
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో 26 ఏళ్ల అంకిత 4–6, 4–6తో అమెరికాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి, ప్రపంచ 320వ ర్యాంకర్ కోరి గౌఫ్ చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 172వ ర్యాంకర్ అంకిత ఏకంగా 36 అనవసర తప్పిదాలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment