Wimbeledon
-
తొలి రౌండ్లోనే ఓడిన రామ్‌కుమార్, యూకీ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సోమవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో రామ్‌కుమార్ 5–7, 4–6తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్) చేతిలో... యూకీ బాంబ్రీ 5–7, 1–6తో జపాటా మిరాలెస్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 128 మంది పోటీపడుతుండగా... 16 మంది మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. ప్రధాన టోర్నీ ఈనెల 27న మొదలవుతుంది. చదవండి: ఫార్ములావన్ టెస్టుకు భారత రేసర్ జెహాన్ -
షాకింగ్ న్యూస్ చెప్పిన స్పెయిన్ బుల్..
న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం, 20సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ అభిమానలుకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. వింబుల్డన్-2021, టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం తన శరీరం సహకరించడం లేదని, మరికొన్నేళ్లు కెరీర్‌ను కొనసాగించాలంటే తగినంత విశ్రాంతి అవసరమని, అందుకే ఆటకు పాక్షికంగా విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించాడు. తాను తీసుకున్న నిర్ణయం అంత తేలికైందేమీ కాదని, తన శరీరం సహకరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకుని నా బృందంతో చర్చించిన తర్వాతే, ఈ మేరకు నిర్ణయించుకున్నాని పేర్కొన్నాడు. Hi all, I have decided not to participate at this year’s Championships at Wimbledon and the Olympic Games in Tokyo. It’s never an easy decision to take but after listening to my body and discuss it with my team I understand that it is the right decision — Rafa Nadal (@RafaelNadal) June 17, 2021 I want to send a special message to my fans around the world, to those in the United Kingdom and Japan in particular. — Rafa Nadal (@RafaelNadal) June 17, 2021 తన పాక్షిక రిటైర్మెంట్ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు ముఖ్యంగా బ్రిటన్, జపాన్లలోని అభిమానులకు ఆయన ప్రత్యేక సందేశం పంపాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశాడు. కాగా, మట్టి కోర్టు రారాజుగా ప్రసిద్ధి చెందిన 35 ఏళ్ల నదాల్, కొద్ది రోజుల కిందట జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లో నిష్క్రమించాడు. ఈ గ్రాండ్‌స్లామ్‌లో నదాల్‌కు ఇది కేవలం మూడో ఓటమి మాత్రమే. ఇదిలా ఉంటే, 2008, 2010లో రెండుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన నదాల్.. 2008 టెన్నిస్ మెన్స్ సింగిల్స్ విభాగంలో ఒలింపిక్ స్వర్ణం సాధించాడు. చదవండి: ‘మారడోనాను డాక్టర్లే చంపారు.. ఆయనను అస్సలు పట్టించుకోలేదు’ -
అండర్సన్‌కు చుక్కెదురు
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్‌లో నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. పదోసీడ్ ఖచనోవ్ (రష్యా) కూడా పరాజయం చవిచూడగా, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా), రావ్‌నిచ్ (కెనడా) ప్రిక్వార్టర్స్ చేరాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు నాలుగో సీడ్ అండర్సన్ 4–6, 3–6, 6–7 (4/7)తో 26వ సీడ్ పెల్లా చేతిలో కంగుతిన్నాడు. మిగతా మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 7–5, 6–7 (5/7), 6–1, 6–4తో హుర్కాజ్ (పోలాండ్)పై, 15వ సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 7–6 (7/1), 6–2, 6–1తో రెలీ ఒపెల్కా (అమెరికా)పై గెలుపొందారు. పదో సీడ్ ఖచనోవ్ (రష్యా) 3–6, 6–7 (3/7), 1–6 స్పెయిన్‌కు చెందిన 23వ సీడ్ అగుట్ చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ హలెప్ (రొమేనియా) 6–3, 6–1తో అజరెంకా (బెలారస్)పై, మూడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 2–6, 6–4తో సు వే హై (చైనీస్ తైపీ)పై, 8వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–7 (1/7), 6–2తో సక్కారి (గ్రీస్)పై గెలిచారు.