
న్యూఢిల్లీ: ఎకెంటల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 206వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–2, 6–1తో ప్రపంచ 120వ ర్యాంకర్, నాలుగో సీడ్ ఎవ్‌గెనీ డాన్‌స్కాయ్ (రష్యా)ను ఓడించాడు. 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 11 ఏస్‌లు సంధించడం విశేషం. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రామ్‌కుమార్ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో మార్విన్ మోలెర్ (జర్మనీ)తో రామ్‌కుమార్ ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment