
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. సోమవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో రామ్‌కుమార్ 5–7, 4–6తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్) చేతిలో... యూకీ బాంబ్రీ 5–7, 1–6తో జపాటా మిరాలెస్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 128 మంది పోటీపడుతుండగా... 16 మంది మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. ప్రధాన టోర్నీ ఈనెల 27న మొదలవుతుంది.
చదవండి: ఫార్ములావన్ టెస్టుకు భారత రేసర్ జెహాన్