
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. మెక్సికోలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 3–6, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ మిజా–రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జంటకు 1,080 డాలర్ల (రూ.82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 30 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment