
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత రెండో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు నిరాశ ఎదురైంది. సోమవారం మొదలైన ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో రామ్‌కుమార్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 171వ ర్యాంకర్ జేసన్ కుబ్లెర్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 144వ ర్యాంకర్ రామ్‌కుమార్ 4–6, 4–6తో ఓడిపోయాడు. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి కేవలం ఆరుసార్లు మాత్రమే పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి కుబ్లెర్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. భారత నంబర్‌వన్, ప్రపంచ 86వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడే అవకాశం లభించింది. ప్రధాన టోర్నమెంట్ ఈనెల 26న మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment