
న్యూఢిల్లీ: గతవారం న్యూపోర్ట్ ఓపెన్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ అట్లాంటా ఓపెన్‌లో నిరాశపరిచాడు. అమెరికాలో మంగళవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 115వ ర్యాంకర్ రామ్‌కుమార్ 4–6, 4–6తో ప్రపంచ 65వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
మరో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 186వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 2–6, 2–6తో ప్రపంచ 71వ ర్యాంకర్ లూకాస్ లాకో (స్లొవేకియా) చేతిలో ఓడాడు.