Yuki Bomber
-
తొలి రౌండ్లోనే యూకీ ఓటమి
న్యూఢిల్లీ: లిబెమా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. నెదర్లాండ్స్‌లోని ఎస్–హెర్టోజెన్ బాష్ నగరంలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 4–6, 1–6తో డానిల్ మెద్వెదేవ్ (రష్యా) చేతిలో పరాజయం పొందాడు. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యూకీ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. మెయిన్ ‘డ్రా’కు ప్రజ్నేశ్ మరోవైపు స్టుట్‌గార్ట్‌లో జరుగుతున్న మెర్సిడెస్ కప్‌లో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ప్రజ్నేశ్ 6–3, 4–6, 6–3తో క్రిస్టియన్ హారిసన్ (అమెరికా)పై గెలుపొందాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 23వ ర్యాంకర్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)తో ప్రజ్నేశ్ ఆడతాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. తాజా సింగిల్స్ ర్యాంకుల్లో అతను ఏకంగా 84 స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 176వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆదివారం చైనాలో జరిగిన ఏటీపీ చాలెంజర్స్ టోర్నీలో సింగిల్స్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా 125 పాయింట్లు పొందిన ప్రజ్నేశ్ టాప్–200 ర్యాంకుల్లో నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో యూకీ బాంబ్రీ రెండు స్థానాలు కోల్పోయి 85వ ర్యాంకుకు పడిపోయినప్పటికీ భారత్ తరఫున ఇదే మెరుగైన ర్యాంకు. రామ్‌కుమార్ రామనాథన్ 120వ, సుమిత్ నాగల్ 225వ, అర్జున్ ఖడే 397వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. డబుల్స్‌లో రోహన్ బోపన్న ఒక స్థానం కోల్పోయి 23వ ర్యాంకులో, దివిజ్ శరణ్ రెండు స్థానాలు కోల్పోయి 43వ ర్యాంకులో, లియాండర్ పేస్ కూడా రెండు స్థానాలు కోల్పోయి 50వ ర్యాంకులో ఉన్నారు. ఆటకు దూరమైన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకుల్లో 24వ స్థానానికి పడిపోయింది. ప్రార్థన తొంబరే 164వ ర్యాంకులో ఉంది. -
యూకీ@ 83
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాడు యూకీ బాంబ్రీ రెండేళ్ల రెండు నెలల తర్వాత ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–100లోకి వచ్చాడు. తైపీ చాలెంజర్ టైటిల్ నెగ్గిన అతడు ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 83వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తనకిదే కెరీర్ అత్యుత్తమం. ఇదిలాగే కొనసాగితే బాంబ్రీ... ఏటీపీ 1000 మాస్టర్స్ సిరీస్ టోర్నీలకు నేరుగా అర్హత సాధిస్తాడు. యూకీ మూడేళ్ల క్రితమే టాప్–100లోకి వచ్చినప్పటికీ గాయాల కారణంగా దానిని నిలబెట్టు కోలేకపోయాడు. తాజా ర్యాంక్‌పై మాట్లాడుతూ ‘ఇదింకా ప్రారంభమే. చాలా దూరం పయనించాల్సి ఉంది. సవాళ్లను ఎదుర్కోవడం పైనే నా దృష్టి. టాప్–50 ర్యాంక్ గురించి ఆలోచించడం లేదు’ అని అన్నాడు. మరోవైపు బాంబ్రీ డేవిస్ కప్ సహచరుడు రామ్‌కుమార్ 17 స్థానాలు మెరుగుపర్చుకుని 116వ ర్యాంక్‌లో నిలిచాడు. -
రెండో రౌండ్‌కు యూకీ బాంబ్రీ
ఏటీపీ మాస్టర్స్ టోర్నీ ఇండియన్ వెల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో అతను నికోలస్ మహుత్ (ఫ్రాన్స్)పై 7–5, 6–3తో విజయం సాధించాడు. ఏటీపీ టూర్లో తొలిసారి వీరిద్దరు తలపడిన ఈ మ్యాచ్ గంట 41 నిమిషాల పాటు సాగింది. ఈ పోరులో బాంబ్రీ 3 ఏస్‌లు సంధించాడు. రెండో రౌండ్లో అతను ప్రపంచ 12వ ర్యాంకర్ ల్యూకాస్ పౌలీ (ఫ్రాన్స్) తలపడతాడు. తొలి రౌండ్లో ల్యుకాస్కు ‘బై’ లభించింది. -
రెండో రౌండ్లో యూకీ, రామ్‌కుమార్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేశారు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 1–6, 6–3, 6–4తో బ్రాడ్లీ షునెర్ (కెనడా)పై, రామ్‌కుమార్ 6–7 (8/10), 7–6 (7/3), 6–2తో బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)పై గెలిచారు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–1, 1–6, 2–6తో తొబియాస్ కామ్‌కే (జర్మనీ) చేతిలో... సుమీత్ నాగల్ 6–7 (5/7), 6–3, 3–6తో గియానెస్సి (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. -
యూకీ, రామ్ ఓటమి
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ రెండో రౌండ్లో నిష్క్రమించారు. 2014 యూఎస్ ఓపెన్ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ 4–6, 3–6తో ఓటమి చెందగా... యూకీ బాంబ్రీ 6–4, 3–6, 4–6తో ఎనిమిదో సీడ్ పియరి హ్యూస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో యూకీ–దివిజ్ జంట 6–2, 6–2తో లాస్లో జెరీ (సెర్బియా)–బ్లాజ్ కావ్సిచ్ (స్లొవేనియా) జోడీపై విజయం సాధించింది. -
ఫైనల్లో యూకీ–దివిజ్ జంట
తాష్కెంట్ చాలెంజర్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ (భారత్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–దివిజ్ జంట 3–6, 7–5, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో గిలెర్మో గార్సియా లోపెజ్–ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) జోడీపై గెలిచింది. ఈ సీజన్లో ఏడు టోర్నీలు ఆడిన యూకీకిదే తొలి డబుల్స్ ఫైనల్ కాగా... దివిజ్‌కు రెండో ఫైనల్. -
యూకీ బాంబ్రీ ఓటమి
కర్షి: ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న కర్షి ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో అన్‌సీడేడ్, ప్రపంచ 273వ ర్యాంకర్ యూకీ 1–6, 4–6తో ప్రపంచ 225వ ర్యాంకర్, ఈగర్ గరాసిమోవ్ (బెలారస్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా మూడుసార్లు సర్వీస్ కోల్పోయిన భారత స్టార్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఈ సీజన్లో యూకీకిది మూడో సెమీస్ ఓటమి కావడం విశేషం. జుహయ్, షెంజాన్ టోర్నీలో యూకీ సెమీస్‌లోనే ఓడిన సంగతి తెలిసిందే.