Ramkumar Ramanathan
-
క్వార్టర్స్‌లో సాకేత్–రామ్ జోడీ
బెంగళూరు: వరుస సెట్లలో గెలిచిన భారత జోడీ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–రామ్ ద్వయం 6–3, 7–6 (7/4)తో జాకోపో బెరెటిని–ఎన్రికో డల్లా వాలె (ఇటలీ) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జోడీ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) 6–4, 6–4తో గంటా సాయికార్తీక్ రెడ్డి (భారత్)–సుల్తానోవ్ (ఉజ్బెకిస్తాన్)లపై, సిద్ధాంత్–పరీక్షిత్ సొమాని (భారత్) 6–4, 6–3తో నికీ కలియంద పునాచా (భారత్)–జాన్ లాక్ (జింబాబ్వే)లపై, ప్రజ్వల్ దేవ్–ఆర్యన్ షా (భారత్) 4–6, 6–3, 10–6తో ఎంజో కుకాడో (ఫ్రాన్స్)–మైకేల్ గీర్ట్స్ (బెల్జియం)లపై, ఆదిల్ కల్యాణ్‌పూర్–కరణ్ సింగ్ (భారత్) 1–6, 6–2, 10–4తో నితిన్ కుమార్ సిన్హా–మనీశ్ సురేశ్‌కుమార్ (భారత్)లపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
రామ్‌కుమార్ సంచలనం
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్(Ramkumar Ramanathan) మెయిన్ ‘డ్రా’కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ సంచలనం సృష్టించాడు. టాప్ సీడ్, ప్రపంచ 267వ ర్యాంకర్ ఇలియాస్ ఇమర్ (స్వీడన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 403వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 6–1, 6–4తో గెలుపొందాడు.ఒక గంట 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో కిమర్ కాప్‌జాన్స్ (బెల్జియం)తో రామ్‌కుమార్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గిన ప్లేయర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. చైనా జట్టుకు ఇండోనేసియా షాక్కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండోనేసియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–1తో నెగ్గింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో రివాల్డీ–ఫాదియా జంట 21–11, 21–13తో జువాన్–మెంగ్ యింగ్ జోడీని ఓడించడంతో ఇండోనేసియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఫర్హాన్ 21–15, 21–13తో హు జె ఆన్‌ను ఓడించడంతో ఇండోనేసియా ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో జు వెన్ జింగ్ 21–12, 21–13తో కుసుమ వర్ధినిపై గెలవడంతో చైనాకు తొలి విజయం దక్కింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో షోహిబుల్ ఫిక్రి–డానియల్ మారి్టన్ జోడీ 21–15, 21–9తో చెన్ జుజున్–హువాంగ్ ది (చైనా) ద్వయంపై గెలిచి ఇండోనేసియాకు టైటిల్‌ను ఖరారు చేసింది. -
సాకేత్–రామ్‌కుమార్ జోడీకి సియోల్ ఓపెన్ డబుల్స్ టైటిల్
ఎనిమిది నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణకొరియాలో ఆదివారం ముగిసిన సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–4, 4–6, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో వాసిల్ కిర్కోవ్ (అమెరికా)–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జోడీపై నెగ్గింది. సాకేత్–రామ్‌కుమార్ జంటకు 7,580 డాలర్ల (రూ. 6 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది సాకేత్–రామ్మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఇద్దరు బెంగళూరు ఓపెన్, చెన్నై ఓపెన్ టోర్నీల్లో విజేతలుగా నిలిచారు. ఓవరాల్‌గా సాకేత్ కెరీర్లో ఇది 19వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. ఏటీపీ చాలెంజర్ టోర్నీలు కాకుండా సాకేత్ మరో 19 ఐటీఎఫ్ టోర్నీ డబుల్స్ టైటిల్స్ కూడా గెలిచాడు. -
ఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 7–6 (9/7), 6–4తో జాషువ పారిస్ (ఇంగ్లండ్)–నామ్ జి సంగ్ (జపాన్) ద్వయంపై గెలిచింది. ఒక గంట 36 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను ‘టై బ్రేక్’లో దక్కించుకున్న సాకేత్–రామ్‌కుమార్ ద్వయం... రెండో సెట్లో అదే జోరు కొనసాగిస్తూ విజయం సాధించింది. సాకేత్–రామ్‌కుమార్ జంట 6 ఏస్‌లు సంధించి ఆధిక్యం ప్రదర్శించగా... ప్రత్యర్థి జోడీ రెండు ఏస్‌లకు పరిమితమై... రెండు డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఒక టై బ్రేక్ నెగ్గిన సాకెత్–రామ్‌కుమార్ ద్వయం... ఓవరాల్‌గా 77 పాయింట్లు సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో వాసిల్ కిర్కోవ్ (అమెరికా)–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జంటతో సాకేత్–రామ్‌కుమార్ జోడీ తపలడనుంది. -
సెమీఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 6–3, 6–1తో యోంగ్ సియోక్ జియోంగ్–యుసంగ్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో జిసుంగ్ నామ్ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్ (బ్రిటన్) జంటతో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం ఆడుతుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచా జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ అనిరు«ద్–నిక్కీ జంట 1–6, 3–6తో జిసుంగ్ నామ్ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్
భారత డేవిస్‌కప్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ అగ్రశ్రేణి ఆటతీరుతో టాప్‌సీడ్ ఆటగాడికి షాకిచ్చాడు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన రామ్‌కుమార్ అద్భుతమైన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత ప్లేయర్ 1–6, 6–4, 6–4తో టాప్ సీడ్ ల్యుకా నర్డి (ఇటలీ)ని ఓడించాడు. తొలి సెట్లో నర్డి ధాటికి రామ్‌కుమార్ తేలిపోయాడు. సెట్ ఆరంభంలోనే అతని సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఇటలీ స్టార్ ప్లేయర్ అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే తర్వాతి సెట్లలో భారత ఆటగాడు దూకుడు కనబరిచాడు. రెండో సెట్లో 3–2తో ఆధిక్యంలో ఉన్న దశలో కీలకమైన బ్రేక్ పాయింట్ సాధించిన రామ్‌కుమార్ అదే జోరుతో సెట్ గెలిచి 1–1తో సమం చేశాడు. మూడో సెట్లో రామ్ సంధించిన ఏస్‌లకు టాప్‌సీడ్ ఆటగాడు బదులివ్వలేకపోయాడు. ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన భారత ఆటగాడు ఈ సెట్లోనూ దూకుడు పెంచి మ్యాచ్ గెలిచాడు. నర్డి 4 ఏస్‌లు సంధిస్తే... రామ్‌కుమార్ 9 ఏస్‌లు సంధించాడు. -
టైటిల్ పోరుకు సాకేత్–రామ్ జోడీ
చెన్నై: కెరీర్లో 16వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించడానికి భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని విజయం దూరంలో నిలిచాడు. చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) జంటతో నేడు జరిగే ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం తలపడుతుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో సాకేత్–రామ్‌కుమార్ 6–3, 6–2తో రెండో సీడ్ తొషిహిడె మత్సుయ్–కైటో యుసుగి (జపాన్)లపై నెగ్గగా... రిత్విక్–నిక్కీ పునాచా 6–3, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జేకబ్ షానైటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ)లను ఓడించారు. 58 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సాకేత్–రామ్ జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
Tata Open: మెయిన్ ‘డ్రా’కు రామ్‌కుమార్
పుణే: భారత్‌లో జరిగే ఏకైక అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీ టాటా ఓపెన్‌లో భారత మూడో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 432వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–3, 7–5తో ప్రపంచ 153వ ర్యాంకర్ మతియా బెలూచి (ఇటలీ)పై సంచలన విజయం సాధించాడు. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఏకంగా 14 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఏడుసార్లు కాపాడుకున్న రామ్‌కుమార్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)తో రామ్‌కుమార్ తలపడతాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ మాత్రం మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో యూకీ 1–6, 4–6తో ఇలియాస్ ఈమర్ (స్వీడన్) చేతిలో ఓడిపోయాడు. నేటి నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ‘వైల్డ్ కార్డు’ పొందిన భారత టీనేజర్, 15 ఏళ్ల మానస్‌తో మైకేల్ మో (అమెరికా); సుమిత్ నగాల్ (భారత్)తో క్రయినోవిచ్ (సెర్బియా) తలపడతారు. 6,42,735 డాలర్ల (రూ. 53 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సింగిల్స్ విజేతకు 97,760 డాలర్లు (రూ. 80 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. -
Tata Open Maharashtra: రామ్‌కుమార్ శుభారంభం
టాటా ఓపెన్ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్‌లు మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడానికి విజయం దూరంలో నిలిచారు. పుణేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో యూకీ 6–2, 6–2తో డీగో హిడాల్గో (ఈక్వెడార్)పై గెలుపొందగా... రామ్‌కుమార్ 2–6, 7–5, 6–2తో ప్రపంచ 175వ ర్యాంకర్ ఒటో విర్టానెన్ (ఫిన్లాండ్)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. -
తొలి రౌండ్లోనే ఓడిన రామ్‌కుమార్, యూకీ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సోమవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో రామ్‌కుమార్ 5–7, 4–6తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్) చేతిలో... యూకీ బాంబ్రీ 5–7, 1–6తో జపాటా మిరాలెస్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 128 మంది పోటీపడుతుండగా... 16 మంది మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. ప్రధాన టోర్నీ ఈనెల 27న మొదలవుతుంది. చదవండి: ఫార్ములావన్ టెస్టుకు భారత రేసర్ జెహాన్ -
French Open Qualifiers 2022: రామ్‌కుమార్ పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పారిస్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ రామనాథన్ 6–7 (6/8), 4–6తో సీన్ క్యూనిన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 17 అనవసర తప్పిదాలు చేసిన ఈ చెన్నై ప్లేయర్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. -
French Open 2022 Qualifiers: రామ్‌కుమార్ సంచలన విజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ రామనాథన్ 6–3, 6–2తో తొమ్మిదో సీడ్ యానిక్ హాంఫ్మన్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకోగా... యూకీ బాంబ్రీ (భారత్) 3–6, 5–7తో అల్తుగ్ సెలిక్బిలెక్ (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. యానిక్తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఆరు ఏస్‌లు సంధించాడు. -
PV Sindhu: భారత్ క్రీడల్లో సూపర్ పవర్‌గా ఎదగగలదు..
PV Sindhu Comments At MCRHRD: భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డీజీ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ జ్ఞాపిక అందజేశారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో సివిల్ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆపై ముఖాముఖీ చర్చలో పాల్గొన్న సింధు...మన వద్ద అందుబాటులో ఉన్న ప్రతిభను చూస్తే భారత జట్టు క్రీడల్లో సూపర్ పవర్‌గా ఎదగగలదని, ఇందు కోసం తల్లిదండ్రులు, క్రీడా సంఘాలు సంయుక్తంగా చిన్నారులను ఆటల వైపు మళ్లించాలని సూచించారు. సెమీఫైనల్లో సాకేత్ జోడీ బెంగళూరు: రామ్‌కుమార్ రామనాథన్‌తో జతకట్టిన తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఈ జోడీ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికీ సింగిల్స్, డబుల్స్‌లో చుక్కెదురైంది. డబుల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సాకేత్–రామ్‌కుమార్ జంటకు ప్రత్యర్థి జోడీ స్టీవెన్ డీజ్ (కెనడా)–మలెక్ జజిరి (ట్యునిషియా) నుంచి వాకోవర్ లభించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత ద్వయం... జే క్లార్క్ (బ్రిటన్)–మార్క్ పోల్మన్స్ (ఆ్రస్టేలియా)తో తలపడుతుంది. మరో క్వార్టర్స్‌లో బ్రిటన్–ఆ్రస్టేలియన్ జోడీ 6–2, 6–1తో భారత టాప్‌సీడ్ జీవన్ నెడుంజెళియన్–పూరవ్ రాజా జంటపై గెలిచింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజ్నేశ్ గుణేశ్వర్ 6–3, 2–6, 1–6తో టాప్‌సీడ్ జిరి వెసెలే (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం చవిచూశాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఎర్లెర్ (ఆస్ట్రియా)–విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–3తో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జంటపై నెగ్గింది. నాలుగో సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 4–6, 7–6 (7/2), 4–10తో హ్యూగో గ్రెనియర్–ముల్లెర్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యింది. చదవండి: Under 19 Vice Captain Shaik Rasheed: సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా -
Prajnesh Gunneswaran: ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం
Bengaluru Open: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత రెండో ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 7–6 (7/4), 6–2తో మథియాస్ బుర్గె (ఫ్రాన్స్)పై గెలిచాడు. మరోవైపు భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ 6–3, 0–6, 5–7తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో అర్జున్ ఖడే 1–6, 2–6తో సెలిక్బిలెక్ (టర్కీ) చేతిలో, రిషి రెడ్డి 1–6, 3–6తో కుకాడ్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. చదవండి: Mohammed Siraj: 'క్రికెట్ వదిలేయ్.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో' -
సెమీ ఫైనల్లో రామ్‌కుమార్–బోపన్న
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. సింగిల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/4)తో అలెగ్జాండర్ ఎర్లెర్ (ఆస్ట్రియా)–జిరి వెసెలీ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా–చెక్ జోడీతో భారత జంటకు హోరాహోరీ పోరు ఎదురైంది. దీంతో రెండు సెట్లలోనూ టైబ్రేక్ తప్పలేదు. మరో భారత జోడీ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం కూడా సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో వీరి ప్రత్యర్థులు గియన్లుకా మగెర్ (ఇటలీ)–ఎమిల్ రుసువూరి (ఫిన్లాండ్) గాయంతో వైదొలగడంతో విష్ణు–శ్రీరామ్ జంట వాకోవర్‌తో సెమీస్ చేరింది. సెమీఫైనల్లో ఈ జోడీ... ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ సవిల్లే–జాన్ ప్యాట్రిక్ స్మిత్ జంటతో, బోపన్న–రామ్‌కుమార్ జంట ఫ్రాన్స్‌కు చెందిన సాడియో డౌంబియా–ఫాబిన్ రెబొల్ ద్వయంతో తలపడతాయి. సాకేత్ మైనేని–ముకుంద్ శశికుమార్ జంట 6–3, 5–7, 3–10తో ల్యూక్ సవిల్లే– జాన్ ప్యాట్రిక్ జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ 3–6, 2–6తో ఎనిమిదో సీడ్ స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రపంచ 93వ ర్యాంకర్ ధాటికి 29 ఏళ్ల యూకీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. వరుస సెట్లలోనే చేతులెత్తేశాడు. తొలి రౌండ్లో స్టెఫానో... భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. తాజా విజయంతో ఇటలీ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్లోనే ప్రజ్నేశ్ గుణేశ్వరన్, అర్జున్ ఖడేలు కూడా ఓడిపోవడంతో ఈ టోర్నీ సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఇతర మ్యాచ్‌ల్లో స్వీడెన్కు చెందిన ఎలీస్ యెమెర్ టాప్ సీడ్ అస్లన్ కరత్సెవ (రష్యా)కు షాకిచ్చాడు. 163వ ర్యాంకులో ఉన్న యెమెర్ 6–2, 7–6 (7/3)తో ప్రపంచ 15వ ర్యాంకర్ కరత్సెవను కంగుతినిపించి క్వార్టర్స్ చేరాడు. సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. దీంతో ఈ నెల 7 (సోమవారం) నుంచి జరిగే ఈ టోర్నీలో 34 ఏళ్ల తెలుగు ఆటగాడు నేరుగా మెయిన్ డ్రాలో పోటీపడతాడు. -
Rohan Bopanna-Ramkumar: టైటిల్‌కు విజయం దూరంలో...
అడిలైడ్: కొత్త ఏడాదిని టైటిల్‌తో శుభారంభం చేసేందుకు భారత టెన్నిస్ జోడీ రోహన్ బోపన్న–రామ్‌కుమార్ విజయం దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. బోపన్న కెరీర్లో ఇది 48వ ఏటీపీ టోర్నీ డబుల్స్ ఫైనల్‌కాగా... రామ్‌కుమార్ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ జంట 6–2, 6–4తో నాలుగో సీడ్ శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–తొమిస్లావ్ బిర్కిచ్ (బోస్నియా హెర్జెగోవినా) జోడీపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–మార్సెలో మెలో (బ్రెజిల్) జంటతో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం తలపడుతుంది. శాంటియాగో–బిర్కిచ్లతో 58 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో బోపన్న, రామ్‌కుమార్ ఎని మిది ఏస్‌లు సంధించారు. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. 41 ఏళ్ల బోపన్న తన కెరీర్లో 19 డబుల్స్ టైటిల్స్ సాధించి, 28 సార్లు రన్నరప్‌గా నిలిచాడు. (చదవండి: కోహ్లిని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. కౌంటరిచ్చిన వసీం జాఫర్) -
రామ్‌కుమార్‌కు చుక్కెదురు
క్యారీ (యూఎస్ఏ): క్యారీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్‌కు చుక్కెదురైంది. టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో బరిలో దిగి న అతడు... రెండింటిలోనూ తొలి రౌండ్లోనే ఓడి ఇంటి దారి పట్టాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6–3, 4–6, 1–6తో తేమురజ్ గబశ్విలి (రష్యా) చేతిలో ఓడాడు. తొలి సెట్‌ను గెల్చుకున్న రామ్‌కు మార్... అనంతరం పేలవ ప్రదర్శనతో రెండు, మూడు సెట్లను ప్రత్యర్థికి అప్పగించాడు. డబుల్స్ లో రెండో సీడ్ రామ్‌కుమార్–ఆండ్రె గొరాన్సెన్ (స్వీడన్) ద్వయం 1–6, 4–6తో హంటర్ రీస్ (అమెరికా)– సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడింది. -
సెమీస్‌లో రామ్‌కుమార్
న్యూఢిల్లీ: ఎకెంటల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 206వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–2, 6–1తో ప్రపంచ 120వ ర్యాంకర్, నాలుగో సీడ్ ఎవ్‌గెనీ డాన్స్కాయ్ (రష్యా)ను ఓడించాడు. 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 11 ఏస్‌లు సంధించడం విశేషం. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రామ్‌కుమార్ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో మార్విన్ మోలెర్ (జర్మనీ)తో రామ్‌కుమార్ ఆడతాడు. -
రామ్‌కుమార్ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేయగా... సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్లో తొలి రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలుపొందగా... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ 4–6, 6–4, 5–7తో గిలెర్మో లోపెజ్ (స్పెయిన్) చేతిలో ఓడాడు. లాకోతో జరిగిన మ్యాచ్‌లో రామ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 24 విన్నర్లు కొట్టిన ఈ చెన్నై ప్లేయర్ కేవలం పది అనవసర తప్పిదాలు చేశాడు. లోపెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 15 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 43 విన్నర్స్ కొట్టిన సాకేత్ 29 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
రామ్‌కుమార్ ఓటమి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు నిరాశ ఎదురైంది. సోమవారం మొదలైన ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 171వ ర్యాంకర్ జేసన్ కుబ్లెర్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 144వ ర్యాంకర్ రామ్‌కుమార్ 4–6, 4–6తో ఓడిపోయాడు. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి కేవలం ఆరుసార్లు మాత్రమే పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి కుబ్లెర్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. భారత నంబర్‌వన్, ప్రపంచ 86వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడే అవకాశం లభించింది. ప్రధాన టోర్నమెంట్ ఈనెల 26న మొదలవుతుంది. -
అంకిత, రామ్ శుభారంభం
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ రెండో రౌండ్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా శుభారంభం చేయగా... కర్మన్‌కౌర్ థండి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. సెర్గియో గిటెరెజ్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో గెలుపొందాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. అంకిత 6–2, 6–2తో మిర్టెల్లి జార్జెస్ (ఫ్రాన్స్)ను ఓడించింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. కర్మన్ కౌర్ 0–6, 5–7తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. కర్మన్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. -
రామ్‌కుమార్ పరాజయం
న్యూఢిల్లీ: గతవారం న్యూపోర్ట్ ఓపెన్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఏటీపీ–250 టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన భారత టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ అట్లాంటా ఓపెన్‌లో నిరాశపరిచాడు. అమెరికాలో మంగళవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 115వ ర్యాంకర్ రామ్‌కుమార్ 4–6, 4–6తో ప్రపంచ 65వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మరో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 186వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 2–6, 2–6తో ప్రపంచ 71వ ర్యాంకర్ లూకాస్ లాకో (స్లొవేకియా) చేతిలో ఓడాడు. -
నిరాశే కానీ... ఇదే గెలుపు పాఠమవుతుంది
సరిగ్గా... ఇరవైఏళ్ల క్రితం సంగతి. 1998లో లియాండర్ పేస్ న్యూపోర్ట్ ఓపెన్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో ఫైనల్ చేరడం గగనమే అయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు చెన్నై కుర్రాడు రామ్‌కుమార్ రామనాథన్ సింగిల్స్ బరిలో పోరాడి ఓడాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత భవిష్యత్ ఆశాకిరణమయ్యాడు. న్యూఢిల్లీ: టైటిల్ పోయింది. రెండు దశాబ్దాల నిరీక్షణ అలాగే ఉంది. కానీ... సింగిల్స్‌లో చాన్నాళ్లకు ఓ భారత ఆటగాడు తెరమీదికొచ్చాడు. అతనే చెన్నైకి చెందిన రామ్‌కుమార్ రామనాథన్. భారత ఆశల్ని తన భుజాన మోసు కెళ్లేందుకు అడుగులు వేస్తున్నాడు. న్యూపోర్ట్ ఓపెన్ టోర్నీలో టైటిల్ చేజారినా... ఈ ప్రయ త్నాన్ని ఓ గెలుపు పాఠంగా మలచుకుంటానని తెలిపాడు. ఇంకా అతనేమన్నాడంటే... నిరాశ నిజమే! ఫైనల్లో ఓటమి నిరాశ కలిగించింది. కానీ ఇక్కడిదాకా రావడమే క్లిష్టమైన పయనం. నేను తృటిలో టైటిల్‌ను కోల్పోయానంతే. ఇప్పుడు ఈ మ్యాచ్ రికార్డింగ్‌ను చూస్తా. ఎక్కడ ఏ తప్పు చేశానో స్వయంగా తెలుసుకొని మళ్లీ అవి పునరావృతం కాకుండా చూసుకుంటా. ఇదో అనుభవపాఠంగా సద్వినియోగం చేసుకుంటాను. ఈ టోర్నీకంటే ముందు నేను ఆడిన నాలుగు టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే ఓడాను. ఇప్పుడిలా ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది. పేస్ మద్దతు... న్యూపోర్ట్ ఓపెన్ టోర్నమెంట్లో నా ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నా. ఇందుకోసం చాన్నాళ్ల నుంచే కష్టపడుతున్నాను. టోర్నమెంట్లలో ప్రతీ రౌండ్‌ను తాజాగా ప్రారంభించేందుకు, వంద శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఇష్టపడతాను. రెండో రౌండ్లోనే డెనిస్ కుడ్లాతో క్లిష్టమైన పోటీ ఎదురైంది. అయినా నింపాదిగా ఆడా. తర్వాత స్టాండ్స్‌లో లియాండర్ పేస్ మ్యాచ్‌ను వీక్షిస్తూ ఇచ్చిన మద్దతు మరువలేను. 12 ఏళ్లకే యోగా... నా కెరీర్‌కు యోగా, ధ్యానం కూడా సాయపడ్డాయి. అనవసర ఒత్తిడి దరిచేరకుండా అవి కాపాడాయి. నిజానికి నేను 12 ఏళ్ల వయసులోనే యోగా తరగతులకు వెళ్లాను. కొంతకాలమయ్యాక మానేశాను. మళ్లీ ఏడాది క్రితం నుంచి నిత్యం యోగా, ధ్యానం చేస్తున్నాను. టాప్–10 ప్లేయర్‌ను ఓడించాక... గత 15 నెలలుగా నేను నాలుగు ఏటీపీ చాలెంజర్ టూర్ ఈవెంట్లలో రన్నరప్‌గా నిలిచాను. దీంతో పాటు అంటాల్యా ఓపెన్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ డొమినిక్ థీమ్‌ను కంగుతినిపించడం నాలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ టోర్నీలోనైనా, ఏ ప్రత్యర్థినైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్నిచ్చింది. దేశానికి ఆడటమే గౌరవం... యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నే కావొచ్చు. కానీ అదేసమయంలో ఆసియా క్రీడలు ఉన్నాయి. దీంతో దేశానికి ఆడటమే గొప్పగా భావించాను. అందుకే యూఎస్ నుంచి తప్పుకొని జకార్తాకే మొగ్గుచూపాను. ఇపుడు దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ►సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రామ్‌కుమార్ ఏకంగా 46 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 115వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
రన్నరప్ రామ్‌కుమార్
న్యూపోర్ట్ (అమెరికా): రెండు దశాబ్దాలుగా భారత క్రీడాకారులను ఊరిస్తోన్న అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ సింగిల్స్ టైటిల్ నిరీక్షణ ఇంకా కొనసాగనుంది. ఆదివారం ముగిసిన న్యూపోర్ట్ ఓపెన్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు గంటలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 161వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 6–3, 2–6తో ప్రపంచ 48వ ర్యాంకర్, మూడో సీడ్ స్టీవ్ జాన్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రామ్‌కుమార్ 10 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. విజేతగా నిలిచిన స్టీవ్ జాన్సన్‌కు 99,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 68 లక్షల 29 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ రామ్‌కుమార్‌కు 52,340 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 35 లక్షల 97 వేలు)తోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నైకు చెందిన 23 ఏళ్ల రామ్‌కుమార్ 6–4, 7–5తో టిమ్ స్మిజెక్ (అమెరికా)పై గెలుపొంది తన కెరీర్లో తొలిసారి ఏటీపీ–250 టూర్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 2009లో చెన్నై ఓపెన్‌లో, 2011లో దక్షిణాఫ్రికా ఓపెన్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఫైనల్‌కు చేరిన తర్వాత భారత్ నుంచి రామ్‌కుమార్ రూపంలో మరో ప్లేయర్ ఏటీపీ టూర్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరడం ఇదే ప్రథమం. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. భారత్ తరఫున చివరిసారి ఏటీపీ టూర్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆటగాడు లియాండర్ పేస్. 1998 న్యూపోర్ట్ ఓపెన్‌లో లియాండర్ పేస్ విజేతగా నిలిచాడు. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సుకోవా, స్టిక్ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో వింబుల్డన్ మాజీ సింగిల్స్ చాంపియన్ మైకేల్ స్టిక్ (జర్మనీ), 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన హెలెనా సుకోవా (చెక్ రిపబ్లిక్)లకు చోటు కల్పించారు. స్టిక్ 1991 వింబుల్డన్ టోర్నీలో బోరిస్ బెకర్ (జర్మనీ)పై వరుస సెట్లలో గెలిచాడు. 1994 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆండ్రీ అగస్సీ (అమెరికా) చేతిలో... 1996 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కఫెల్నికోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1997లో రిటైరయిన స్టిక్ కెరీర్ మొత్తంలో 18 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. సుకోవా, మైకేల్ స్టిక్ -
ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పారిస్‌లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ గెలుపొందగా... సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్ ఓడిపోయారు. ప్రజ్నేశ్ 6–4, 6–4తో సాల్వటోర్ కరూసో (ఇటలీ)పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సుమీత్ 6–4, 4–6, 1–6తో మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా) చేతిలో... రామ్‌కుమార్ 3–6, 7–5, 1–6తో జే క్లార్క్ (బ్రిటన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
కెరీర్లో మొదటిసారి...
రామ్‌కుమార్‌కు తొలి ‘మాస్టర్స్’ విజయం ఒహాయో: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత యువ టెన్నిస్ తార రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్లో తొలి ‘మాస్టర్స్’ విజయాన్ని సాధించాడు. సిన్సినాటి మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో ఈ చెన్నై ప్లేయర్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో రామ్‌కుమార్ 6–7 (5/7), 6–1, 6–4తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ (అమెరికా)పై విజయం సాధించాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఏకంగా 14 ఏస్‌లు సంధించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల తర్వాత రెండో అత్యున్నత స్థాయి హోదా మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లకు ఉంది. వాస్తవానికి ఈ టోర్నీలో క్వాలిఫయింగ్ రెండో రౌండ్లోనే రామ్‌కుమార్ ఓడిపోయినా... టోర్నమెంట్ మొదలయ్యాక మెయిన్ ‘డ్రా’లోని ఇతర ఆటగాళ్లు గాయాల కారణంగా వైదొలిగారు. దాంతో నిర్వాహకులు ‘లక్కీ లూజర్’ హోదాలో రామ్‌కుమార్‌కు మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం ఇచ్చారు. రెండో రౌండ్లో జారెడ్ డొనాల్డ్సన్ (అమెరికా)తో రామ్‌కుమార్ ఆడతాడు. రామ్‌కుమార్ ఇటీవలే వాషింగ్టన్లో జరిగిన సిటీ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో తొలి రౌండ్లో, అంటాల్యా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పేస్–జ్వెరెవ్ జంట ఓటమి మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జంట తొలి రౌండ్లోనే ఓడిపోయింది. గంటా 21 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పేస్–జ్వెరెవ్ ద్వయం 6–2, 6–7 (2/7), 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫెలిసియానో లోపెజ్–మార్క్ లోపెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 44 ఏళ్ల పేస్‌తో 20 ఏళ్ల జ్వెరెవ్ తొలిసారి జతకట్టాడు. 1997లో పేస్ తన కెరీర్లో ఆరు డబుల్స్ టైటిల్స్ గెలిచిన ఏడాదే జ్వెరెవ్ జన్మించడం విశేషం. గతవారం రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించిన జ్వెరెవ్ సీజన్లో ఐదో సింగిల్స్ టైటిల్‌ను గెలిచాడు. -
క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ ఓటమి
అంటాల్యా (టర్కీ): అంటాల్యా ఓపెన్ ఏటీపీ గ్రాస్‌కోర్ట్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ పోరాటం ముగిసింది. గురువారం రెండు గంటల 43 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 7–6 (7/0), 3–6, 6–7 (6/8)తో మార్కోస్ బాగ్దాటిస్ చేతిలో ఓడిపోయాడు. తొలి సెట్ టైబ్రేకర్‌లో 7/0తో సునాయాస విజయం సాధించిన రామ్, రెండో సెట్లో తేలిపోయాడు. నిర్ణాయక మూడో సెట్లో టైబ్రేక్‌లో చివరిదాకా పోరాడినా 6/8తో ఓటమి చవిచూశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 11 డబుల్‌ఫాల్ట్‌లు చేసిన రామ్ 10 ఏస్‌లు సంధించాడు. -
రామ్‌కుమార్ సంచలనం
ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ డొమినిక్ థీమ్‌పై గెలుపు అంటాల్యా (టర్కీ): భారత యువ టెన్నిస్ క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. అంటాల్యా ఓపెన్ ఏటీపీ గ్రాస్‌కోర్టు టోర్నమెంట్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, టాప్ సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై రామ్‌కుమార్ గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ 222వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–3, 6–2తో థీమ్‌ను మట్టికరిపించాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. సోమవారం రాత్రి జరిగిన తొలి రౌండ్లో రామ్‌కుమార్ 6–3, 6–4తో ప్రపంచ 68వ ర్యాంకర్ రొగెరియో దుత్రా సిల్వా (బ్రెజిల్)ను ఓడించాడు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) ద్వయం 3–6, 7–5, 11–9తో వెస్లీ కూల్‌హాఫ్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు లండన్‌లోని ఈస్ట్‌బోర్న్‌లో జరుగుతున్న ఎగాన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) జంట తమ ప్రత్యర్థి ఒస్టాపెంకో (లాత్వియా)–స్రెబొత్నిక్ (స్లొవేనియా) జోడీకి వాకోవర్ ఇచ్చింది. -
యువ... జయహో
రివర్స్ సింగిల్స్‌లోనూ గెలిచిన రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ న్యూజిలాండ్‌పై 4–1తో భారత్ విజయం ఆసియా ఓసియానియా రెండో రౌండ్‌కు అర్హత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో పోరు తదుపరి దశకు భారత్ అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో యువ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ సత్తా చాటాడు. డేవిస్ కప్‌లో ఆడుతోంది ఆరో మ్యాచ్ అయినప్పటికీ... కీలక పోరులో ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. నామమాత్రమైన రెండో రివర్స్ సింగిల్స్‌లో మరో యువ ప్లేయర్ యూకీ బాంబ్రీ కూడా గెలుపొందడంతో భారత్ 4–1తో న్యూజిలాండ్‌ను ఓడించి ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్‌కు అర్హత సంపాదించింది. పుణే: ప్రధాన సింగిల్స్ ప్లేయర్ సాకేత్ మైనేని చివరి నిమిషంలో గాయపడటంతో అందివచ్చిన అవకాశాన్ని యువ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అంచనాలకు అనుగుణంగా రాణించి కీలకమైన విజయాన్ని భారత్‌కు అందించి ఊరట కలిగించాడు. డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 తొలి రౌండ్లో భాగంగా ఆదివారం జరిగిన రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత యువ ఆటగాళ్లు రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ గెలుపొందారు. ఫలితంగా టీమిండియా 4–1తో న్యూజిలాండ్‌ను ఓడించింది. తద్వారా వచ్చే ఏప్రిల్‌లో భారత్‌లోనే జరిగే రెండో రౌండ్లో ఉజ్బెకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆదివారం 2–1 ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రామ్‌కుమార్ విజయాన్ని ఖాయం చేశాడు. తొలి రివర్స్ సింగిల్స్‌లో ప్రపంచ 276వ ర్యాంకర్ రామ్‌కుమార్ 7–5, 6–1, 6–0తో ఫిన్ టియర్నీపై గెలిచాడు. సరిగ్గా రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌కు తొలి సెట్లోనే గట్టిపోటీనే ఎదురైంది. అయితే 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్న రామ్‌కుమార్ 12వ గేమ్‌లో టియర్నీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ చెన్నై ప్లేయర్ చెలరేగిపోయాడు.రెండో సెట్లో ఒక గేమ్ మాత్రమే కోల్పోగా... మూడో సెట్లో ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించి భారత్‌కు విజయాన్ని అందించాడు. 12 ఏస్‌లు సంధించిన రామ్‌కుమార్ తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మ్యాచ్ మొత్తంలో టియర్నీ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా చేజార్చుకోలేదు. ఫలితం తేలిపోవడంతో రెండో రివర్స్ సింగిల్స్‌ను బెస్ట్ ఆఫ్–3 సెట్స్‌గా నిర్వహించారు. ప్రాధాన్యత లేకపోయినప్పటికీ యూకీ బాంబ్రీ పట్టుదలతో పోరాడి 7–5, 3–6, 6–4తో జోస్ స్థాతమ్‌ను ఓడించి భారత్‌కు 4–1తో విజయాన్ని ఖరారు చేశాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో యూకీ ఆరు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 4–4తో సమంగా ఉన్నపుడు యూకీ తన సర్వీస్‌లో 15–40తో రెండు బ్రేక్ పాయింట్లు కాచుకున్నాడు. ఈ దశలో యూకీ చక్కటి ఆటతీరుతో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతోపాటు పదో గేమ్‌లో స్థాతమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి రివర్స్ సింగిల్స్ ముగిశాక భారత జట్టు సభ్యులందరూ రామ్‌కుమార్‌ను గాల్లోకి ఎగరేసి సంబరం చేసుకున్నారు. రెండో రివర్స్ సింగిల్స్ పూర్తయ్యాక కోర్టులోనే భారత జట్టు సభ్యులందరూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్న ఆనంద్ అమృత్‌రాజ్‌ను, కోచ్ జీషాన్ అలీ, వెటరన్ లియాండర్ పేస్‌లను కూడా జట్టు సభ్యులు గాల్లోకి ఎగరేసి తమదైనరీతిలో సంబరాలు చేసుకున్నారు. -
నాదల్ ప్రత్యర్థి రామ్‌కుమార్
డబుల్స్‌లో పేస్‌కు జతగా సాకేత్ నేటి నుంచి భారత్-స్పెయిన్ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ న్యూఢిల్లీ: స్పెయిన్‌తో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ ప్రారంభ సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ ప్రపంచ నాలుగో ర్యాంకర్ రాఫెల్ నాదల్‌తో తలపడనున్నాడు. నేటి (శుక్రవారం) నుంచి 18 వరకు స్థానిక ఆర్కే ఖన్నా టెన్నిస్ స్టేడియంలో జరిగే ఈ పోటీల షెడ్యూల్‌ను విడుదల చేశారు. రెండో సింగిల్స్‌లో సాకేత్ మైనేని ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫైతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. రెండో రోజు జరిగే డబుల్స్‌లో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్, సాకేత్ మైనేని జంటగా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్స ఫెలికియానో లోపెజ్, మార్క్ లోపెజ్‌తో ఆడనున్నారు. రివర్స్ సింగిల్స్‌లో సాకేత్.. నాదల్‌తో, రామ్‌నాథన్.. ఫైతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ‘మేం అండర్డాగ్సగా బరిలోకి దిగబోతున్నాం. తొలి రోజు 1-1తో ముగిస్తే మాకు మంచి అవకాశం ఉంటుంది. అందుకే తొలి రోజే కీలకం’ అని సాకేత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ టై చాలా ముఖ్యమని నాదల్ తెలిపాడు. భారత్‌కు కష్టమే..: ఐదుసార్లు డేవిస్ కప్ చాంపియన్‌గా నిలవడంతో పాటు ప్రపంచ టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాళ్లతో నిండిన స్పెయిన్ జట్టును ఎదుర్కోవాలంటే భారత్ శక్తికి మించి ప్రదర్శన చేయాల్సిందే. 14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత రాఫెల్ నాదల్, డేవిడ్ ఫై (13వ ర్యాంకు), ఫెలికియానో లోపెజ్ (డబుల్స్ ఫ్రెంచ్ ఓపెన్ విజేత), మార్క్ లోపెజ్ (డబుల్స్‌లో 15వ ర్యాంకర్)లతో కూడిన స్పెయిన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. పేస్ మినహా మిగతా భారత ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం ఇబ్బంది పెట్టే అంశం. 51 ఏళ్ల తర్వాత స్పెరుున్ జట్టుకు భారత్ ఆతిథ్యమివ్వబోతుండగా గెలుపోటములతో సంబంధం లేకుండా టెన్నిస్ అభిమానులకు మాత్రం స్టార్ ఆటగాళ్లతో నిండిన స్పెయిన్ జట్టు కనువిందు చేయడం ఖాయం. ఓవరాల్‌గా భారత్‌పై 2-1 తేడాతో స్పెరుున్ ఆధిక్యంలో ఉంది. -
భళా... భారత్
* రెండు సింగిల్స్‌లో రామ్‌కుమార్, సాకేత్ విజయం * కొరియాపై 2-0తో ఆధిక్యం * డేవిస్ కప్ మ్యాచ్ చండీగఢ్: సొంతగడ్డపై భారత టెన్నిస్ యువ ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని ఆకట్టుకున్నారు. దక్షిణ కొరియాతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు 2-0తో ఆధిక్యాన్ని అందించారు. రెండు మ్యాచ్‌ల్లో కొరియా ఆటగాళ్లు ఓటమి అంచుల్లో ఉన్న దశలో గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం. డేవిస్ కప్‌లో తొలిసారి బరిలోకి దిగిన 21 ఏళ్ల రామ్‌కుమార్ 6-3, 2-6, 6-3, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సియోంగ్ చాన్ హాంగ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరించలేక సియోంగ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో చైర్ అంపైర్ రామ్‌కుమార్‌ను విజేతగా ప్రకటించారు. యోంగ్‌కు లిమ్తో జరిగిన రెండో మ్యాచ్‌లో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో కొరియా ప్లేయర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. కెరీర్లో తొలిసారి ఐదు సెట్ల మ్యాచ్‌ను ఆడిన సాకేత్ విజయం ఖాయం కాగానే ఆనందంతో తన జెర్సీని విప్పి గాల్లోకి విసిరేసి సంబరం చేసుకున్నాడు. మిగతా సహచరులు సాకేత్‌ను భుజాలపైకి ఎత్తుకొని అతణ్ని అభినందించారు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లియాండర్ పేస్-రోహన్ బోపన్న ద్వయం హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్ జోడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది. -
రెండో రౌండ్లో సాకేత్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 1-6, 7-6 (7/3), 6-4తో డకీ లీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. మరోవైపు భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో రామ్‌కుమార్ 3-6, 3-6తో మాథ్యూ బార్టన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. -
సాకేత్ శుభారంభం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 168వ ర్యాంకర్ సాకేత్ 6-4, 6-1తో ప్రపంచ 206వ ర్యాంకర్, భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను అలవోకగా ఓడించాడు. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు రామ్‌కుమార్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. శుక్రవారం జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 261వ ర్యాంకర్ లొరెంజో గిస్టినో (ఇటలీ)తో సాకేత్ తలపడతాడు. మరోవైపు భారత అగ్రశ్రేణి ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. జర్గెన్ జాప్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 6-2, 1-6, 4-6తో ఓడిపోయాడు. తొలి రోజు ఎండ తీవ్రత (41.6 డిగ్రీల సెల్సియస్) ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం జరగాల్సిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు విరామం ఇచ్చి సాయంత్రం వేళలో నిర్వహించారు. -
పోరాడి ఓడిన రామ్‌కుమార్
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత యువతార రామ్‌కుమార్ రామనాథన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 248వ ర్యాంకర్ రామ్‌కుమార్ 7-6 (7/5), 4-6, 3-6తో ప్రపంచ 45వ ర్యాంకర్ అల్జాజ్ బెడెన్ (బ్రిటన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-4తో గార్సియా లోపెజ్ (స్పెయిన్)పై నెగ్గి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 6-4, 5-7, 5-10తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ మరాచ్ (ఆస్ట్రియా)-మార్టిన్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. -
క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జోడీ
చెన్నై: సింగిల్స్‌లో శుభారంభం చేసిన భారత టెన్నిస్ యువతార రామ్‌కుమార్ రామనాథన్ డబుల్స్ విభాగంలోనూ మెరిశాడు. భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి బరిలోకి దిగిన అతను తొలి రౌండ్లో 2-6, 7-6 (7/5), 10-5తో నాలుగో సీడ్ అర్తెమ్ సితాక్-మార్కస్ డానియల్ (న్యూజిలాండ్)పై సంచలన విజయం నమోదు చేశాడు. స్పెయిన్‌లో శిక్షణ పొందే రామ్‌కుమార్, జర్మనీలో ప్రాక్టీస్ చేసే బాలాజీ డబుల్స్ మ్యాచ్‌లో సమన్వయంతో రాణించారు. తొలి సెట్‌ను చేజార్చుకున్నా, రెండో సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్నారు. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో కీలకదశలో రామ్‌కుమార్-బాలాజీ జంట పైచేయి సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో డబుల్స్ మ్యాచ్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్-జీవన్ (భారత్) ద్వయం 4-6, 6-3, 10-5తో ని కొలస్ (అమెరికా)-కాస్టిలో (చిలీ) జంటను ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. మరోవైపు సింగిల్స్ రెండో రౌండ్లో రామ్‌కుమార్‌తో ఆడాల్సిన ప్రపంచ 12వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో అండర్సన్ స్థానంలో కుద్రయెత్సెవ్ (రష్యా)కు చోటు లభించింది. గురువారం జరిగే మ్యాచ్‌లో కుద్రయెత్సెవ్తో రామ్‌కుమార్ ఆడతాడు. -
రామ్‌కుమార్ శుభారంభం
♦ సోమ్‌దేవ్‌కు చుక్కెదురు ♦ చెన్నై ఓపెన్ టోర్నీ చెన్నై: సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో భారత యువ టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్లో రెండో గొప్ప విజయాన్ని సాధించాడు. చెన్నై ఓపెన్‌లో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 248వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6-2, 6-0తో ప్రపంచ 98వ ర్యాంకర్ డానియెల్ గిమెనో ట్రావెర్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించాడు. టాప్-100లోని క్రీడాకారుడిని ఓడించడం రామ్‌కుమార్‌కిది రెండోసారి మాత్రమే. గతేడాది ఇదే టోర్నీలో అప్పడు 90వ ర్యాంక్‌లో ఉన్న సోమ్‌దేవ్‌ను రామ్‌కుమార్ ఓడించాడు. ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ఈ చెన్నై ఆటగాడు రెండో రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో తలపడతాడు. మరోవైపు క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. సోమ్‌దేవ్ 3-6, 6-3, 3-6తో రష్యాకు చెందిన 18 ఏళ్ల ఆండ్రీ రుబ్లెవ్ చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్స్‌లో పేస్ జంట పురుషుల డబుల్స్ విభాగంలో రెండో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో పేస్-గ్రానోలెర్స్ ద్వయం 6-2, 6-3తో తారో డానియల్ (జపాన్)-జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి (భారత్)-గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) జంట 3-6, 7-6 (7/2), 7-10తో టాప్ సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది.