
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ రెండో రౌండ్‌లో నిష్క్రమించారు. 2014 యూఎస్ ఓపెన్ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ 4–6, 3–6తో ఓటమి చెందగా... యూకీ బాంబ్రీ 6–4, 3–6, 4–6తో ఎనిమిదో సీడ్ పియరి హ్యూస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో యూకీ–దివిజ్ జంట 6–2, 6–2తో లాస్లో జెరీ (సెర్బియా)–బ్లాజ్ కావ్‌సిచ్ (స్లొవేనియా) జోడీపై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment