![Ramkumar drops out of Carrie Challenger event in US - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/13/RAMKUMAR-PIC.jpg.webp?itok=XNgoglj2)
క్యారీ (యూఎస్‌ఏ): క్యారీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్‌కు చుక్కెదురైంది. టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో బరిలో దిగి న అతడు... రెండింటిలోనూ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటి దారి పట్టాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6–3, 4–6, 1–6తో తేమురజ్ గబశ్విలి (రష్యా) చేతిలో ఓడాడు. తొలి సెట్‌ను గెల్చుకున్న రామ్‌కు మార్... అనంతరం పేలవ ప్రదర్శనతో రెండు, మూడు సెట్లను ప్రత్యర్థికి అప్పగించాడు. డబుల్స్ లో రెండో సీడ్ రామ్‌కుమార్–ఆండ్రె గొరాన్సెన్ (స్వీడన్) ద్వయం 1–6, 4–6తో హంటర్ రీస్ (అమెరికా)– సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment