజ్జేతగా, మరో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్లు వచ్చే ఏడాది ఆసీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశకు అర్హత సాధించలేకపోయాయి. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన శ్రీలంక, విండీస్ జట్లు సూపర్-12కు అర్హత కోల్పోయాయి. నవంబర్ 15 లోపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించనున్నాయి. ప్రస్తుతం విండీస్, శ్రీలంక జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 9, 10 స్థానాల్లో ఉన్నాయి. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు సూపర్-12లో ప్రవేశించాలంటే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ ఏడాది సూపర్-12 ఆడిన 12 జట్లలో 8 జట్లు(ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అప్గానిస్థాన్, బంగ్లాదేశ్) నేరుగా 2022 టీ20 ప్రపంచకప్ సూపర్-12కు అర్హత సాధించాయి. ప్రస్తుత ప్రపంచకప్ సూపర్-12లో బంగ్లాదేశ్ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడినప్పటికీ సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను మట్టికరిపించడంతో 8వ ర్యాంక్‌కు చేరుకుంది. ఫలితంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ సూపర్-12కు నేరుగా అర్హత సాధించింది. చదవండి: ఐపీఎలే ముఖ్యమనుకున్న వాళ్లు దేశం కోసం ఏం ఆడతారు..! -
‘పది హ్యాట్రిక్కుల’ మొనగాడు.. అదిరిపోయే డీల్
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం. కనివిని ఎరుగని రీతిలో పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి సంచలనానికి తెర తీశాడు ఈ ఫుట్‌బాల్ మొనగాడు. యూరోపియన్ క్వాలిఫైయర్స్(UEFA Champions League) టోర్నీలో భాగంగా.. మంగళవారం పోర్చుగల్ తరపున రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో లగ్జెంబర్గ్ 5-0 తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్తోనూ వార్తల్లోకెక్కాడు మరి. సింగపూర్ వ్యాపారదిగ్గజం, వాలెన్షియా(స్పెయిన్) ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్ పీటర్ లీమ్కి రొనాల్డోకి చాలాకాలంగా దోస్తీ ఉంది. గతంలో లిమ్‌కు చెందిన మింట్ మీడియా ద్వారా రొనాల్డో చిత్రాల వ్యాపారం కూడా జోరుగా సాగించింది. ఈ తరుణంలో జూజూజీపీ అనే అనే ప్లాట్‌ఫామ్ కోసం వీళ్లిద్దరూ మళ్లీ చేతులు కలిపారు. ఫుట్‌బాల్, టెక్నాలజీ, కమ్యూనికేషన్.. ఈ మూడింటి ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్ పని చేస్తుండడం విశేషం. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ (తన ఏడాది సంపాదనలో 30 శాతం విలువ చేసే రెమ్యునరేషన్!) తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇకపై ఫుట్బాల్ని జనాలు చూసే విధానం మారుతుంది’ అంటూ ఓ స్టేట్మెంట్ను జాయింట్‌గా రిలీజ్ చేశారు రొనాల్డో-లీమ్. పోర్చ్‌గల్ కెప్టెన్ అయిన 36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో.. ఈమధ్య కాలంలో వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. కెరీర్ మొత్తంగా యాభై ఎనిమిదిసార్లు హ్యాట్రిక్ గోల్స్, పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ ఫీట్ సాధించాడు. అంతేకాదు ఫిఫా లెక్కల ప్రకారం.. 182 మ్యాచ్‌ల్లో 115 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు సంపాదనలోనూ సమవుజ్జీగా భావించే అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీని దాటేసి.. 2021-22 సీజన్‌కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫుట్‌బాలర్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. ఏడాదికి రొనాల్డో 922 కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు ఫోర్బ్స్ గణాంకాలు చెప్తున్నాయి. Unlucky 😢 What a bicycle kick 😭#CristianoRonaldo #CR7 #bicyclekick pic.twitter.com/18EVZ34BWo — Habibulla Sonet (@HabibullaSonet) October 12, 2021 చదవండి: ఐస్‌బాత్‌లో రొనాల్డొ చిందులు.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! -
అప్పుడు అబద్ధం.. ఇప్పుడు ఓటమి.. కన్నీళ్లతో గుడ్‌బై!
తప్పులు.. చేసిన పాపాలు దాగవు. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలూ సాగవు. ఏదో ఒక నాటికి శిక్ష అనుభవించాల్సిందే. అమెరికన్ స్విమ్మర్ ర్యాన్ లోక్టి విషయంలో ఇదే జరిగింది. ఒలింపిక్స్‌లో పన్నెండు మెడల్స్.. 27 ప్రపంచ ఛాంపియన్‌షిష్ టోర్నీలో గెలిచిన ఘనత ఈయనది. కానీ, వరుస విజయాల ట్రాక్ నుంచి పక్కకు తప్పి.. అబద్ధం, తప్పులు, అవమానాల మీదుగా సాగి చివరికి ఓటమితో ఈ దిగ్గజం కెరీర్ ముగింపు దశకు చేరింది. ర్యాన్ స్టీవెన్ లోక్టి.. అమెరికన్ స్విమ్మర్. ఒకప్పుడు ఛాంపియన్, స్విమ్మింగ్ హీరో. కానీ, తనను తానే పాతాళానికి తొక్కేసుకున్నాడు. తాజాగా టోక్యో ఒలంపిక్స్ కోసం జరిగిన 200 మీటర్ల క్వాలిఫైయింగ్ పోటీల్లో ఏడో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా ఒలంపిక్స్ అర్హతను కోల్పోయాడాయన(తొలి ఇద్దరికి మాత్రమే అవకాశం). ఈ ఓటమి తర్వాత లోక్టి మీడియా ముందుకొచ్చాడు. ఐదు నిమిషాలపాటు ఏకబిగిన కన్నీళ్లు పెట్టుకుని.. మౌనంగా కుటుంబ సభ్యులతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న మరో దిగ్గజం మైకేల్ ఫెల్ప్స్.. లోక్టిని అడ్డుకుని హత్తుకుని సాగనంపాడు. ఇక లోక్టి ఒలింపిక్స్ కెరీర్ ఇక ముగిసినట్లేనని యూఎస్ స్విమ్మింగ్ అసోషియేషన్ ప్రకటించింది. అయితే ఆయన ఇక మీదట ఏ పోటీల్లోనూ కనిపించకపోవచ్చని అతని గర్ల్‌ఫ్రెండ్ కయ్లా ప్రకటించింది. తప్పతాగి.. అబద్ధం 2004 ఒలింపిక్స్ ట్రయల్స్‌లో మైకేల్ ఫెల్ప్స్ తర్వాతి ప్లేస్‌లో నిలిచి.. ఏథెన్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో ర్యాన్ లోక్టి పేరు మారుమోగింది. అప్పటి నుంచే ఫెల్ప్స్తో లోక్టి మధ్య ప్రొఫెషనల్ శత్రుత్వం మొదలైంది. ఆ తర్వాత మెడల్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ విజయాలతో నడుమ లోక్టి కెరీర్ దిగ్విజయంగా సాగింది. ఈత కొట్టే టైంలో ‘యే’ అంటూ అతను అరిచే అరుపు అతనికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే 2016 రియో ఒలింపిక్స్ టైంలో జరిగిన ఘటన అతని ప్రతిష్టను దారుణంగా తొక్కొపడేసింది. తోటి ప్లేయర్లతో తప్పతాగి ఓ గ్యాస్ స్టేషన్‌కు వెళ్లిన లోక్టి.. అక్కడి సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, ఆ స్టేషన్ బయట మూత్రం పోసి, అక్కడి బాత్రూంని ధ్వంసం చేశాడు. ఆ తర్వాతి ఉదయం తుపాకులతో వచ్చిన దుండగులు కొందరు తమను బెదిరించి.. దోపిడీకి పాల్పడ్డారని అబద్ధం చెప్పాడు. దీంతో లోక్టి మీద అందరికీ సానుభూతి మొదలైంది. అయితే ఆటగాళ్ల భద్రత గురించి పలు దేశాలు ఒలింపిక్స్ నిర్వాహకులను ప్రశ్నించాయి. దీంతో కొన్నాళ్లపాటు నిర్వాహకులు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తీవ్ర ఎత్తున విమర్శలు రావడంతో అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టగా.. చివరికి లోచ్టె చెప్పిందంతా అబద్ధం అని తేలింది. వరుస నిషేధాలు రియో ఘటనలో సెక్యూరిటీ గార్డులకు డబ్బులిచ్చి ఈ వ్యవహారాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు లోక్టిపై వచ్చాయి. ఈ నేరం రుజువు కావడంతో అతని నుంచి పరువు నష్టం దావా కింద భారీ ఫైన్ రాబట్టింది ఒలింపిక్స్ కమిటీ. అంతేకాదు యూఎస్ స్విమ్మింగ్ అసోషియేషన్ 10 నెలల నిషేధం విధించింది. ఇక ఈ వివాదం చల్లారకముందే 2018లో మోతాదుకు మించి డ్రగ్స్ ఉపయోగించాడని ఆంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్ధారించగా.. ఆ కేసులో 14 నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. ఈ వివాదాలన్నింటి తర్వాత రిహాబ్ సెంటర్లో కొన్నాళ్లపాటు గడిపిన లోక్టి.. ఇంకొన్నాళ్లు కుటుంబంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తిరిగి కిందటి ఏడాది మళ్లీ స్విమ్మింగ్ ట్రాక్‌లోకి దిగినప్పటికీ.. మునుపటిలా ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యువ స్విమ్మర్ల మధ్య పోటీలో ఓడిపోయి.. ఆ అవమానాన్ని దిగమింగుకోలేక భావోద్వేగపు పశ్చాత్తాపంతో కెరీర్ నుంచి తప్పుకుంటున్నాడు ఒకప్పటి స్విమ్మింగ్ ఛాంపియన్. -
మళ్లీ సంచలనం
ఇన్నాళ్లూ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో భారత్ తరఫున సింగిల్స్ విభాగాల్లోనే గొప్ప ఫలితాలు కనిపించేవి. అయితే సింగిల్స్ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా డబుల్స్ విభాగంలో అద్భుత ఆటతీరుతో అదరగొడుతూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. గతవారం ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్‌గా నిలిచే క్రమంలో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్స్ జోడీని ఓడించిన ఈ భారత జంట తాజాగా 2018 ప్రపంచ చాంపియన్స్ జంటను మట్టికరిపించి మరో సంచలనం సృష్టించింది. ఫుజౌ (చైనా): భారత సింగిల్స్ అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయిన నిరాశను మరిపిస్తూ పురుషుల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో స్ఫూర్తిదాయక విజయం సాధించింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–15తో 2018 ప్రపంచ చాంపియన్స్, మూడో ర్యాంక్ జోడీ లీ జున్ హుయ్–లియు యు చెన్ (చైనా)పై సంచలన విజయం సాధించింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ సాధికారిక ఆటను ప్రదర్శించారు. రెండు గేముల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తొలి గేమ్‌లో 15–11తో నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న భారత జోడీకి ఆ తర్వాత గట్టిపోటీ ఎదురైంది. సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మద్దతుతో పుంజుకున్న చైనా జంట 18–18తో స్కోరును సమం చేసింది. అయితే సాత్విక్–చిరాగ్ ఈ కీలకదశలో వరుసగా రెండు పాయింట్లు గెలిచి 20–18తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మరో పాయింట్ కోల్పోయినా... వెంటనే మరో పాయింట్ గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నారు. ఇక రెండో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ జంటకు ఆరంభంలో ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 12–12 వద్ద భారత జంట వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 15–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత జంట విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ద్వయం కెవిన్ సంజయ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా)లతో సాత్విక్–చిరాగ్ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0–7తో వెనుకంజలో ఉంది. -
తొలి రౌండ్లోనే అంకిత ఔట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ అంకిత రైనా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో 26 ఏళ్ల అంకిత 4–6, 4–6తో అమెరికాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి, ప్రపంచ 320వ ర్యాంకర్ కోరి గౌఫ్ చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 172వ ర్యాంకర్ అంకిత ఏకంగా 36 అనవసర తప్పిదాలు చేసింది. -
రామ్‌కుమార్ ఓటమి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు నిరాశ ఎదురైంది. సోమవారం మొదలైన ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 171వ ర్యాంకర్ జేసన్ కుబ్లెర్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 144వ ర్యాంకర్ రామ్‌కుమార్ 4–6, 4–6తో ఓడిపోయాడు. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి కేవలం ఆరుసార్లు మాత్రమే పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి కుబ్లెర్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. భారత నంబర్‌వన్, ప్రపంచ 86వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడే అవకాశం లభించింది. ప్రధాన టోర్నమెంట్ ఈనెల 26న మొదలవుతుంది. -
యూకీ శుభారంభం
చెన్నై: టెన్నిస్ సీజన్ తొలి టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత యువతార యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్ విభాగంలో శుభారంభం చేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 7–5, 6–1తో మార్కో సెసిహినాతో (ఇటలీ)పై గెలుపొందాడు. రెండో రౌండ్లో నికొలస్ కికెర్ (అర్జెంటీనా)తో యూకీ తలపడతాడు. మరోవైపు భారత నంబర్‌వన్ సాకేత్ మైనేనికి క్లిష్టమైన ‘డ్రా’ పడింది. సోమవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో తొలి రౌండ్లో మిఖాయిల్ యూజ్నీ (రష్యా)తో సాకేత్ ఆడనున్నాడు. -
హీనాకు రియో బెర్త్
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో స్వర్ణం న్యూఢిల్లీ: భారత టాప్ షూటర్ హీనా సిద్ధూ.. రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో హీనా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం గెలుచుకుంది. 8 మంది బరిలోకి దిగిన ఫైనల్స్‌లో భారత షూటర్ 199.4 పాయింట్లు సాధించింది. చైనీస్ తైపీకి చెందిన టియాన్ చియా చెన్ (198.1), గిమ్ యున్ మి (177.9) రజతం, కాంస్యం దక్కించుకున్నారు. భారత్ తరఫున షూటింగ్లో ఇది 9వ ఒలింపిక్ బెర్త్. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో స్వప్నిల్ కౌశల్ 617.2 పాయింట్లతో 14వ; సుశీల్ ఘాలె 17వ, సురేంద్ర సింగ్ రాథోడ్ 24వ స్థానంతో సంతృప్తిపడ్డారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్ కుమార్ 285 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. నీరజ్ కుమార్, హర్‌ప్రీత్ సింగ్‌లకు 13, 16 స్థానాలు దక్కాయి. మహిళల ట్రాప్ ఈవెంట్లో ఒక్కరు కూడా క్వాలిఫయింగ్ అడ్డంకిని దాటలేకపోయారు. -
‘డబుల్’పై దిద్దుబాట
హైకోర్టు వ్యాఖ్యలతో దిగివచ్చిన ప్రభుత్వం రెండు పడకల ఇళ్లపై మరో ఉత్తర్వు జారీ జిల్లా కమిటీకి లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కమిటీలో సభ్యులుగా జిల్లా ఎమ్మెల్యేలు చైర్మన్‌గా జిల్లా మంత్రి.. కన్వీనర్‌గా కలెక్టర్ అర్హులను తేల్చేందుకు కలెక్టర్ గ్రామ సభలు అనంతరం డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని ప్రభుత్వం మార్చింది. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారులను 50:50 నిష్పత్తిలో ఎంపిక చేసేలా విధివిధానాలను ఖరారు చేస్తూ కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని హైకోర్టు తప్పుపట్టడంతో ప్రభుత్వం పాత విధానాలకు సవరణ చేస్తూ గురువారం ఉత్తర్వు జారీ చేసింది. జిల్లా స్థాయిలో కమిటీ వేస్తామని, దాని ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని అందులో స్పష్టం చేసింది. పార్టీలకతీతంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీనికి జిల్లా మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా యూనిట్‌గా ఈ కమిటీ వ్యవహరిస్తుంది. ఆయా యోజకవర్గాలు/ మున్సిపాలిటీల్లో అయితే వార్డులు, డివిజన్ల వారీగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యమిస్తూ వారికి ప్రత్యేక కోటాను కొనసాగిస్తారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యే ఎంపిక చేసిన జాబితాను మండలాల స్థాయిలో తహసీల్దార్లు పరిశీలించి అర్హతను తేలుస్తారంటూ పాత విధానంలో పొందుపరిచారు. ఇప్పుడు దాన్ని కూడా మార్చారు. ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిల్లో అర్హమైనవి తేల్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా గ్రామసభ/వార్డుసభలు నిర్వహిస్తారు. అనంతరం జాబితాను తహసీల్దార్లకు పంపితే వారు మరోసారి పరిశీలించి అర్హులా కాదా అని నిర్ధారిస్తారు. అనంతరం మరోసారి గ్రామసభ నిర్వహించి మంజూరైన ఇళ్ల సంఖ్యకు తగ్గట్టుగా లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈ జాబితాను జిల్లా స్థాయి కమిటీ ముందుంచి ఆమోదముద్ర వేయిస్తారు. వీటిపై ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తినా, ఫిర్యాదు చేసినా విచారించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఓ అధికారిని నియమిస్తారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ‘హౌజ్ ఫర్ ఆల్’ పథకం కింద కేంద్రప్రభుత్వం జారీ చేసిన విధివిధానాలను డబుల్ బెడ్రూం పథకంలో అనుసరించాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు స్పందనతో చకచకా... జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలే లబ్ధిదారులను ఎంపిక చేసేలా తొలుత రూపొందించిన మార్గదర్శకాలను హైకోర్టు తప్పుపట్టడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రజాప్రతినిధులు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించటమే కాకుండా అందుకు ప్రత్యేకంగా ఓ కమిటీ ఉంటే బాగుంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలుకు గడువు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం దానితో నిమిత్తం లేకుండా వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగడం గమనార్హం.