పోరాడి ఓడిన రామ్‌కుమార్ | In Ramkumar Ramanathan, Chennai savours local flavour | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన రామ్‌కుమార్

Published Sat, Jan 9 2016 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

పోరాడి ఓడిన రామ్‌కుమార్

పోరాడి ఓడిన రామ్‌కుమార్

 చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత యువతార రామ్‌కుమార్ రామనాథన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 248వ ర్యాంకర్ రామ్‌కుమార్ 7-6 (7/5), 4-6, 3-6తో ప్రపంచ 45వ ర్యాంకర్ అల్‌జాజ్ బెడెన్ (బ్రిటన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
 
  మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-4తో గార్సియా లోపెజ్ (స్పెయిన్)పై నెగ్గి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 6-4, 5-7, 5-10తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ మరాచ్ (ఆస్ట్రియా)-మార్టిన్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement