పేస్పై నాదల్ ప్రశంసలు | Leander Paes One of The Best Players in The World, says Rafael Nadal | Sakshi
Sakshi News home page

పేస్పై నాదల్ ప్రశంసలు

Published Sun, Sep 18 2016 12:29 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

పేస్పై నాదల్ ప్రశంసలు

పేస్పై నాదల్ ప్రశంసలు

న్యూఢిల్లీ:భారత టెన్నిస్ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్పై స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ప్రశంసల వర్షం కురిపించాడు.  పురుషుల డబుల్స్ టెన్నిస్లో లియాండర్ ఒక అసాధారణ ఆటగాడని కొనియాడాడు.  టెన్నిస్ చరిత్రలో  ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న లియాండర్తో తలపడటం తాను అరుదైన గౌరవంగా భావిస్తున్నాని నాదల్ పేర్కొన్నాడు.

డేవిస్ కప్‌ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జంట 4-6, 7-6 (7/2), 6-4, 6-4 తో లియాండర్ పేస్-సాకేత్ మైనేని జోడీపై విజయం సాధించింది. మూడు గంటలకు పైగా సాగిన పోరులో భారత జంట పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం  భారత ద్వయంలో ఒకడైన పేస్ను నాదల్ ప్రత్యేకంగా అభినందించాడు.


'లియాండర్ గొప్ప మ్యాచ్ ఆడాడు. గత రాత్రి జరిగిన మ్యాచ్ ఆద్యంతం అద్భుతంగా జరిగింది. ఆ మ్యాచ్ చాలా కఠినమైన మ్యాచ్ . లియాండర్ జంట చాలా బాగా ఆడింది. లియాండర్ పేస్ దేశంలో అతనితో కలిసి ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. డబుల్స్ విభాగంలో అతి పెద్ద స్టార్లలో పేస్ ఒకడు. టెన్నిస్ చరిత్రలో లియాండర్ అత్యుత్తమ ఆటగాడు' అని నాదల్ తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement