ATP tennis tournament
-
జొకోవిచ్ శుభారంభం.. సిట్సిపాస్‌పై వరుసగా తొమ్మిదో విజయం
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా స్టార్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో ‘రెడ్ గ్రూప్’ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–4, 7–6 (7/4)తో మూడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు. సిట్సిపాస్‌పై జొకోవిచ్‌కిది వరుసగా తొమ్మిదో విజయం. ‘గ్రీన్ గ్రూప్’ మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 3–6, 4–6తో ఫెలిక్స్ అలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. ఇదే గ్రూప్‌లో టేలర్ ఫ్రిట్జ్ తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే నాదల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడు. -
సెమీస్‌లో ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. మెక్సికోలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 3–6, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ మిజా–రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జంటకు 1,080 డాలర్ల (రూ.82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 30 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఎదురులేని నాదల్.. వరుసగా 14వ విజయం
ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వరుసగా 14వ విజయం నమోదు చేశాడు. అకాపుల్కోలో జరుగుతున్న మెక్సికో ఓపెన్‌లో నాదల్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–3తో టాప్ సీడ్, కాబోయే కొత్త ప్రపంచ నంబర్‌వన్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో నోరీ (బ్రిటన్)తో నాదల్ తలపడతాడు. -
ఏటీపీ కప్‌కు జొకోవిచ్ దూరం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకంగా జనవరి 1 నుంచి 9 వరకు జరగనున్న టీమ్ ఈవెంట్ ఏటీపీ కప్‌లో పాల్గొనే సెర్బియా జట్టు నుంచి జొకోవిచ్ వైదొలిగాడు. మరోవైపు తన కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ సెర్బియా స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడటం అనుమానంగా మారింది. -
సెమీస్‌లో యూకీ జంట
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ (భారత్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్ బోపన్న–జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–దివిజ్ జోడీ 7–5, 2–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్)–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) జంటను బోల్తా కొట్టించింది. మరో మ్యాచ్‌లో బోపన్న–జీవన్ జంట 3–6, 5–7తో హెర్బర్ట్–గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
యూకీ, రామ్ ఓటమి
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ రెండో రౌండ్లో నిష్క్రమించారు. 2014 యూఎస్ ఓపెన్ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ 4–6, 3–6తో ఓటమి చెందగా... యూకీ బాంబ్రీ 6–4, 3–6, 4–6తో ఎనిమిదో సీడ్ పియరి హ్యూస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో యూకీ–దివిజ్ జంట 6–2, 6–2తో లాస్లో జెరీ (సెర్బియా)–బ్లాజ్ కావ్సిచ్ (స్లొవేనియా) జోడీపై విజయం సాధించింది. -
రామ్‌కుమార్ శుభారంభం
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆశాకిరణం రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేశాడు. 148వ ర్యాంకర్ రామ్‌కుమార్ తొలి రౌండ్లో 7–6 (7/4), 6–2తో తనకన్నా మెరుగైన కార్బలెస్ బయెనా (స్పెయిన్; 106వ ర్యాంకు)ను కంగుతినిపించాడు. మంగళవారం జరిగే రెండో రౌండ్లో అతనికి క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్, టోర్నీ ఫేవరెట్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో రామ్‌కుమార్ తలపడనున్నాడు. డబుల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు విష్ణువర్ధన్ జోడీకి తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందిన విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ జోడీ 6–3, 6–7 (6/8), 6–10తో అదిల్ షమస్దిన్(కెనడా)–నీల్ స్కప్‌స్కీ (అమెరికా) జంట చేతిలో ఓడింది. -
పోరాడి ఓడిన రామ్‌కుమార్
చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత యువతార రామ్‌కుమార్ రామనాథన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 248వ ర్యాంకర్ రామ్‌కుమార్ 7-6 (7/5), 4-6, 3-6తో ప్రపంచ 45వ ర్యాంకర్ అల్జాజ్ బెడెన్ (బ్రిటన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-4, 6-4తో గార్సియా లోపెజ్ (స్పెయిన్)పై నెగ్గి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 6-4, 5-7, 5-10తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ మరాచ్ (ఆస్ట్రియా)-మార్టిన్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట
వాషింగ్టన్ : సిటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న-మెర్జియా జంట 2-6, 6-1, 10-3తో ఆండీ ముర్రే (బ్రిటన్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోయిన బోపన్న జోడీ రెండో సెట్లో వెంటనే తేరుకొని స్కోరును సమం చేసింది. ఇక నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచి విజయాన్ని దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్లో దిమిత్రోవ్ (బల్గేరియా)-మార్డీ ఫిష్ (అమెరికా) జంటతో బోపన్న-మెర్జియా తలపడతారు. -
సెమీస్‌లో సానియా జోడి
రోజర్స్ కప్ టోర్నీ మాంట్రియల్ (కెనడా): రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్) -కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో సానియా-కారా బ్లాక్ 6-2, 6-1తో రాకెల్ జోన్స్-అబిగెల్ స్పియర్స్లపై గెలిచారు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట అమెరికా జోడి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో రెండో సీడ్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-పెంగ్ షుయె (చైనా) లతో సానియా ద్వయం తలపడుతుంది. ఈ సీజన్లో సు వీ సెయి-పెంగ్ షుయెలతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సానియా-కారా బ్లాక్‌లకు ఓటమి ఎదురైంది. ‘ఆప్టస్’ సెమీస్‌లో సనమ్ జోడి ఆప్టస్ (అమెరికా): ఆప్టస్ చాలెంజర్ ఏటీపీ టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ జోడి సనమ్ సింగ్-పురవ్ రాజా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సనమ్-పురవ్ జంట 7-6 (7-4), 6-2తో ఆండ్రియా కొలారిని (అర్జెంటీనా)-సేసర్ రమిరెజ్ (మెక్సికో) జోడిపై విజయం సాధించింది. నాలుగో సీడ్ భారత జంట ఇక సెమీస్‌లో టాప్ సీడ్ ఆస్టిన్ క్రాజిసెక్ (అమెరికా)-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడితో తలపడనుంది. మరోవైపు సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ క్వార్టర్స్‌లో ఓటమిపాలయ్యాడు. కజకిస్థాన్‌కు చెందిన మైఖేల్ కుకుష్కిని చేతిలో సోమ్‌దేవ్ 5-7, 6-4, 2-6తో ఓడిపోయాడు.