బుసాన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. దక్షిణ కొరియాలో బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సాకేత్–ప్యాట్రిక్ నిక్లాస్ సాల్మనెన్ (ఫిన్‌లాండ్) ద్వయం 5–7, 2–6తో అలెక్స్ బోల్ట్–లి టు (ఆ్రస్టేలియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment