
నాదల్ ప్రత్యర్థి రామ్‌కుమార్
డబుల్స్‌లో పేస్‌కు జతగా సాకేత్
నేటి నుంచి భారత్-స్పెయిన్ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్
న్యూఢిల్లీ: స్పెయిన్‌తో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ ప్రారంభ సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ ప్రపంచ నాలుగో ర్యాంకర్ రాఫెల్ నాదల్‌తో తలపడనున్నాడు. నేటి (శుక్రవారం) నుంచి 18 వరకు స్థానిక ఆర్‌కే ఖన్నా టెన్నిస్ స్టేడియంలో జరిగే ఈ పోటీల షెడ్యూల్‌ను విడుదల చేశారు. రెండో సింగిల్స్‌లో సాకేత్ మైనేని ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫైతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. రెండో రోజు జరిగే డబుల్స్‌లో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్, సాకేత్ మైనేని జంటగా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌స ఫెలికియానో లోపెజ్, మార్క్ లోపెజ్‌తో ఆడనున్నారు.
రివర్స్ సింగిల్స్‌లో సాకేత్.. నాదల్‌తో, రామ్‌నాథన్.. ఫైతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ‘మేం అండర్‌డాగ్‌సగా బరిలోకి దిగబోతున్నాం. తొలి రోజు 1-1తో ముగిస్తే మాకు మంచి అవకాశం ఉంటుంది. అందుకే తొలి రోజే కీలకం’ అని సాకేత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ టై చాలా ముఖ్యమని నాదల్ తెలిపాడు.
భారత్‌కు కష్టమే..: ఐదుసార్లు డేవిస్ కప్ చాంపియన్‌గా నిలవడంతో పాటు ప్రపంచ టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాళ్లతో నిండిన స్పెయిన్ జట్టును ఎదుర్కోవాలంటే భారత్ శక్తికి మించి ప్రదర్శన చేయాల్సిందే. 14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత రాఫెల్ నాదల్, డేవిడ్ ఫై (13వ ర్యాంకు), ఫెలికియానో లోపెజ్ (డబుల్స్ ఫ్రెంచ్ ఓపెన్ విజేత), మార్క్ లోపెజ్ (డబుల్స్‌లో 15వ ర్యాంకర్)లతో కూడిన స్పెయిన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.
పేస్ మినహా మిగతా భారత ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం ఇబ్బంది పెట్టే అంశం. 51 ఏళ్ల తర్వాత స్పెరుున్ జట్టుకు భారత్ ఆతిథ్యమివ్వబోతుండగా గెలుపోటములతో సంబంధం లేకుండా టెన్నిస్ అభిమానులకు మాత్రం స్టార్ ఆటగాళ్లతో నిండిన స్పెయిన్ జట్టు కనువిందు చేయడం ఖాయం. ఓవరాల్‌గా భారత్‌పై 2-1 తేడాతో స్పెరుున్ ఆధిక్యంలో ఉంది.