ఎనిమిది నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దక్షిణకొరియాలో ఆదివారం ముగిసిన సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది.
ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–4, 4–6, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో వాసిల్ కిర్కోవ్ (అమెరికా)–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జోడీపై నెగ్గింది. సాకేత్–రామ్‌కుమార్ జంటకు 7,580 డాలర్ల (రూ. 6 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది సాకేత్–రామ్‌మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఇద్దరు బెంగళూరు ఓపెన్, చెన్నై ఓపెన్ టోర్నీల్లో విజేతలుగా నిలిచారు. ఓవరాల్‌గా సాకేత్ కెరీర్‌లో ఇది 19వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. ఏటీపీ చాలెంజర్ టోర్నీలు కాకుండా సాకేత్ మరో 19 ఐటీఎఫ్ టోర్నీ డబుల్స్ టైటిల్స్ కూడా గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment